మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పిన దుల్కర్‌.. దర్శకుడు ఎవరంటే..!

మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పిన దుల్కర్‌.. దర్శకుడు ఎవరంటే..!

'మహానటి'తో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మలయాళ నటుడు, మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్‌. ఇక ఈ మూవీ విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి అవుతుండగా..

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Aug 01, 2020 | 2:30 PM

‘మహానటి’తో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మలయాళ నటుడు, మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్‌. ఇక ఈ మూవీ విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి అవుతుండగా.. తాజాగా మరో తెలుగు చిత్రానికి దుల్కర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ‘అందాల రాక్షసి’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి ఆ తరువాత ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ రెండు చిత్రాల తరువాత ఆయన తెరకెక్కించిన ‘లై’, ‘పడి పడి లేచే మనసు’ ఫ్లాప్‌లు అవ్వడంతో.. ఈ దర్శకుడు కాస్త డీలా పడ్డారు.

ఇక తాజా సమాచారం ప్రకారం ఇటీవల ఈ దర్శకుడు దుల్కర్‌కు ఓ కథను వినిపించారట. ఆ కథ దుల్కర్‌కు బాగా నచ్చేయడంతో.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక రొమాంటిక్‌ కథగా తెరకెక్కబోతున్న ఈ మూవీని మహానటిని నిర్మించిన స్వప్న సినిమాస్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు టాక్‌. లాక్‌డైన్‌ ఎత్తేసిన తరువాత ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: గ్యాస్‌ లీక్ ఘటనలపై ఆందోళనలకు ఇది సమయం కాదు: పవన్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu