Brahmamudi, July 26th Episode: కావ్య, ధాన్యలక్ష్మిల చాలెంజ్.. కళ్యాణ్, అప్పూల పెళ్లి జరుగుతుందా..

|

Jul 26, 2024 | 1:31 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ధాన్య లక్ష్మి పాటలు వింటూ ఉంటుంది. అది చూసిన రుద్రాణి.. ధాన్య లక్ష్మికి దగ్గరకు వెళ్లి పిలుస్తుంది. నువ్వు చాలా అదృష్ట వంతురాలివి. నాకు తెలిసిన నా ఫ్రెండ్‌ కూతురు సౌజన్య ఉంది. చాలా మంచిది. కళ్యాణ్ గురించి అంతా చెప్పాను. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. వెంటనే నువ్వు వెళ్లి వాళ్లతో మాట్లాడితే మంచిది అనిపిస్తుందని రుద్రాణి అంటుంది. కళ్యాణ్‌కి పెళ్లా.. ఏం మాట్లాడుతున్నావ్? నువ్వు? విడాకులు వచ్చి రెండు రోజులు..

Brahmamudi, July 26th Episode: కావ్య, ధాన్యలక్ష్మిల చాలెంజ్.. కళ్యాణ్, అప్పూల పెళ్లి జరుగుతుందా..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ధాన్య లక్ష్మి పాటలు వింటూ ఉంటుంది. అది చూసిన రుద్రాణి.. ధాన్య లక్ష్మికి దగ్గరకు వెళ్లి పిలుస్తుంది. నువ్వు చాలా అదృష్ట వంతురాలివి. నాకు తెలిసిన నా ఫ్రెండ్‌ కూతురు సౌజన్య ఉంది. చాలా మంచిది. కళ్యాణ్ గురించి అంతా చెప్పాను. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. వెంటనే నువ్వు వెళ్లి వాళ్లతో మాట్లాడితే మంచిది అనిపిస్తుందని రుద్రాణి అంటుంది. కళ్యాణ్‌కి పెళ్లా.. ఏం మాట్లాడుతున్నావ్? నువ్వు? విడాకులు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే పెళ్లి ఏంటి? అప్పుడే పెళ్లి గురించి మాట్లాడితే ఎలా ఒప్పుకుంటాడు. వాడి మనసు కొంచెం కుదట పడని.. అప్పుడు ఆలోచిస్తానని ధాన్య లక్ష్మి అంటుంది.

ధాన్య లక్ష్మిని రెచ్చగొట్టిన రుద్రాణి..

నువ్వు ఇలాగే ఆలోచిస్తే.. ఆ కావ్య అనుకున్నంత పని చేస్తుంది. కళ్యాణ్ పక్కన భార్య స్థానం ఖాళీగా ఉంది. అప్పూ ఎలాగో కళ్యాణ్‌ని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే మంచి సమయం. కళ్యాణ్ మనసు మార్చి.. అప్పూతో పెళ్లి చేస్తుంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుగ్గిరాల కుటుంబాన్ని ఏలేద్దామని ప్లాన్ చేస్తారని రుద్రాణి అంటుంది. అయినా ఆ కావ్య అనుకుంటే అయిపోతుందా? కళ్యాణ్‌కి తల్లిని నేను ఒప్పుకోవాలి కదా అని ధాన్య లక్ష్మి అంటుంది. కావ్య ఒక్కసారి అనుకుంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా చేసేస్తుంది. అసలు కావ్య ఈ ఇంట్లో ఉన్న పొజిషన్ ఏంటి.. ఎక్కడ ఉండాలో కూడా తెలీదు. కానీ ఇప్పుడు కావ్యపై ఈగ కూడా వాలనివ్వకుండా చేస్తున్నారు. రాజ్‌ మనసు కూడా మార్చేసి.. తన కొంగు పట్టుకుని తిరిగేలా చేసింది. ఇన్ని చేసిన కావ్య.. అప్పూని ఈ ఇంటి కోడలు చేయలేదా? అని ధాన్య లక్ష్మి మనసు మార్చేస్తుంది.

కనకం, కృష్ణమూర్తిల సంతోషం..

