
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడిన వారే. పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ఈ ప్రముఖ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఇతను ఒకపపుడు రోడ్డుపై రెండు రూపాయల పెన్నులు విక్రయించాడు. కానీ తన కష్టంతో ఇప్పుడు నెలకు ఏకంగా రూ. 24 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు. ఇతను చదువుకునే రోజుల్లోనే యాక్టర్ అవ్వాలని కలలు కున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా నాటకాలు వేశాడు. రైల్వే పరీక్ష రాసేందుకు ముంబై వెళ్లిన అతను నటుడవ్వాలనే లక్ష్యంతో ఆ మహా నగరంలోనే ఉండిపోయాడు. తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో నిద్ర పోయాడు. ఇక అప్పుడే పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు చేయడం ప్రారంభించాడు. రోడ్డుపై పెన్నులు అమ్మడం, డ్రామాల్లో చిన్న చిన్న రోల్స్ చేయడం వంటివి చేశాడు. ఈ క్రమంలో యాక్టర్ గా అతని మొదటి సంపాదన కేవలం రూ. 95 మాత్రమే. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఇలా కష్టపడుతున్న టైమ్‌లోనే అతనికి ఒక కమర్షియల్ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. అది బాగా ఫేమస్ అవ్వడంతో ఈ నటుడి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ , షోలోనూ అతనికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడీ నటుడు నెలకు ఏకంగా 20 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు. అతని పేరు యోగేష్ త్రిపాఠి.
మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా యోగేష్ త్రిపాఠి గురించి తెలియకపోవచ్చు కానీ.. హిందీ సినిమాలు, సీరియల్స్ చూసే వారికి ఈ పేరు బాగా పరిచయమే. ఎఫ్‌ఐఆర్, ఘర్, జీజాజీ ఛత్‌పర్ వంటి టీవీ షోల్లో నటించి బాగా ఫేమస్ అయ్యాడు యోగేష్. ముఖ్యంగా ‘భాభీజీ ఘర్ పర్ హై’ షోలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ హప్పు సింగ్ రోల్ తో యోగేష్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. దీని తర్వాత యోగేష్ లీడ్ రోల్ తో హప్పుకీ ఉల్టా పల్టా పేరుతో ప్రత్యేక టీవీ షోన ప్రారంభిచాడు.
కాగా ప్రస్తుతం యోగేష్ ప్రస్తుతం రోజుకు సుమారు రూ.60,000 సంపాదిస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నెలకు రూ.24 లక్షలు సంపాదిస్తున్నారా? అని అడిగితే.. ‘అవును’ అని క్యూట్ స్మైల్ ఇచ్చాడు యోగేష్. ముంబైలో ఇప్పుడు అతడికి నాలుగు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇదంతా తన కష్టార్జితమని, ఎవ్వరినీ రూపాయి అప్పు అడగలేదని యోగేశ్ గర్వంగా చెబుతుంటాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.