Brahmamudi, October 18th Episode: అసహ్యించుకున్న రాజ్.. రుద్రాణిని వాయించిన అపర్ణ, పెద్దావిడ..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య, రాజ్‌లు కలవబోతుండగా.. రుద్రాణి చిచ్చు రాజేస్తుంది. వీళ్లకే అన్ని తెలివి తేటలు ఉంటే.. నాకెన్ని తెలివి తేటలు ఉండాలి? అని అంటుంది. కూతురు అత్తారిల్లు వదిలి పుట్టింటికి వచ్చిందంటే.. అల్లుడు కాలు పట్టుకుని మరీ కూతురిని ఏలుకోమని బాధ పడుతుంది. పెళ్లి అప్పుడు పెళ్లి కూతురుకు మాత్రమే ముసుగు వేసింది. కానీ ఇప్పుడు అందరికీ ముసుగు వేసిందని అంటుంది రుద్రాణి. మరోవైపు నుంచి అపర్ణ, ఇందిరా దేవిలు రుద్రాణికి వార్నింగ్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య, రాజ్‌లు కలవబోతుండగా.. రుద్రాణి చిచ్చు రాజేస్తుంది. వీళ్లకే అన్ని తెలివి తేటలు ఉంటే.. నాకెన్ని తెలివి తేటలు ఉండాలి? అని అంటుంది. కూతురు అత్తారిల్లు వదిలి పుట్టింటికి వచ్చిందంటే.. అల్లుడు కాలు పట్టుకుని మరీ కూతురిని ఏలుకోమని బాధ పడుతుంది. పెళ్లి అప్పుడు పెళ్లి కూతురుకు మాత్రమే ముసుగు వేసింది. కానీ ఇప్పుడు అందరికీ ముసుగు వేసిందని అంటుంది రుద్రాణి. మరోవైపు నుంచి అపర్ణ, ఇందిరా దేవిలు రుద్రాణికి వార్నింగ్ ఇస్తారు. అయినా రుద్రాణి పట్టించుకోదు. అంత తప్పు మా అమ్మ ఏం చేసిందని కావ్య అడుగుతుంది. అల్లుడిని ఇంటికి రప్పించడానికి క్యాన్సర్ అని నాటకమాడింది. నిజానికి కనకానికి క్యాన్సర్ లేదని.. నిన్నూ, కావ్యని కలపడానికి ఈ నాటకాలు ఆడుతుందని.. మనందరినీ ఫూల్స్ చేసిందని రుద్రాణి నిజాన్ని బయట పడుతుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు.
మీ అత్తకు క్యాన్సర్ లేద.. నిజాన్ని బయట పెట్టిన రుద్రాణి..
అత్తా నీకేం తెలుసని ఇలా అందరిలో చెబుతున్నావ్? ఆవిడకు నిజంగానే క్యాన్సర్ ఉంది. త్వరలోనే అందరికీ దూరం కాబోతుందని రాజ్ అంటాడు. అవునా అది ఆవిడను చెప్పమను. ఏ పుట్టలో ఏ పాము ఉందని తవ్వడం మొదలు పెడితే.. ఈ పుట్టలో నుంచే ఈ పాము బయట పడింది. ఇప్పుడు ఎందుకు తల దించుకుని నిలబడింది? అడుగమని రుద్రాణి అంటుంది. ఏంటండీ మా అత్త అన్ని అంటుంటే ఎదురు తిరిగి సమాధానం చెప్పడం లేదు. అది అబద్ధమని ఎందుకు చెప్పడం లేదు. మీకు నిజంగానే క్యాన్సర్ లేదా? అని రాజ్ నిలదీస్తాడు. లేదని చెబుతుంది కనకం. ఈ పేదింటిని పావనం చేయడానికి వచ్చిన దుగ్గిరాల సభ్యులు అందరూ విన్నారా? ఇది మయ సభ.. ఎక్కడ అడుగు వేస్తే గొయ్యి ఉంటుందో తెలీదు. ఈ ఇంటి శూన్యంలో కూడా మాయ విలయ తాండవం చేస్తుందని రుద్రాణి రెచ్చిపోతుంది. కనకం ఏంటే ఇది.. ఏం చేసినా భరిస్తున్నానని ఇలా కూడా పరువు తీసేస్తావా.. ఇంత మందిలో దోషిగా నిలబడి ఏం సాధించావు? అని కృష్ణమూర్తి కూడా నిలదీస్తాడు.
నోరు విప్పితే డ్రామా..
