Brahmamudi, September 18th Episode: డబ్బులిస్తా భార్యగా ఉండమన్న రాజ్.. శివాలెత్తిన కావ్య!

|

Sep 18, 2024 | 1:49 PM

కావ్య రాను అనడంతో.. ఇందిరా దేవి, సీతారామయ్య దిగాలుగా ఇంటికి వస్తారు. వాళ్లను చూసి ఏంటి ఆ మహారాణి ఎక్కడ? ఓహో ఆవిడ గారు కారులో ఉన్నారా.. అని వెటకారంగా అడుగుతాడు రాజ్. నువ్వు ఆగు రాజ్.. మావయ్య గారూ కావ్య ఏది? అని అపర్ణ అడిగితే.. రానంది చెప్తాడు. నేను చెప్పాను కదా.. అది రాదు.. మీరు వెళ్తే అవమానంతో తిరిగి వస్తారని.. మీరు వెళ్లి ఏం సాధించారు? మీ పెద్దరికం పోవడం తప్ప అని రాజ్ చిర్రు బుర్రులాడుతూ ఉంటాడు. అవునా అది ఎవరి వల్ల.. నీ వల్లనే కదా..

Brahmamudi, September 18th Episode: డబ్బులిస్తా భార్యగా ఉండమన్న రాజ్.. శివాలెత్తిన కావ్య!
Brahmamudi
Image Credit source: Disney Hotstar
Follow us on

కావ్య రాను అనడంతో.. ఇందిరా దేవి, సీతారామయ్య దిగాలుగా ఇంటికి వస్తారు. వాళ్లను చూసి ఏంటి ఆ మహారాణి ఎక్కడ? ఓహో ఆవిడ గారు కారులో ఉన్నారా.. అని వెటకారంగా అడుగుతాడు రాజ్. నువ్వు ఆగు రాజ్.. మావయ్య గారూ కావ్య ఏది? అని అపర్ణ అడిగితే.. రానంది చెప్తాడు. నేను చెప్పాను కదా.. అది రాదు.. మీరు వెళ్తే అవమానంతో తిరిగి వస్తారని.. మీరు వెళ్లి ఏం సాధించారు? మీ పెద్దరికం పోవడం తప్ప అని రాజ్ చిర్రు బుర్రులాడుతూ ఉంటాడు. అవునా అది ఎవరి వల్ల.. నీ వల్లనే కదా.. అని పెద్దావిడ అంటుంది. నన్ను అంటున్నారు? ఏంటి? అని రాజ్ అంటే.. అక్కడికి వెళ్లాకే అర్థమైంది.. తన మనసు ఎంత బాధ పడిందో అని ఇందిరా దేవి అంటుంది. సరే ఇక మానేయమని రాజ్ అంటాడు. మేము మానేస్తాం.. కానీ కావ్యని తీసుకు రావాల్సింది నువ్వేనని సీతారామయ్య అంటాడు. నేను వెళ్లాలా.. అది మాత్రం జరగదని రాజ్ అంటాడు. వెళ్లి తీరాలి.. తనను అవమానించి.. ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసింది నువ్వు.. కాబట్టి నువ్వే వెళ్లి పిలవాలి అని ఇందిరా దేవి అంటుంది.

అడుక్కుంటావో ఏం చేస్తావో మాకు తెలీదు..

వెళ్లి బతిమలాడతావో.. ఇంటికి వెళ్లి అడుక్కుంటావో.. మాకు తెలీదు. కానీ కావ్యని నువ్వే వెళ్లి తీసుకురావాలని అంటుంది. వీళ్లందరూ రాజ్‌ని రెచ్చగొట్టి.. కావ్యని తీసుకొచ్చేలా ఉన్నారని రుద్రాణి భయ పడుతూ.. కావాలనే రాజ్‌ని రెచ్చగొట్టేలా.. కావ్యనే కదా తప్పు చేసిందని అంటుంది. అత్తయ్యా.. కావ్య తప్పు చేయదని ఈ ఇంట్లో అందరికీ తెలుసు. అపర్ణ ఆంటీ లేని సమయం చూసుకుని నువ్వు అడ్డంగా రెచ్చిపోయావు.. అది ఇప్పుడు జరగదని స్వప్న కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత రుద్రాణికి సుభాష్‌ కూడా వార్నింగ్ ఇస్తాడు. మీరు ఆపండి.. రేయ్ నువ్వు ఇప్పుడే వెళ్లి కావ్యని తీసుకురావాలని అపర్ణ, ఇందిరా దేవి అంటారు.

నా భార్య కాళ్లు పట్టుకుని తీసుకొస్తా..

సరే మమ్మీ నేను వెళ్లి నా భార్య కాళ్లు పట్టుకుని తీసుకొస్తా. కానీ ఆవిడ గారు రాకపోతే నన్ను వదిలేయండి.. మళ్లీ ప్రయత్నం చేయమని అడగకూడదని రాజ్ వెళ్తాడు. మరోవైపు రాహుల్, రుద్రాణిలు కలిసి స్వప్నను బోల్తా కొట్టిద్దామని ప్లాన్ వేస్తారు. కానీ స్వప్న తెలివిగా.. రాహుల్, రుద్రాణిలను రివర్స్ దెబ్బ కొడుతుంది. దీంతో రాహుల్, రుద్రాణిలు షాక్‌ అవుతారు. మరోవైపు కనకం, కృష్ణమూర్తిలు కావ్య గురించి బాధ పడుతూ ఉంటారు. అప్పుడే రాజ్ ఇంటికి వస్తాడు. రాజ్‌ని చూసి కనకం వాళ్లు సంతోష పడతారు. లోపలికి రమ్మని రాజ్‌ని పిలుస్తాడు. కానీ రాజ్ అర్థం కాని భాషలో మాట్లాడే సరికి కనకం వాళ్లు తికమక పడతారు. అప్పుడే కావ్య లోపలి నుంచి బయటకు వస్తుంది. రాజ్‌ని చూసినా పట్టించుకోకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మళ్లీ పెళ్లి చేసుకోండి..

