Brahmamudi, July 25th Episode: రుద్రాణి స్కెచ్‌కి కళ్యాణ్ బలి.. అప్పూ పెళ్లి డేట్ ఫిక్స్..

|

Jul 25, 2024 | 1:17 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూని పెళ్లి చూపుల కోసమని కావ్య, స్వప్న రెడీ చేస్తారు. కానీ అప్పూకి అది నచ్చదు. చీ ఏంటిది.. నేనేంటి? ఈ చీర కట్టుకోడం ఏంటి? అస్సలు బాగోలేదని అప్పూ అంటుంది. పెళ్లి చూపులకు చీరే కట్టుకోవాలని కావ్య అంటుంది. ఏయ్ బాగానే ఉందిలే ఉండనీ.. అని స్పప్న అంటుంది. నన్ను నేను చూసుకోవడానికి నాకైనా నచ్చాలి కదా.. ఇక వచ్చిన వాల్లకు ఏం నచ్చుతాను అప్పూ అంటుంది. సరే ఒకసారి బంటీని పిలుద్దాం. వాడు ఎలా ఉందో చెప్తాడని కావ్య..

Brahmamudi, July 25th Episode: రుద్రాణి స్కెచ్‌కి కళ్యాణ్ బలి.. అప్పూ పెళ్లి డేట్ ఫిక్స్..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూని పెళ్లి చూపుల కోసమని కావ్య, స్వప్న రెడీ చేస్తారు. కానీ అప్పూకి అది నచ్చదు. చీ ఏంటిది.. నేనేంటి? ఈ చీర కట్టుకోడం ఏంటి? అస్సలు బాగోలేదని అప్పూ అంటుంది. పెళ్లి చూపులకు చీరే కట్టుకోవాలని కావ్య అంటుంది. ఏయ్ బాగానే ఉందిలే ఉండనీ.. అని స్పప్న అంటుంది. నన్ను నేను చూసుకోవడానికి నాకైనా నచ్చాలి కదా.. ఇక వచ్చిన వాల్లకు ఏం నచ్చుతాను అప్పూ అంటుంది. సరే ఒకసారి బంటీని పిలుద్దాం. వాడు ఎలా ఉందో చెప్తాడని కావ్య అంటుంది. ఇక బంటీని పిలుస్తుంది స్వప్న. అప్పూని చూసి ఎలా ఉందో చెప్పు అని అడుగుతుంది. బంటీ అటూ ఇటూ వెతుకుతాడు. ఇదేరా అప్పూ అని అంటుంది స్వప్న. ఇది అప్పూ ఏంటి? అపపూ ఏంటి చీర కట్టిందని పగలబడి నవ్వుతాడు. నేను ప్యాంటూ, షర్టు వేసుకుంటా. నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను. ఎవరి కోసం మారనని అంటుంది అప్పూ.

కళ్యాణ్ గతం.. రాజ్ ప్రయత్నం..

ఆ తర్వాత అప్పూ ఇచ్చిన జాకెట్ చూసి గతాన్ని గుర్తు చేసుకుంటాడు. నీ కోసం తిరిగి ఓ జాకెట్ తీసుకున్నా.. నీకు చాలా బావుంటుంది. ధాంక్యూ సో మచ్ బ్రో నిజంగా చాలా బావుంది. కానీ ఇది చాలా కాస్ట్‌లీ కదాఅని కళ్యాణ్ అంటాడు. డెలివరీ చేసిన శాలరీ పడింది. అది పెట్టి కొన్నాను. మరి నువ్వు బలిసినోడివి. అన్నీ అలాంటి బట్టలే వేస్తారు. అందుకే తీసుకున్నానని అప్పూ అంటుంది. ఆ మాటలు గుర్తు చేసుకుని.. ఆ జాకెట్‌ని చేతిలోకి తీసుకుని కళ్యాణ్ బాధ పడతాడు. కవిగారి కళ్లలో కన్నీళ్లు మొదలయ్యాయి అన్నమాట. ఇదే మంచి సమయం వాడి మనసులోని ప్రేమను బయటకు తీసుకురావాలి. రేయ్ కళ్యాణ్ నువ్వు లాస్ట్ నెల చేసిన ఆడిట్ ఫైల్ ఎక్కడ పెట్టావు.. కనిపించడం లేదని అడుగుతాడు రాజ్. అది అప్పుడే అన్నయ్యకు ఇచ్చేశానని చెప్తాడు కళ్యాణ్.

తన మనసులో మాట బయట పెట్టేసిన కళ్యాణ్..

