ఎప్పుడో చిన్నప్పుడు చూసాం..! వెన్నెల ప్రోగ్రాం యాంకర్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

టీవీ షోల ద్వారా చాలా మంది యాంకర్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది యాంకర్స్ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. సుమ , అనసూయ, ఉదయభాను ఇలా చాలా మంది యాంకర్స్ రాణిస్తున్నారు. సీనియర్స్ మాత్రమే కాదు స్రవంతి చొక్కారపు, రష్మి, శ్రీముఖి, ఝాన్సీ, విష్ణు ప్రియ, శ్యామల ఇలా చాలా మంది ఉన్నారు.

ఎప్పుడో చిన్నప్పుడు చూసాం..! వెన్నెల ప్రోగ్రాం యాంకర్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
Vennela

Updated on: Aug 16, 2025 | 10:40 AM

టాలీవుడ్‌ బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్‌ యాంకర్లు చాలామందే ఉన్నారు. సుమ, ఝాన్సీ, రష్మీ, అనసూయ, శ్రీముఖి, లాస్య, రవి, ప్రదీప్.. ఇలా చాలామంది యాంకరింగ్‌లో తమదైన ముద్ర వేసుకున్నారు. తమ ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు చాలా మంది యాంకర్స్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. మొన్నటికి మొన్న బిగ్ బాస్ లో కనిపించిన వారు కూడా ఇప్పుడు యాంకర్స్ లుగా మారి సందడి చేస్తున్నారు. అయితే వీరిలా కాకపోయినా ఉన్నంతలో యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది ఓ ముద్దుగుమ్మ. ఒకప్పుడు చాలా మందికి ఆమె అభిమాన యాంకర్.. టీవీలో ఆమె రోజూ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న యాంకర్ ను గుర్తుపట్టారా.?

Chiranjeevi: అన్నయ్య నాకు దేవుడు.. లక్షరూపాయిల కోసం ఫోన్ చేస్తే కోటి ఇచ్చారు..

యాంకర్ జయంతి. పేరు చెబితే చాలామందికి గుర్తుకురాకపోవచ్చు కానీ గతంలో జెమినీ మ్యూజిక్ ఛానెల్‌లో టెలికాస్ట్‌ అయిన ‘వెన్నెల’ ప్రోగ్రాం యాంకర్‌ అంటే ఇట్టే గుర్తుకు వస్తుందామె. జెమినీ మ్యూజిక్ ఛానెల్‌ ఆదిత్య టీవీగా మారాక అందులో రాత్రి 10 గంటలకు ‘వెన్నెల షో’ ప్రారంభమయ్యేది. ఈ షోకు దాదాపు 10 ఏళ్ల పాటు యాంకర్‌గా వ్యవహరించింది జయతి. తన ముద్దు ముద్దు మాటలతో, అందం అభినయంతో టీవీ ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

అయితే వెన్నెల తర్వాత మరే షోలోనూ యాంకరింగ్ చేయలేదు జయతి. అదే సమయంలో వెండితెరపైకి అడుగుపెట్టింది. 2018లో లచ్చి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిందీ అందాల యాంకరమ్మ. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మరోసారి బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ కనిపించలేదు జయంతి. మద్యంలో ఓ టీవీ షోలో సడెన్‌గా ప్రత్యక్షమైంది. ఇందులో ఓ పాటకు హుషారైన స్టెప్పులు వేసి ప్రేక్షకులను, అభిమానులను అలరించింది. దీంతో యాంకర్ జయతి పేరు మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. ఆతర్వాత మళ్లీ సైలెంట్ అయ్యింది. అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉందా అని చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. అయితే జయంతి ఇప్పుడు చాలా మారిపోయింది. ఇప్పుడు మరింత అందంగా మారిపోయింది ఆ చిన్నది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చూస్తే దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..! వర్షాకాలంలో వేడిపుట్టిస్తున్న సినిమా.. ఒంటరిగా మాత్రమే చూడండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.