ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాహుల్‌ని అడ్డంగా ఇరికిం చేస్తుంది అపర్ణ. గుడిలో వేరే అమ్మాయితో షికార్లు కొడుతున్నాడని చెప్పి.. అగ్గి రాజేస్తుంది వెళ్లిపోతుంది. ఇక రాహుల్‌ని తగులుకుంటుంది స్పప్న. చెప్పు కారులో షికారుకు తీసుకెళ్లిన అమ్మాయి ఎవరు? ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే ముసుగు వేసి కొడతానని ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్తుంది స్వప్న. మమ్మీ కాపాడు అని చెప్పినా పట్టించుకోదు. ఇక తన రేంజ్‌లో రాహుల్‌ని వాయిస్తుంది స్వప్న. ఆ తర్వాత కావ్యని కూరగాయలు తీసుకు రావడానికి పంపిస్తుంది కనకం. అప్పుడే సడెన్‌గా అనామిక ఇంటికి వస్తుంది. అనామికను చూసి కావ్య, కనకంలు షాక్ అవుతారు. నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్లడమా.. నాకు నచ్చలేదని అనామిక అంటుంది. అనామికకు గట్టి పంచ్ ఇస్తుంది కనకం.
నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్? అని కావ్య అడుగుతుంది. నువ్వు మా కంపెనీ డిజైనర్‌వి కదా.. అందుకే తీసుకెళ్దామని వచ్చానని అనామిక అంటుంది. నిన్ను కొట్టి, తిట్టి చెప్పినా అర్థం కాదా? అని కావ్య అంటే.. ఎందుకంటే నీకు మరో ఆప్షన్ లేదు. నువ్వు బాగా ఆలోచించు.. మన ఎక్స్ అత్తగారి ఇంట్లో నీ టాలెంట్‌కి ఏడన్నా గుర్తింపు దొరికిందా? పోనీ కనీసం నిన్ను డిజైనర్‌గా అయినా గుర్తించాడా.. కానీ నేను చేశానని అనామిక అంటుంది. నువ్వు పెట్టిన ముళ్ల కిరీటం.. నా తెలివి తక్కువకి నిదర్శం. అందుకే మళ్లీ నేను ఆలోచించు పని చేస్తానని కావ్య అంటుంది. నీకు డబ్బు విలువ ఏం జరుగుతుంది? నా లాగా పుడితే తెలుస్తుందని కాదు. నేను వచ్చింది నిన్ను బతిమలాడి తీసుకెళ్లడానికి కాదు.. నీ అంతట నువ్వు వేరే గతి లేక రావాలని అనామిక అంటుంది. వ్యక్తిత్వం, విలువలు లేని వాళ్లతో పని చేయడం నాకు ఇష్టం లేదని కావ్య అంటుంది.
నువ్వు ఈ ఇంటి నుంచి కాలు బయట పెట్టగలవా.. నలుగురు మోసేలా చేస్తానని కనకం అంటే.. ఆవేశ పడకండి ఆంటీ.. కావ్య సంతకం చేసిన అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. ఆ అగ్రిమెంట్ కాదంటే.. శిక్ష పడటానికి కోర్టులు, జైలు కూడా ఉంటాయి. బాగా ఆలోచించుకో అని చెప్పి వెళ్తుంది అనామిక. దీంతో కావ్య, కనకంలు కంగారు పడతారు. ఈ అనామిక ఏం చేసుకుంటుందో చేసుకోని.. నేను దేనికైనా సిద్ధమని కావ్య అంటుంది. దీంతో అగ్రిమెంట్ లేకుండా చేయడానికి కనకం ప్లాన్ సిద్దం చేస్తుంది.
మరోవైపు.. అప్పూని కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయడానికి కళ్యాణ్ చాలా కష్ట పడతాడు. ఐదు వేలు ఇస్తాడు. అదేంటండీ.. నేను పది వేలు అడిగాను కదా.. అని కోచింగ్ సెంటర్ అతను అంటాడు. లేదండీ నేను ఆ డబ్బులు ఖచ్చితంగా అడ్జెస్ట్ చేస్తాను. ఈ లోపు తను క్లాసులు మిస్ అవుతుందని తీసుకొచ్చానని కళ్యాణ్ బతిమలాడతాడు. మీరు పది వేలు కట్టడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత 60 వేలు ఎలా కడతారు. ఇప్పుడు అందరూ ఇలానే అంటారు. ఆ తర్వాత నాకు టార్చర్ మొదలవుతుందని కోచింగ్ సెంటర్ అతను అంటే.. నచ్చజెప్పి ఖచ్చితంగా ఇచ్చేస్తాను.. నమ్మండి అని కళ్యాణ్ అంటాడు. ఇక కళ్యాణ్, అప్పూలు బయటకు వెళ్తారు. ఇంత రిస్క్ అవసరమా.. రెండు రోజుల్లో ఐదు వేలు ఎలా తీసుకొస్తావని అప్పూ అంటుంది. నీకు ఇప్పుడు అవకాశం వచ్చింది పొట్టలి.. ముందు నువ్వు దాని గురించి ఆలోచించమని కళ్యాణ్ అంటాడు.
