Brahmamudi, October 19th Episode: కంపెనీకి సిఈవోగా కళావతి.. రాజ్ పొగరు ఇక దిగనుంది..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఇందిరా దేవి, అపర్ణ, కనకంలు కలిసి నాటకం ఆడి కలుపుదాం అనుకునేలోపు రుద్రాణి అంతా చెడగొడుతుంది. నాటకం బయట పడటంతో రాజ్ రెచ్చిపోతాడు. నన్ను అందరూ కలిసి మోసం చేస్తారా.. ఇక జీవితంలో కళావతి ముఖాన్ని చూడనని అంటాడు. నెక్ట్స్ ఇంటికి వచ్చిన రాజ్‌.. మీరిద్దరూ నాతో మాట్లాడే హక్కును పోగొట్టుకున్నారని అపర్ణ, ఇందిరా దేవిలపై సీరియస్ అవుతాడు. ఇక నేను ఆ కళావతిని జీవితంలో చూడను..

Brahmamudi, October 19th Episode: కంపెనీకి సిఈవోగా కళావతి.. రాజ్ పొగరు ఇక దిగనుంది..
BrahmamudiImage Credit source: Disney hot star
Follow us

|

Updated on: Oct 19, 2024 | 12:18 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఇందిరా దేవి, అపర్ణ, కనకంలు కలిసి నాటకం ఆడి కలుపుదాం అనుకునేలోపు రుద్రాణి అంతా చెడగొడుతుంది. నాటకం బయట పడటంతో రాజ్ రెచ్చిపోతాడు. నన్ను అందరూ కలిసి మోసం చేస్తారా.. ఇక జీవితంలో కళావతి ముఖాన్ని చూడనని అంటాడు. నెక్ట్స్ ఇంటికి వచ్చిన రాజ్‌.. మీరిద్దరూ నాతో మాట్లాడే హక్కును పోగొట్టుకున్నారని అపర్ణ, ఇందిరా దేవిలపై సీరియస్ అవుతాడు. ఇక నేను ఆ కళావతిని జీవితంలో చూడను.. మాట్లాడను.. నమ్మను. ఇక ఒంటరిగానే బ్రతకాలని అనుకుంటున్నానని వెళ్లిపోతాడు. మీరు నాటకం ఆడింది వాళ్లను కలపడానికే కదా.. అందుకు నాటకం ఆడటం ఎందుకు.. వాడికి తెలిసేలా చేయమని సీతారామయ్య సలహా ఇస్తాడు. మరోవైపు కనకం, కావ్య, కృష్ణమూర్తిలు ఎంతో బాధ పడతారు.

మేము కలుస్తామన్న నమ్మకం లేదు..

ఏంటమ్మా ఇలా చేశావు.. అప్పటికీ నేను నిన్ను అడుగుతూనే ఉన్నాను కదా అయినా నిజం చెప్పలేదు. నా ప్రేమని ఆయన అస్సలు అర్థమే చేసుకోలేదని అంటుంది కావ్య. అమ్మా కావ్య మీ అమ్మని ఏమీ అనకు అమ్మా.. నువ్వు ఇంటికి వచ్చాక మీ అమ్మ ఎంతో బాధ పడింది. మేము ఎవరం చేయలేని పని.. కనకం చేసింది. కానీ చివరికి అందరితో మాటలు పడిందని అంటాడు కృష్ణమూర్తి. మీ అల్లుడు గారు అమ్మని మోసం చేసిందని అన్నారు కానీ.. ఎందుకు అలా చేసింది? అని ఆలోచించలేదు. ఈ రోజు జరిగిన దాని వల్ల మన మీద ఉన్న నమ్మకం పోయింది. అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. మేము కలుస్తామన్న నమ్మకం లేదని కావ్య అంటుంది. దీంతో కనకం చాలా బాధ పడుతుంది.

మీరు గుంట నక్కల కంటే దారుణం..

కనకం ఇంట్లో జరిగిన గొడవకు రుద్రాణి, రాహుల్‌లు ఇద్దరూ ఎంతో సంతోష పడుతూ ఉంటారు. రాజ్ లాంటి వాడిని క్యాన్సర్ అని నమ్మించి ఇద్దర్నీ కలిపేయాలని చూసింది ఆ కనకం అని రుద్రాణి అంటుంది. అమ్మో నువ్వు అడ్డుకోకపోతే.. కావ్య ఇంటికి వచ్చేదని రాహుల్ అంటాడు. అప్పుడే స్వప్న చప్పట్లు కొడుతూ వస్తుంది. అద్భుతం.. అమోఘం.. నేను ఏమో అనుకున్నాను కానీ.. ఒక్కమాటతో స్టోరీ మొత్తం మార్చేశావు. అందుకే ఇక నేను మీకు సరెండర్ అయిపోయాను. మీరు ఒక కొత్త రకమైన జాతి.. మీరు గుంట నక్కల కంటే దారుణం. బతికి ఉన్న మనుషులనే పీక్కి తింటారని స్పప్న అంటుంది. ఏంటి మమ్మల్ని తిడుతుంటే తెలుసుకోలేం అనుకున్నావా? అని రుద్రాణి అంటుంది. సంతోషం.. కనిపెట్టారా.. మా అమ్మ నాటకాలు ఆడినా అది మంచికే. మీలాగ కుటుంబాలు కూల్చదు. రేపు నాకు పుట్టబోయే బిడ్డను కూడా మా అమ్మ చేతికి ఇచ్చే పెంచుతానని స్పప్న అనేసి వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

ఆ రుద్రాణిని చంపేయాలి..