మధ్యలో మాట్లాడకూడదని కనకం వాళ్లు లోపలికి వెళ్తారు. రాజ్ సకిలించినా కావ్య పట్టించుకోదు. ఏంటి నేను వస్తే పట్టించుకోకుండా పని చేసుకుంటున్నావ్? అని రాజ్ అంటాడు. మీరు రాగానే మీ కాళ్ల మీద పడిపోయి.. మీతో రావాలా.. అని కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. రా.. రా.. అని రాజ్ అంటే కావ్య ఎక్కడికి అంటుంది. మా ఇంటికి అని రాజ్ చెప్తే.. మా ఇల్లు ఉందిగా నేను ఎందుకు అని అంటుంది. మా అమ్మ తీసుకు రమ్మని రాజ్ అంటే.. ఎందుకో అని కావ్య అంటుంది. ఆ.. మా ఇల్లు చీకటిగా ఉందట.. దీపం పెట్టడానికి రమ్మని అని రాజ్ అంటాడు. దీపం పెట్టడానికి నేను ఎందుకు.. వేరే వాళ్లను చూసుకోండి. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకుని.. మళ్లీ పెళ్లి చేసుకుని ఆవిడతో దీపం వెలిగించమని కావ్య అంటుంది. నువ్వు రాకపోతే కాళ్లు పట్టుకుని అయినా తీసుకెళ్తాను. నువ్వు కోరుకున్నట్టుగానే వచ్చాను కదా.. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ.. మా ఇంట్లో దీపం వెలిగించు అని అడుక్కోవడానికే వచ్చానని రాజ్ అంటాడు.

ఇదంతా నువ్వు ప్లాన్ చేశావు కదా..

మీ అమ్మ గారు చెప్తే వచ్చారా.. మీ తాతయ్య, నాన్నమ్మ బలవంతం చేస్తే వచ్చారా అని కావ్య అడిగితే.. ఎందుకో అందుకు వచ్చాను.. వచ్చి చావొచ్చు కదా అని రాజ్ అంటాడు. చచ్చే వచ్చాను.. మళ్లీ వచ్చి మళ్లీ చచ్చేంత ఓపిక నాకు లేదని కావ్య అంటుంది. అయినా రాజ్ ఎగతాళిగా మాట్లాడతాడు. నేను జీవితంలో రాకుండా చేయకుండానికి వచ్చారా అని కావ్య అడుగుతుంది. అయినా తగ్గని ఇగో పర్సన్ రాజ్.. వెటకారంగా మాట్లాడతాడు. అంతే కానీ.. మీరు అన్న మాటల్ని వెనక్కి తీసుకోవడానికి రాలేదన్నమాట.. మీ ఉదరా బుద్ధికి.. ఓ నమస్కారం. నా బదులు ఈ బొమ్మను ఇస్తాను. తీసుకెళ్లి షోకేజ్‌లో పెట్టుకోండి. దీంతో బలవంతంగా కాపురం చేయాల్సిన పని లేదు. కాళ్లు పట్టుకుని రమ్మని అనాల్సిన పని కూడా లేదని కావ్య అంటుంది. అర్థమైంది.. నాకు తెలుసు.. నేను వస్తే ఇలాగే మాట్లాడతావని.. నేను వస్తే ఇలాగే చెప్పడానికి నువ్వు ప్లాన్ చేశావని రాజ్ ఉక్రోశంతో అంటాడు.

ఇంటి గడప తొక్కనని తెగేసి చెప్పిన కావ్య..

అదేంటి మీకు ఈ మధ్య అన్నీ ముందే తెలిసి పోతున్నాయా.. ముఖ్యంగా నేను ఏం అనుకుంటున్నానో ఇట్టే కనిపెట్టేస్తున్నారు.. దయ చేయమని కావ్య అంటుంది. నీ అసలు స్వరూపం ఇదని వాళ్లకు తెలీక వాళ్లు ఆశ పడ్డారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి ఏం చెప్పాలి అని రాజ్ అంటాడు. మీను దమ్ముంటే.. మనస్సాక్షి ఉంటే ఇక్కడ మీరు అన్న మాటలు అన్నీ చెప్పమని కావ్య అంటుంది. నిన్ను తీసుకెళ్లకుండా.. నేను ఒక్కడినే వెళ్తే మా అమ్మ ఊరుకోదని రాజ్ అంటే.. అది మీ పని నాకు సంబంధం లేదని కావ్య అంటుంది. సరిగ్గా మాట్లాడండి.. రావే పోవే అనడానికి ఇప్పుడు నేను మీ పెళ్లాన్ని కాదు.. నాకూ మీకూ ఎలాంటి సంబంధం లేదని కావ్య అంటుంది. ఏ సంబంధం లేదా అని రాజ్ షాక్ అవుతాడు. అది మీరు అన్నదే మహాశయ అని కావ్య అంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తే మా ఇంటికి వస్తావు? అని రాజ్ అంటే.. నేను ఈ జీవితంలో మీ ఇంటి గడప తొక్కనని కావ్య తెగేసి చెప్పేస్తేంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..