ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌కు క్లయింట్స్ అందరూ ఫోన్ చేసి.. కావ్య మేడమ్ అపాయిట్మెంట్ కావాలని అడుగుతారు. దీంతో ఎంతో ఇరిటేట్ ఫీల్ అవుతాడు. తీసుకొచ్చి దానికి పనివాడిని చేసి పారేశారని అంటూ ఆఫీస్‌కి వస్తాడు రాజ్. అప్పుడే శ్రుతి వచ్చి గుడ్ మార్నింగ్ మేనేజర్ అని అంటుంది. దీంతో సీరియస్ అవుతాడు రాజ్. నాకెందుకు అందరూ ఫోన్ చేసి.. నన్ను ఎందుకు మేడమ్ అపాయిట్మెంట్స్ అడుగుతున్నారని రాజ్ అడిగితే.. మేడమ్ అపాయిట్మెంట్స్ అన్నీ మేనేజరే చూసుకుంటారు కదా అని శ్రుతి చెబుతుంది. ఇప్పుడు ఆవిడ దగ్గరకు వెళ్లి.. అపాయిట్మెంట్స్ అడగాలా అని అనుకుంటూ.. సీతారామయ్య అన్న విషయాలను గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత కావ్య దగ్గరకు వెళ్లి.. సకిలిస్తాడు రాజ్. కావ్య చూసినా పట్టించుకోదు. ఏంటి పట్టించుకోవు.. ఎందుకు వచ్చానో కూడా అడగవా అని రాజ్ అంటే.. వచ్చింది మీరు కాబట్టి విషయం ఏంటో చెప్పమని కావ్య అంటుంది.
పొగరు ఇంతా అంతా లేదని రాజ్ అనుకుంటాడు. ఏంటీ అని కావ్య అడిగినా.. వెళ్లిపోయిన క్లయింట్స్ అందరూ నిన్ను కలవాలి అనుకుంటున్నారు. కాబట్టి మీటింగ్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా అని రాజ్ అడిగితే.. ఎవరా వాళ్లా.. మీ మీద.. మీ కంపెనీ మీద.. నమ్మకం లేదని వెళ్లిన వాళ్లా వెళ్లిపోయారు కదా.. ఇక మాట్లాడేది ఏముందని కావ్య అంటుంది. ఏయ్ నటించకు.. కావాలనే కదా అనామికను వేలం పాటలో ఓడించి దాన్ని పిచ్చిదాన్ని చేసింది. ఏమీ తెలియనట్టు అడుగుతున్నావా అని రాజ్ అంటే.. నేనా అని కావ్య నాటకం ఆడుతుంది. ఏయ్ అదంతా కాదు అపాయిట్మెంట్ కావాలా వద్దా అని రాజ్ అడిగితే.. సరేలే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి.. లంచ్ తర్వాత మీటింగ్ అరేంజ్ చేయమని కావ్య అంటుంది.
ఆ తర్వాత కళ్యాణ్ ఆటో నడుపుతుండగా.. అనామిక, సామంత్‌లు చూస్తారు. కావాలనే వెళ్లి కళ్యాణ్‌తో ఆడుకుంటారు. అరే కళ్యాణ్ నువ్వేనా.. నేను ఎవరో అనుకుంటున్నా.. ఇది ఎంతో రమణీయమైన సన్నివేశం.. మనిషి రోడ్డున పడ్డాడు అంటే ఇదేనా? దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్లు పరువుకు ప్రాణం ఇస్తారని విన్నాను కానీ.. ఇదేంటి? ఆటో ఏసుకుని తిరుగుతున్నావు? అని అనామిక, సామంత్‌లు అంటారు. నాకు అన్యాయం చేసిన వ్యక్తి ఎలాంటి పరిస్థితి వచ్చాడో తెలుసుకోవాలి కదా అని అనామిక అంటుంది. మొత్తం దుగ్గిరాల ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకు వస్తుందని అనామిక శాపం పెట్టింది తెలుసా.. అని సామంత్ అంటే.. ఎవరు ఈ పతివ్రతా.. పాపం చేసిన వాళ్లు శాపం పెడితే తగులుతుందా? అనామిక పాపంలో నీకు కూడా భాగం పంచుతుందని కళ్యాణ్ అంటాడు. నా జీవితం గురించి మాట్లాడే ముందు నీ బ్రతుకు ఏంటో తెలుసుకో.. నీ అప్పూ నిన్ను అప్పుల పలు చేసి మరింత దిగజార్చుతుందని అనామిక అంటుంది. ఆటో నడపడంలో నాకేం అవమానం కనిపించడం లేదు. కానీ నువ్వు ప్రశాంతంగా పడుకోలేవు. అసలు నీలాంటి దానికి నాలాంటి వాడిని విమర్శించే హక్కే లేదని కళ్యాణ్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత అనామిక కళ్యాణ్ ఫొటోలు తీస్తుంది.