ఆ తర్వాత కనకం, ఇందిరా దేవి, అపర్ణలు కలుస్తారు. ఎవరికి వాళ్లు తిట్టుకుంటారు. వాళ్లిద్దర్నీ కలిపేద్దాం అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇంత జరిగాక అల్లుడు గారు నా కూతుర్ని క్షమిస్తారా? అని కనకం అంటుంది. వాడి మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఎలా చెరిపేయాలి. ఈ సారి పాపం వాడు కనకానికి క్యాన్సర్ అంటే దిగి వచ్చాడు. కానీ ఆ రుద్రాణి వల్ల తిరగబడిందని అపర్ణ అంటుంది. మీరేమీ అనుకోనంటే.. ఆ రుద్రాణిని మర్డర్ చేస్తానని కనకం అంటుంది. హేయ్ ఇలాంటి కొంపలు ముంచే పని చేయకని ఇందిరా దేవి అంటుంది. ఏదో పెద్ద గుట్ట బయట పెట్టినట్టు.. వచ్చి నిజం చెప్పింది. భార్యాభర్తలను విడదీసిన వాళ్లు ఎవరూ బాగు పడరు.. సర్వ నాశనం అయిపోతారని కనకం తిడుతుంది. రుద్రాణిని అని ఏం లాభం.. వాడు అర్థం చేసుకోవాలి కదా.. వాడి కోసమే కదా ఇదంతా చేసింది.. అది గుర్తించాలి కదా అని ఇందిరా దేవి అంటే.. అజ్ఞానం అని కనకం అంటుంది.

రాజ్ సీరియస్.. శ్రుతి తిట్లు..

ఏంటీ ఏమన్నావ్? అని అపర్ణ అంటుంది. ఏదో మైండ్‌లో ఉన్నది బయట పెట్టేశాను ఏమీ అనుకోకండి అని కనకం అంటుంది. కనకం అన్నదానిలో తప్పు ఏముంది? వాడిని అజ్ఞానం ఆవహించింది. దాన్ని మనం దూరం చేయాలి. కాబట్టి వాడికి కావ్యని దగ్గర చేయాలి అని పెద్దావిడ అంటే.. సరే చేరుద్దాం కావ్యని ఆఫీస్‌కి పంపించాలి అని అపర్ణ ప్లాన్ చేస్తుంది. ఇక ఆఫీస్‌కి వచ్చిన రాజ్.. ఎంప్లాయిస్ మీద సీరియస్ అవుతాడు. పని సరిగా చేయమని చెప్తాడు. ఆ తర్వాత డిజైన్స్ విషయంలో శ్రుతికి కూడా వార్నింగ్ ఇస్తాడు. దీంతో రాజ్‌ని తిట్టుకుంటుంది శ్రుతి. ఇక కనకం, ఇందిరా దేవి, పెద్దావిడ కలిపి కావ్య దగ్గరకు వెళ్తారు. ఏంటి జగన్మాతలు ముగ్గురూ కలిసి నా దగ్గరకు వచ్చారు? మళ్లీ ఏదన్నా నాటకం మొదలు పెట్టారా.. అని కావ్య అడుగుతుంది.

మళ్లీ అది నా మెడకు చుట్టుకుంటుంది..

ఏంటి ఒళ్లు ఎలా ఉందని అపర్ణ అంటే.. నాటకాలు ఆడి అలిసి పోయిందని కావ్య అంటుంది. ఇక నాటకాలు ఆడాల్సిన పని లేదు. ముగ్గురం కలిసి మీ ఇద్దర్నీ కలపడానికి నిర్ణయం తీసుకున్నామని ఇందిరా దేవి అంటే.. అయితే అది ఖచ్చితంగా నా మెడకు చుట్టుకుంటుంది. ఇవన్నీ కుదరదని కావ్య అంటుంది. మేము కాదు రుద్రాణి చేసింది అంతా అని ఇందిరా దేవి అంటే.. ఈసారి ఆవిడ తప్పు లేదు. మీరు ఆడిన నాటకాన్ని బయట పెట్టిందని కావ్య అంటుంది. దీంతో షాక్ అయిన అపర్ణ వాళ్లు.. చూశారా రుద్రాణి కంటే మనం చీప్ అయిపోయాం. ఇంకెందుకు మేము వెళ్లిపోతామని అంటే.. సరే వెళ్లి రమ్మని కావ్య అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కావ్యని సిఈవోని చేస్తానని అపర్ణ అంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..