ఆ తర్వాత రాజ్.. సీతారామయ్య దగ్గరకు వస్తాడు. తాతయ్యా ఏంటి పిలిచారట అని అడుగుతాడు. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అసలు ఏమన్నా అర్థం అవుతుందా? ఈ ఇంట్లో కావ్య పేరు తీసుకురాకూడదని నీ పాటికి నువ్వు డెసిషన్ తీసుకున్నావ్. నీ కోపాన్ని కంపెనీ విషయాల్లో ఎందుకు కలుపుతున్నావ్? అని పెద్దాయన అంటే.. మన కంపెనీకి అవార్డు రాకపోవడానికి కారణం నేను కదా.. ఆ కళావతి అని రాజ్ అంటాడు. ఇదే నీ సమస్య. నీ భార్య మీద ఉన్న కోపంతో బిజినెస్ మ్యాన్‌లా ఆలోచించడం లేదు. కావ్య లాంటి తెలివైన మనిషి మనవైపు లేకపోవడం.. కంపెనీ ఎదుగుదల కోసం కావ్యని మన కంపెనీ డిజైనర్‌గా మళ్లీ అపాయింట్ చేయమని సీతారామయ్య అంటాడు. అంటే నా మీద మీకు నమ్మకం లేదా? కళావతి లేకపోతే నేను కంపెనీ నడపలేనా? మీరు నన్నూ.. నా టాలెంట్‌ని అవమానించినట్టు అవుతుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రానివ్వను అని రాజ్ అంటాడు. ఇదే ఇగో అంటారు.. తప్పు చేస్తున్నావ్ రాజ్ అని సీతారామయ్య అంటే.. నేను ఏంటో నిరూపిస్తానని రాజ్ అంటాడు.
సామంత్ ఆఫీస్‌కి వచ్చిన ఇద్దరు.. జరగండి జరగండి అంటూ హడావిడి చేస్తారు. అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. ఏంటండీ ఇంత హడావిడి చేస్తున్నారని మేనేజర్ సురేష్ అడుగుతాడు. మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయంట. కేసు ఫైల్ చేయడానికి వచ్చారని కనకం మనుషులు అంటారు. అసలు ఏ జరిగింది? సడెన్‌గా ఈ విజిటింగ్ ఏంటి? అని సురేష్ అడుగుతాడు. మీ బాస్ సామంత్.. అతన్ని పట్టిన అనామిక ఎక్కడ? మీరు ఎంప్లాయిస్‌ని ఎక్కువగా ఇబ్బంది పెడున్నారట.. మీపై బలమైన ఫిర్యాదు వచ్చింది. ఏవి ఎక్కడ అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడ? అవన్నీ బయటకు తీయమని ఆర్డర్ చేస్తుంది.
భయపడిన సురేష్.. వెంటనే అగ్రిమెంట్స్ ఫైల్స్ తీసుకొస్తాడు. ఆ తర్వాత వాటర్ బాటిల్ తీసుకురమ్మని చెప్పి.. వెంటనే కావ్య అగ్రిమెంట్ పేపర్స్ చూడమంటుంది కనకం. మరోవైపు సురేష్ కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో కావ్య అగ్రిమెంట్ పేపర్స్ దొరుకుతాయి. వెంటనే వాటిని తీసుకుంటుంది కనకం. అప్పుడే అనామిక వచ్చి.. పిన్నీ అని అంటుంది. మిమ్మల్ని ఏమీ అనను. ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇలా ఇవ్వమని అనామిక అంటుంది. నేను ఇవ్వను అని కనకం అంటే.. పోలీసులకు ఫోన్ చేయమని అనామిక అంటుంది. దీంతో కనకం కంగారు పడుతుంది. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..