Brahmamudi, September 10th Episode: రుద్రాణి ప్లాన్ సక్సెస్.. దుగ్గిరాల ఇంట్లో ముగిసిన కావ్య పాత్ర..

|

Sep 10, 2024 | 2:37 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణకు ఏం కాదని సుభాష్ సర్ది చెబుతూ ఉంటాడు. ఆ మాట నాకెందుకు చెబుతున్నారు? మమ్మీకి బాగానే ఉంటుందని రాజ్ అంటాడు. రాజ్ ప్రవర్తనను చూసిన కళ్యాణ్.. సుభాష్‌ని పక్కకు తీసుకెళ్లి.. అన్నయ్యను చూస్తే భయంగా ఉంది పెదనాన్న. అస్సలు కంట్రోల్‌లో లేడు. ఈ సమయంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. ఇంటికి తీసుకెళ్లమని చెబుతాడు. వాడు నా మాట ఎక్కడ వింటున్నాడురా అని సుభాష్ అంటాడు. అన్నయ్యా రా..

Brahmamudi, September 10th Episode: రుద్రాణి ప్లాన్ సక్సెస్.. దుగ్గిరాల ఇంట్లో ముగిసిన కావ్య పాత్ర..
Brahmamudi
Image Credit source: Disney Hot star
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణకు ఏం కాదని సుభాష్ సర్ది చెబుతూ ఉంటాడు. ఆ మాట నాకెందుకు చెబుతున్నారు? మమ్మీకి బాగానే ఉంటుందని రాజ్ అంటాడు. రాజ్ ప్రవర్తనను చూసిన కళ్యాణ్.. సుభాష్‌ని పక్కకు తీసుకెళ్లి.. అన్నయ్యను చూస్తే భయంగా ఉంది పెదనాన్న. అస్సలు కంట్రోల్‌లో లేడు. ఈ సమయంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. ఇంటికి తీసుకెళ్లమని చెబుతాడు. వాడు నా మాట ఎక్కడ వింటున్నాడురా అని సుభాష్ అంటాడు. అన్నయ్యా రా.. పెదనాన్న చాలా టెన్షన్ పడుతున్నాడు. నువ్వే ధైర్యం చెప్పాలి. ఇంటికి తీసుకెళ్లమని కళ్యాణ్ అంటాడు. డాడ్ ఎందుకు భయం.. ఏం కాదని అంటాడు రాజ్. పెద్దమ్మకు ఏం కాదు.. ఈ పరిస్థితిలో పెదనాన్నని ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు.. నువ్వు తీసుకెళ్లమని రాజ్ అంటాడు. దీంతో సుభాష్ కూడా అంటాడు. ఎలాగోలా ఒప్పించి రాజ్‌ని తీసుకెళ్తాడు సుభాష్. కళ్యాణ్ ఆస్పత్రిలో ఉంటాడు.

రెచ్చిపోయిన రుద్రాణి..

మరోవైపు ఇంట్లో రాజ్, సుభాష్‌ల కోసం అందరూ ఎదురు చూస్తారు. రాజ్ వాళ్ల కోసం ఎదురు చూస్తూ.. ఎప్పుడు కావ్యని ఇంట్లోంచి గెంటేద్దామా అని రాహుల్, రాద్రాణిలు ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే రాజ్ వాళ్లు ఇంటికి వస్తారు. ఎలా ఉందని ఇందిరా దేవి అడుగుతుంది. ఎలా ఉండటం ఏంటి? చూశారు కదా.. అని రాజ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు. అప్పుడే రుద్రాణి రెచ్చిపోతుంది. ఇదిగో ఈ మహాతల్లి వల్లనే వదిన ప్రాణాల మీదకు వచ్చింది. ఏయ్ నీకు రాజ్ ఏం చెప్పాడు. నీకు రాజ్ ఏం చెప్పాడు.. మా వదినను బాగా చూసుకోమని చెప్పాడు కదా.. చూసుకుంటానని చిలక పలుకులు పలికావు కదా.. మరి ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు? మా వదినకు ఇప్పుడు ఏమన్నా అయితే ఆ నష్టం ఎవరు పూడ్చుతారు? మాట్లాడు.. అని కావాలానే రెచ్చిపోతుంది.

ఎందుకు వెళ్లావని అడిగిన ఇందిరా దేవి..