ఆ తర్వాత క్లయింట్స్‌ని మీట్ అవుతుంది కావ్య. నన్ను కలవాలని అనుకున్నారట ఎందుకు? మా కంపెనీతో బిజినెస్ వద్దు అని అనుకుని వెళ్లిపోయారు కదా మళ్లీ ఎందుకు కలవాలి అనుకున్నారని కావ్య అడుగుతుంది. అలా వెళ్లిపోయి పెద్ద తప్పు చేశాం మేడమ్.. అందుకే మళ్లీ వచ్చామని.. ఇందుకు అనామిక గారు కూడా ఒక కారణం. ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు అందుకే వెళ్లామని క్లయింట్స్ అంటారు. మరి ఆవిడకు ఎలాంటి స్టాటజీలు ఏం ఉన్నాయో ఏమో.. మీకు లాభాలే కదా.. ముఖ్యం. మీలాంటి తెలివైనా వాళ్లతో నాకు బిజినెస్ చేయడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది. దీంతో క్లయింట్స్ ప్లీజ్ మేడమ్ అని బ్రతిమలాడుతూ మళ్లీ మీ దగ్గరకు వచ్చాం కదా అని అంటారు. వచ్చారు సరే.. మళ్లీ మీరు వెళ్లకుండా ఉండరని గ్యారెంటీ ఏంటని కావ్య అడుగుతుంది. కావాలంటే మీకు అగ్రిమెంట్ రాసిస్తామని క్లయింట్స్ అంటే.. సరే అని కావ్య అంటుంది. మీరు సిఈవో ఉన్నంత కాలం మీకు మించినంత వారు ఎవరూ ఉండరని అనుకున్నాం. కానీ మేడమ్ మీ కంటే ఎక్కువే అని క్లయింట్స్ అంటారు. చూడండి.. నాకు ఈ కంపెనీలో జాయిన్ అయ్యేంత వరకు నాకు ఏమీ తెలీదు. కానీ నాకు అన్నీ నేర్పించింది ఆయనే. ఈ పొగడ్తలు ఆయనకే.. ఆయన్ని దాటడం చాలా కష్టం. అందుకే ఆయన్ని ఫాలో చేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత క్లయింట్స్ వెళ్తారు.
ఆ నెక్ట్స్ ఓ బెస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌ని పిలిపిస్తుంది అనామిక. మీ గోల్డ్ కంపెనీని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా పబ్లిసిటీ చేస్తానని ఫిల్ట్ డైరెక్టర్ అంటే.. డాక్యుమెంటరీ తీయాలని అనామిక అంటుంది. డాక్యుమెంటరీ తీయడం నాకు కూడా ఇష్టమే.. ఇంతకీ ఎవరి మీద తీయాలని అడుగుతాడు. అతను సాధారణ వ్యక్తి కాదు. దుగ్గిరాల ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. పేరు కళ్యాణ్.. అని వివరాలు చెబుతుంది అనామిక. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..