మరోవైపు కనకం ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పూకి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి, వాళ్ల అమ్మానాన్నలు ఎంతో మంచివాళ్లు. అప్పూ అదృష్టమని చెబుతూ మురిసి పోతుంది. కానీ నాకు ఎందుకో బాధగా ఉంది అమ్మా.. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ కావాలి అని బాగానే బతికాను. కావ్య కష్టం చేసి ఈ ఇంటిని ఆదుకుంది. ఇప్పుడు దాని కాపురం కూడా చక్కబడింది. కానీ అప్పూ చిన్నప్పటి నుంచి కష్టపడింది. మీ దగ్గర డబ్బు లేదు.. వాళ్ల దగ్గర కూడా పెద్దగా ఉన్నట్టు అనిపించడం లేదు. రేపు దీనికి ఏదైనా అవసరం వస్తే ఎలా? అని స్వప్న అంటుంది. నాకు ఆ భ్రమలు అన్నీ ఇప్పుడు లేవు. డబ్బు ఉంటేనే సంతోషంగా ఉండొచ్చని అనుకున్నా. కానీ డబ్బులో ఏమీ లేదు. ఆ అబ్బాయి అంతా తెలుసుకుని ముందుకు వచ్చాడు. అంతకంటే గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం మనకు ఎక్కడ దొరుకుతుంది? అప్పూ ఎలా ఉన్నా ఇష్ట పడ్డారు. మన పరిస్థితిని కూడా ఎలా ఉన్నా ఒప్పుకున్నారు. వాళ్లు డబ్బు మనుషులు కాదని కృష్ణ మూర్తి, కనకంలు అంటారు.

ఇవి కూడా చదవండి

అప్పూకి కళ్యాణ్ ఫోన్.. కలవమని ఒత్తిడి..

అక్కా నీ భయం నాకు అర్థం అయ్యింది. వాళ్లకు ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే మనం ఉన్నాం కదా.. ఆదుకుందాలే. పెళ్లికి ఎలాంటి లోటు లేకుండా చేస్తామని అంటుంది కావ్య. అక్కడి నుంచి అప్పూ లేచి వెళ్లిపోతుంది. ఏంటే అలా వచ్చేశావు. పెళ్లి అంటే నీకు ఇష్టం లేదా? అని కావ్య అడిగితే.. ఏయ్ నువ్వేం బాంబ్ పేల్చకే అని స్వప్న అంటుంది. ఏదన్నా ఇబ్బందా అని కావ్య అడిగితే.. అబ్బే అదేమీ లేదు అక్కా.. నా వల్ల అమ్మానాన్నలు ఎన్నో అవమానాలు పడ్డారు. కానీ నన్ను నమ్మారని అప్పూ అంటే.. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే చాలా సంతోషంగా ఉందని కావ్య అంటుంది. ఆ తర్వాత అప్పూకి కళ్యాణ్ కాల్ చేస్తూ ఉంటాడు. కానీ లిఫ్ట్ చేయదు. కళ్యాణ్ మళ్లీ మళ్లీ చేస్తే.. లిఫ్ట్ చేస్తుంది. ఏందిరా భయ్ ఎందుకు ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నావ్? అని అప్పూ అంటే.. ఏంటి బ్రో పెళ్లి చూపులు జరిగాయి అంట కదా.. అందుకే నన్ను అవైడ్ చేస్తున్నావా.. ఒక్కసారి నన్ను కలువు బ్రో అని కళ్యాణ్ అంటాడు. సరే ఎక్కడికి రావాలి? అని అప్పూ అంటే.. రెగ్యులర్ ప్లేస్ కి వచ్చేయ్ అని కళ్యాణ్ అంటాడు.

మధ్యలో మందరా మధ్యలో దూరిపోతున్నావ్..