అత్తా అసలే రాజ్ బాధలో ఉన్నాడు. సమస్యను ఇంకా పెద్దది చేయకని స్వప్న అంటుంది. ఏయ్ ఇవాళ నువ్వు నోరు ఎత్తావంటే ఊరుకోను. కట్టు బట్టలతో బయటకు గెంటేస్తా. ఇది మా వదిన ప్రాణాలకు సంబంధించిన సమస్య. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా.. బాధ్యత తెలిసిన మనిషిని దోషిని చేయడం పద్దతి కాదని ఇందిరా దేవి అంటుంది. చెప్పు ఏంటి కావ్య.. ఎందుకు ఇందరితో మాటలు పడుతున్నావు? ఎక్కడికి వెళ్లావు? ఎందుకు వెళ్లావు? అని ఇందిరా దేవి అంటుంది. కారణం ఖచ్చితంగా చెప్తాను అమ్మమ్మా.. అంత బాధ్యత లేకుండా నేను ఉండనని కావ్య అంటుంది. మరి అపర్ణను వదిలి ఎందుకు వెళ్లాలి అని ఇందిరా దేవి అంటుంది.

ఇవి కూడా చదవండి

ఇరికించిన రుద్రాణి.. చిక్కుల్లో కావ్య..

దీంతో జరిగింది అంతా చెబుతుంది కావ్య. మీరు ఇప్పుడు రాకపోతే ఇంటి పరువు పోతుందని అన్నాడు. అయినా నేను పట్టించుకోలేదు. కానీ అత్తయ్య చెబితేనే వెళ్లాను. అత్తయ్య ఆయనకు కాల్ చేసి రమ్మంటాను అని చెప్పారు. అందుకే వెళ్లానని కావ్య అంటుంది. ఇంకా ఎంత కాలం నా కొడుకు మీద నిందలు వేస్తావు? ఇంకా వాడిని వదిలి పెట్టవా? ఫేక్ ఫ్రూవ్స్ చూపించి.. అరెస్ట్ చేయించావు.. సరిపోలేదా? అని రుద్రాణి అంటుంది. రుద్రాణి గారూ ఇదంతా ఎలా జరిగిందో.. ఎందుకు జరిగిందో తెలీడం లేదు. నా అంతట నేను ఏ నింద వేయాలని చూడటం లేదు. నిజంగానే నాకు ఫోన్ వచ్చింది. అత్తయ్య గారెకి నేను చెప్పాను. అత్తయ్య చెబితేనే నేను వెళ్లానని కావ్య అంటుంది. సరే వెళ్లావు.. ఎవరు నీకు ఫోన్ చేశారు? మా అన్నయ్యలు, రాజ్‌ వాళ్లు ఉండగా.. నీకే ఎందుకు ఫోన్ చేశారు.. అన్నీ అబద్ధాలే.. ఏం నిజాలు లేవని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత కావ్య ఎంత చెప్పినా రుద్రాణి కొట్టి పారేస్తుంది. కావాలనే ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి ఇరికించేస్తుంది.

కావ్యని నమ్మని రాజ్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య..

కంపెనీకి నష్టం జరుగుతుందని.. సంస్థ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని వెళ్లాను. ఈ దుగ్గిరాల ఇంటి కోడలిగా అది నా బాధ్యత అని వెళ్లాను. చూడండి రుద్రాణి గారు.. ఇప్పుడు మీకు అవకాశం దొరికిందని.. మా అత్తయ్య పరిస్థితిని అడ్డం పెట్టుకుని మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు.. ఇక చాలు ఆపండి అని కావ్య అంటుంది. స్టాపిట్.. అవన్నీ పక్కన పెట్టు.. గుడికి వెళ్లే ముందు నేను ఏం చెప్పి వెళ్లాను? మరి ఎలా వదిలేసి వెళ్లావు? అని రాజ్ అడుగుతాడు. అవును ఏవండీ.. నేను వెళ్లకపోతే ఇంటి పరువు పోతుందని కావ్య చెబుతుండగా.. రాజ్ ఆవేశ పడుతూ ఉంటాడు. కంపెనీకి నష్టం వస్తే వచ్చింది.. నీకెందుకు? అని అడుగుతాడు. నీ వల్ల మా అమ్మ ప్రాణాల మీదకు వచ్చింది. మా అమ్మకు ఏదన్నా జరగరానిది జరిగితే ఏంటి? అని అంటాడు. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నన్ను నమ్మమని కావ్య అంటుంది. రాజ్.. కావ్య ఎలాంటి మనిషో.. ఎంత బాధ్యతగా ఉంటుందో ఇక్కడ అందరికీ తెలుసు. మీ అమ్మ గారు అంటే ఎంత గౌరవమో తెలుసు.. అన్నీ తెలిసి కూడా ఇలా ఆవేశ పడితే ఎలా? అని స్వప్న అంటుంది. నువ్వు ఏం చేప్పినా నేను వినను.. అయిపోయింది.. నమ్మకం పోయింది.. నువ్వు తప్పు చేశావు.. నీ వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. ఒక వేళ జరగరానిది జరిగితే.. నిన్ను జీవితంలో క్షమించనని రాజ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.