ఇవన్నీ కాదు కానీ నువ్వు డైరెక్ట్‌గా ఓ డ్రామా కంపెనీ పెట్టుకోమని రుద్రాణి సలహా ఇస్తుంది. అల్లుడు గారు.. అసలు ఇందులో నిజంగా నా స్వార్థం ఏమీ లేదని కనకం చెప్పబోతుండగా.. రాజ్ నమస్కారం పెడతాడు. ఎందుకండి నా ఎమోషన్స్‌తో ఇలా ఆడుకున్నారు? ఇదంతా నా భుజాల మీద వేసుకుని చేసుకున్నందుకు నిజంగానే నన్ను ఫూల్ చేశారు. నోరు విప్పితే అబద్ధాలు. చివరికి నా కూతురు అంటే నచ్చకపోయినా.. నేను మీ కూతురికి నచ్చకపోయినా.. మీ కోసం ఈ వ్రతం చేయించాలి అనుకున్నాను. ఇప్పుడు మీ మోసం బయట పడి వెర్రివాడిని చేశారు. ఏంటి ఈ దారుణం.. దుగ్గిరాల ఫ్యామిలీ అనుకుంటున్నారా.. ఏ ఊరు పేరు లేని సాధారణ కుటుంబం అనుకుంటున్నారా.. మీకు లేకపోయినా.. కనీసం మీ కూతురికి కూడా లేదా అని రాజ్ ఆపగానే.. సిగ్గు.. అనండి ఆ మాట కూడా అనండి అని కావ్య అంటుంది.
ఏం బతుకులు మీవి..
ఎన్ని అన్నా ఏ లాభం? ఆ రక్తంలోనే ఉంది మోసం చేసే గుణం. ఎక్కడో ఓ చోట మారిపోతారేమోనని ఆశ ఉండేది. కానీ మీ బుద్ధి చూపించారు. మీకు కావాల్సింది జరిపించుకోవడం కోసం.. ఎంతకైనా దిగజారతారు. ఛా ఏం బతుకులు మీవి? చూస్తుంటేనే అసహ్యం పుడుతుందని రాజ్ అంటే.. చాలు ఆపండి. ఇందుకేనా ఈ నాటకం ఆడింది? కలిపేవా మా ఇద్దర్నీ.. ఏం బతుకులు మీవి అని అడుగుతున్నారు? చచ్చిపోవాలి అన్నంత అవమానంగా ఉంది. ఏమ్మా నేను నీకు భారం అయ్యానా? అప్పుడు నన్ను ఈ ఇంట్లోంచి వెళ్లగొట్టాల్సింది. ఇప్పుడు ఏం చెప్తే ఎవరు నమ్ముతారు? అని కావ్య అంటే.. ఎవరూ నమ్మాల్సిన పని లేదు. ఈ నాటకానికి తెర తీసిందే నేను.. కనకం వెనుక ఉండి నడిపించింది నేను.. ఇందులో కనకం సహకరించిందే తప్పా మోసం చేయలేదు. నా కోడలికి ఏమీ తెలీదని అపర్ణ, ఇందిరా దేవిలు అంటారు.
చచ్చినా కళావతిని నమ్మను..
అంటే మీరు కూడా నన్ను మోసం చేశారా.. అందరూ కలిసి నన్ను వెర్రివాడిని చేశారా? నా చుట్టూ ఉచ్చు బిగించారు. మమ్మీ ఇప్పుడు చెబుతున్నా విను. ఇంతుకు ముందు నువ్వు చేసిన సంఘటన వల్ల నేను ఈ కళావతిని అపార్థం చేసుకున్నానేమో అనుకున్నా. కానీ తల్లితో పాటు కూతురు కూడా బాగా నటించింది. ఇక జీవితంలో కళావతిని, ఈ కుటుంబాన్ని చచ్చినా నమ్మనని రాజ్ అంటాడు. గుడ్ బై.. అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లిపోగానే.. రుద్రాణికి ఒక్కటి ఇస్తుంది ఇందిరా దేవి. ఛీ నువ్వు అసలు ఆడదానివేనా? విడిపోయిన భార్యభర్తలను కలపడానికి చిన్న ప్రయత్నం చేస్తుంటే.. జీవితంలో మళ్లీ కలిసి పోనంత దూరాన్ని పెంచావు. నీలాంటి పాముకు పాలు పోసి పెంచినందుకు సిగ్గు పడుతున్నా. ఎంతో కష్ట పడి పీటల మీద కూర్చోబెడితే.. వాళ్ల కాపురాన్ని ముక్కలు చేశావు. ఈ పాపం ఊరికే పోదు.. సర్వ నాశనం అయిపోతావని ఇందిరా దేవి అంటుంది.
చేతులెత్తేసిన రాజ్.. నా భార్యగా ఒప్పుకోను..
ఆ తర్వాత అపర్ణ కూడా కొట్టేందుకు చేయి ఎత్తి.. దించేస్తుంది. నా కొడుకు, కోడలు కలిసి పోయేవేళ అగాధం సృష్టించినందుకు ఇక్కడే నిన్ను చంపేసేదాన్ని.. రేయ్ రాహుల్ మీ అమ్మని తీసుకెళ్లమని అపర్ణ అంటుంది. ఆ తర్వాత కావ్యకు, కనకానికి నచ్చజెప్పి వెళ్తారు. ఇంటికి వెళ్లగానే రాజ్‌కి గడ్డి పెడతారు. అర్థమయ్యేలా చెప్పేందుకు ట్రై చేస్తారు. కానీ రాజ్ వినడు. మీరు కూడా కలిసి నన్ను మోసం చేశారు. ఇక జీవితంలో ఆ కళావతిని భార్యగా ఒప్పుకోనని అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..