రుద్రాణి మాటలు విన్న ధాన్య లక్ష్మి.. ఇంట్లోని అందర్నీ హాలులోకి పిలుస్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి అందర్నీ రమ్మన్నావ్? అని అడుగుతుంది పెద్దావిడ. కళ్యాణ్‌కు మంచి సంబంధం వచ్చింది. పెళ్లి చేయాలి అనుకుంటున్నా అని ధాన్య లక్ష్మి చెబుతుంది. ఇప్పటిదాకా నువ్వు నాతోనే ఉన్నావు కదా.. ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదని ప్రకాశం అడుగుతాడు. అందరికీ కలిపి ఒక్కటేసారి చెప్పాలి అనుకున్నానని ధాన్య లక్ష్మి. నీ భార్య మంచి నిర్ణయమే తీసుకుంది కదా అని రుద్రాణి అంటే.. నువ్వెందుకు మందరా మధ్యలో దూరిపోతున్నావ్? చెప్పు నీకు ఈ ఆలోచన వచ్చేలా చేసింది రుద్రాణియే కదా అని అంటాడు ప్రకాశం. నేను చేసి మంచే కదా అని ధాన్య లక్ష్మి అంటుంది. కళ్యాణ్ మనసు ఇప్పుడు ముక్కలై పోయింది. ఇప్పుడు వాడికి పెళ్లి అన్నా.. పెళ్లాం అన్నా విరక్తి వచ్చింది. అవును కదా ధాన్య లక్ష్మి.. విడాకులు వచ్చి రెండు రోజులకే పెళ్లి ఏంటి? పెళ్లి చేసుకోవడానికే మొదటి భార్యను వదిలించుకున్నాడని అంటారని ఇందిరా దేవి అంటుంది.

ఈ పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదా..

సరిగ్గా అప్పుడే కావ్య, స్వప్నలు వస్తారు. మీ చిన్న అత్త ఏదో తొక్కలో డిస్కర్షన్ పెట్టినట్లుందని స్వప్న అంటుంది.కావ్యని చూసిన ధాన్య లక్ష్మి మరింత గట్టిగా మాట్లాడుతూ.. ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది. లేట్ చేస్తే సంబంధాలు వస్తాయని నాకు అనిపించడం లేదని అంటుంది. కవి గారి మానసిక పరిస్థితి తెలుసుకునే.. ఈ నిర్ణయం తీసుకున్నారా? కవి గారు ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోరని అంటుంది కావ్య. అదేంటి కావ్య అలా అంటున్నావ్? ఈ పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదా? వేరే వాళ్లతో నీకు పెళ్లి చేయడం ఇష్టం లేదా? అని ధాన్య లక్ష్మి అంటుంది. మీరు అన్నది నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డు పడటం ఏంటి? కవిగారి పరిస్థితి బాగోలేదని తెలుసు కదా అని కావ్య అంటుంది.

మీకేంటి ఇచ్చేది బోడి మర్యాదా..

నీ మనసులో ఉన్నది అంతేనా? లేక నీ ప్లాన్ వర్కౌట్ కాదనా అని ధాన్య లక్ష్మి అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ప్లాన్ ఏంటి అని కావ్య అంటే.. నీ చెల్లి అప్పూతో నా కొడుకుకు పెళ్లి చేయించాలనే దే కదా నీ ప్లాన్. నాకు అర్థమైందని ధాన్యం అంటుంది. నీ కొడుకుకు పెళ్లి చేయాలి అనుకున్నాం. అక్కడి వరకు ఓకే. కానీ కావ్య మీద ఎందుకు అనవసరంగా నిందలు వేస్తున్నావని పెద్దావిడ అంటుంది. మరిది గారూ అంటూ తన చెల్లెని ఈ ఇంటి కోడలు చేద్దాం అనుకుంటుంది. ముగ్గురూ కలిసి ఈ కుటుంబాన్ని ఏలేద్దాం అనుకుంటున్నారని అంటుంది ధాన్య లక్ష్మి. మీరు అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా? మీకేంటి ఇచ్చేది మర్యాదా.. నా క్యారెక్టర్‌నే తప్పు పడుతున్నప్పుడు.. నా చెల్లెల్లిని తప్పు పడుతుంటే ఇంకా మీకు మర్యాద ఇచ్చేదేంటి? అని కావ్య అంటుంది. శభాష్ కావ్యా అని స్వప్న అంటుంది. చూశావా అక్కా నీ కోడలు ఎలా అంటుందో అని ధాన్య లక్ష్మి అంటే.. ఎవరైనా ఏమైనా అంటే ఇకపై ఊరోకోవద్దని నా కోడలికి నేనే చెప్పాను అని అపర్ణ అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.