బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగుతోపాటు.. హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషలలో ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగు మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. సెకండ్ సీజన్ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేసారు. ఇక సీజన్ 3 నుంచి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సీజన్ 6 వరకు నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హోస్టింగ్లోనూ నాగ్ తన ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఫార్మల్ డ్రెసెస్ కాకుండా.. ట్రెండీ స్టైల్స్ తో ఆకట్టుకుంటున్నారు. రంగు రంగుల చొక్కాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. శని, ఆదివారాల్లో స్టేజ్ పై నాగ్ స్టైల్ చేస్తే ఫిదా అవ్వాల్సిందే. షర్ట్స్, టీ షర్ట్స్ తో డిఫరెంట్ గా కనిపిస్తుంటారు.
అయితే నాగ్ వేసుకునే డ్రెసెస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నాగ్ వేసుకునే షర్ట్స్ అన్ని లక్షల్లోనే ఉంటాయట. అంతేకాదు.. అవి టాప్ బ్రాండ్ షర్ట్స్ అంటూ ఓ వీడియో సైతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ Louis Vuitton, Gucci, Fendi, Off White, Prada అన్ని నాగ్ వేస్తుంటారని.. ఒక్కొక్కటి రూ. 75 వేల నుంచి రూ. 2 లక్షలకు పైగానే ఉంటాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది.
దీంతో ఎక్కడనైన మన్మధుడి స్టైలే వేరంటూ నాగ్ ఫ్యాన్స్ అంటుంటే.. నాగ్ వేసే షర్ట్స్ మాత్రం చూసేందుకు అంత ధర ఉన్నట్టుగా అనిపించవని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
— Hardin (@hardintessa143) December 8, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.