రానా-రవితేజ..ఆ రీమేక్‌లో..
మల్టీస్టారర్ సినిమాలు విషయంలో టాలీవుడ్ జోరు పెంచిన విషయం తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా తాజాగా తెలుగు పరిశ్రమలో మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మల్టీస్టారర్ సినిమాలు విషయంలో టాలీవుడ్ జోరు పెంచిన విషయం తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీతో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా తాజాగా తెలుగు పరిశ్రమలో మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ మహరాజ్ రవితేజ, రానా కలిసి మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే అఫిషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మాస్ మహరాజ్, రానా కలిసి నటించబోతున్నారనే వార్త తెలియగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి.
షూటింగులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ చిత్రంతో పాటు నితిన్ ‘రంగ్‌దే’, నాని ‘శ్యామ్ సింగరాయ్’, నాగశౌర్య – లక్ష్మీ సౌజన్య కలయికలో సినిమాల్ని ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లానింగ్ సిద్దం చేసింది.