ఏంట్రా ఈ పాత జాకెట్‌ని పట్టుకున్నావ్? ఇలాంటి పాత జాకెట్స్ వేసుకుని మన ఇంటి పరువు తీయకురా.. నీకు కావాల్సి నవన్నీ మొన్న అమెరికా నుంచి తెప్పించేశా. నా రూమ్‌లో ఉన్నాయి తీసుకో.. అది ఇటు ఇవ్వు.. డస్ట్ బిన్‌లో పారేస్తాను అని రాజ్ తీసుకెళ్తుంటే.. కళ్యాణ్ వెంట పడతాడు. చివరికి రాజ్ ఆ జాకెట్‌ని తీసుకెళ్లి డస్ట్ బిన్‌‌లో పారేస్తాడు. వెంటనే కళ్యాణ్ వచ్చి తీసుకుంటాడు. అప్పుడే అటు నుంచి వెళ్తున్న రుద్రాణి.. వీళ్లను చూసి ఆగుతుంది. ఏంటి అన్నయ్యా నువ్వు చేసిన పని అని కళ్యాణ్ అంటే.. అది పాతది అయిపోయింది కదరా.. కొన్ని జ్ణాపకాలు పాతవి అయిపోయినా.. గుర్తుకు ఉంటాయని కళ్యాణ్ అంటాడు. ఓహో నువ్వు అప్పూ మీద దాచుకున్న ప్రేమలానా.. కొన్ని రోజులుగా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నిజం చెప్పరా.. అప్పూని నువ్వు ఇష్ట పడుతున్నావా? స్నేహం ముసుగులో ప్రేమిస్తున్నావా.. ప్రేమిస్తూనే స్నేహం అని భ్రమ పడుతున్నావా. అని రాజ్ అడిగితే.. తెలీదు అన్నయ్యా.. ఇందాక నువ్వు అప్పూకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనగానే.. నాలో ఒక తెలీని భయం పుట్టింది.

ఇవి కూడా చదవండి

రుద్రాణి స్కెచ్.. కళ్యాణ్ బలి..

నా ఫ్రెండ్ సంతోషంగా ఉంటుంది అన్నప్పుడు నాకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ.. నాకు దూరం అయిపోతున్నాను అనే బాధ ఎందుకు పుడుతుంది? ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. అప్పూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నా మనసు ఏమీ బాగోలేదు అన్నయ్యా.. ఈ రోజు నైట్ గెస్ట్ హౌస్‌లోనే ఉండాలి అనుకుంటున్నా.. అమ్మకి చెప్పు అని కళ్యాణ్ వెళ్తాడు. అదంతా చూసిన రుద్రాణి.. ఈ కళ్యాణ్‌ గాడు ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తాడని అనుకోలేదు. ఈ విషయం రాజ్‌కి తెలుసు కాబట్టి.. వాళ్లిద్దర్నీ కలపాలని ట్రై చేస్తాడు. కానీ ఈలోపు ఈ విషయం ధాన్య లక్ష్మికి చెప్పి.. ఎప్పటికీ కలవ నివ్వకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది. కట్ చేస్తే.. పెళ్లి చూపులకు అబ్బాయి తరపు వాళ్లు వస్తారు. అప్పూని ప్యాంటూ, షర్టులో తీసుకొస్తారు కావ్య, స్వప్నలు. అది చూసి కనకం షాక్ అవుతుంది. అది చూసి పెళ్లి వాళ్లు కూడా షాక్ అవుతారు. ఏంటే చీర కట్టకుండా ఇలానే తీసుకొచ్చే సారని కనకం అంటే.. నేను ఎప్పుడూ ఇలానే ఉంటాను. పెళ్లి చూపుల కోసం నన్ను నేను అందంగా చూపించుకోలేనని అప్పూ అంటే.. ఐ లైక్ ఇట్ అని పెళ్లి కొడుకు అంటాడు. అది చూసి కనకం షాక్ అవుతుంది.

అప్పూ పెళ్లికి డేట్ ఫిక్స్..

హాయ్ ఐ యామ్ శ్రీరామ్ అని పెళ్లి కొడుకు పరిచయం చేసుకుంటాడు. అప్పూ కూడా పరిచయం చేసుకుంటుంది. కనకం అప్పూ డ్రెస్సింగ్ స్టైల్ గురించి చెప్తుంది. అబ్బాయి అర్థం చేసుకుంటాడు. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమని కృష్ణ మూర్తి అంటే ఏమీ లేదని శ్రీరామ్ అంటాడు. కానీ నేను మీతో ఓ విషయం చెప్పాలని కావ్య అంటే.. కనకం టెన్షన్ పడుతూ ఉంటుంది. అనామిక వేసిన కేసు గురించా అని శ్రీరామ్ అంటాడు. అవును మీకు ముందే తెలుసా? అని స్వప్న అడుగుతుంది. ఆ మహిళా మండల సంఘంలో ఒకరు మా దగ్గర వాళ్లు అవుతారు. అప్పూని చూడటం కోసం వెళ్తున్నామని తెలిసి.. అనామిక అనవసరంగా నిందలు వేసిందని చెప్పింది. దీంతో అందరూ సంతోషిస్తారు. ముహూర్తం చూడమంటారా అని పంతులు అంటే.. అప్పూకి కూడా నేనే నచ్చాలి కదా అని శ్రీ రామ్ అంటే.. మా అమ్మానాన్నల సంతోషమే నా ఇష్టం. మా అక్కలు ఏం చెప్తే అదే నేను వింటాను అని అప్పూ అంటుంది. పెళ్లి కూడా సింపుల్‌గా చేయమని పెళ్లి కొడుకు తరపు వాళ్లు చెప్తారు. ఇక పెళ్లికి ముహూర్తాలు చూస్తారు. పెళ్లి డేట్ కూడా త్వరలోనే పెడతారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.