ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణికి, ధాన్య లక్ష్మికి చివాట్లు పెడుతుంది ఇందిరా దేవి. భర్తను వదిలేసిన ఆడదానివి నువ్వు.. ఉదయం లేచి నీ మొహం చూడటమే అరిష్టం. ఇద్దరూ కలిసి పెళ్లి చెడగొట్టి ఏమీ ఎరగనట్టు నిలబడ్డారా.. మీ నోటి వల్ల ఈ పెళ్లి చెడిపోయింది. అప్పూ ఏ ప్రమాదంలో పడి ఉండి.. తిరిగి వస్తే.. ఇన్ని నిందలు వేసిన మీరు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? వీళ్లు అనుభవించే పేదరికం.. ప్రతీ తల్లీ కోరుకుంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ కడుపు మంట మీకు తగిలితే.. ఆ ఉసురు మీకు తగిలితే.. ఇదే పరిస్థితి ఇంకో రూపంలో మీకు తగలకుండా పోదు. గుడిలో దేవుడే అంతా చూస్తున్నాడు. నా మనవరాళ్లను ఇంకొక్క మాట అంటే నేను ఊరుకోను. చెంప పగల కొడతానని ఇందిరా దేవి అంటుంది. కావ్యని అనీ అనీ నా మనసు విరిచేశారు. భగవంతుడి వల్ల నేను ఆ ఊబి నుంచి బయట పడ్డాను. రాహుల్‌తో స్వప్న సర్దుకు పోతూ కాపురం చేస్తుందంటే అదే గొప్ప . ఇంకెప్పుడూ ఆడ పిల్లల ఉసురు తీసుకోకండి అని అపర్ణ కూడా వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత అక్కడి జరిగిన విషయాలు తెలుసుకుని.. అప్పూని కావాలని బెదరగొడుతుంది అనామిక. నేను అనుకున్నదే జరిగింది. నువ్వు లేచిపోయావని తెలిసి పెళ్లి కొడుకు వాళ్లు వెళ్లి పోయారంట అని ఎగతాళి చేస్తుంది. అప్పుడే కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. కళ్యాణ్‌ని చూసి అనామిక షాక్ అవుతుంది. ఏంటి నీ ప్రేమికురాలిని కిడ్నాప్ చేసేసరికి ప్రేమికుడు వచ్చేశాడా? అని అంటుంది. రేయ్ ఏంట్రా ఇంకా చూస్తున్నారు. నా మాజీ మొగుడిని కూడా ఇలాగే కట్టేయమని అంటుంది అనామిక. దీంతో రౌడీలు వస్తూ ఉంటే.. చితగ్గొడతాడు కళ్యాణ్. అనామికను కూడా కొట్టబోయి ఆగిపోతాడు అనామిక. ఏ ఎందుకు ఆగిపోయావ్.. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని, నీ ఫ్రెండ్ కోసం నన్ను పక్కన పెడితే ఎలా ఉంటుందో తెలుసా? నాకు చేసిన అన్యాయం నీ ఫ్రెండ్‌కి కూడా జరగాలనే ఈ పని చేశాను అని చెబుతుంది అనామిక.
అసలు నువ్వు నన్ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావ్. నువ్వు నిజంగా డబ్బే కావాలి అంటే.. ఎప్పుడో పడేసే వాడిని. ఇప్పుడు తనని తీసుకెళ్లి పోవచ్చు. జీవితాంతం మరి ఇలాగే కాపాడు కుంటావా? ఏ క్షణం నుంచి ఎటు నుంచి ప్రమాదం వస్తుందో ఊహించగలవా? అని అనామిక అంటే.. కాపాడుకుంటానని కళ్యాణ్ చెప్పి.. అప్పూని తీసుకెళ్తాడు.
కట్ చేస్తే.. ఇందిరా దేవి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా.. రుద్రాణి నోటి దూలను ఆపదు. రాహుల్ కారు తీయ్.. వెళ్లి పోదామని అంటుంది. ఈ పరిస్థితిల్లో నాకు తోడుగా ఉండకుండా వెళ్లిపోతావా? అని రుద్రాణి అంటుంది. ఇక్కడ మీ అత్తగారు, తోటి కోడలు అందరూ ఉన్నారు కదా.. నేను ఉండి ఏం చేయాలి? తిట్లు తినాలా? అయినా ఈ పాటికి నీ కొడుకుకి, అప్పూకి పెళ్లి అయిపోయి ఉంటుంది కదా.. ఇంటికి వెళ్లి దిష్టి తీసి హారతి ఇవ్వాలి కదా.. రెడీ చేసుకో. ఈ కుటుంబం ఉందే మాయదారి కుటుంబం.. వీళ్లు వాళ్లని వదిలి పెడతారా? మూడోదాన్ని కూడా కట్టి పెడితే లెక్క సరిపోతుందని లెక్క వేశారని రుద్రాణి అంటుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి స్టాపిట్ అని అరుస్తాడు. అప్పూని, కళ్యాణ్‌ని చూసి అక్కడున్న వాళ్లందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్? అత్తా? ఒకరి గురించి మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని కళ్యాణ్ అంటాడు.
కళ్యాణ్.. ఇక్కడ ఉండాల్సిన అప్పూ.. నీతో కలిసి ఎందుకు వచ్చింది? అని ధాన్య లక్ష్మి కూడా అడుగుతుంది. అక్కడ జరిగింది వేరు.. అది మీకు తెలీదు. రేయ్ ఏం జరిగిందని రాజ్ అడిగితే.. అప్పూ వాళ్ల అమ్మానాన్నల ఇష్టం ప్రకారమే తాళి కట్టించుకోవాలి అనుకుంది. కానీ కావాలనే కిడ్నాప్ చేశారని చెప్తాడు. ఎవరు? అని అంటే.. ఇంకెవరు ఈవిడ ముద్దుల కోడలు అనామిక అని చెప్తాడు. అనామికా లేదు ఆవకాయ లేదు.. వీడే కావాలని డ్రామా చేస్తున్నాడని రుద్రాణి అంటుంది. మీకు తెలుసా? మీరు చూశారా? నేను చూశాను.. నేను వాళ్ల వెంట పడ్డాను అని అంతా జరిగింది చెప్తాడు బంటీ. అనామిక జైలుకి వెళ్లడానికి కారణం అప్పూనే అని, ఎలాగైనా పెళ్లి ఆపేలా చేసి పగ తీర్చుకోవాలని ఇలా చేసింది. పెళ్లి ఆగిపోయింది కదా.. అందుకు కారణం మా అమ్మ.. రుద్రాణి అత్తే కదా అని అంటాడు కళ్యాణ్.
దీంతో ధాన్య లక్ష్మి, రుద్రాణిలను తిడుతుంది కనకం. అసలు మీరు ఆడ పుట్టుకే పుట్టారా? అని నిలదీస్తుంది. కనకం పెళ్లి ఆగిపోయినా పర్వాలేదు. దీని పెళ్లి కాకపోయినా పర్వాలేదు.. నేను బతికి ఉన్నంత వరకూ నా కళ్లలో పెట్టుకుని చూసుకుంటానని చెబుతాడు కృష్ణ మూర్తి. ఆ తర్వాత స్వప్న కూడా నిలదీస్తుంది. ఏం చేయాల్సిన పని లేదు. వాళ్లు ఇప్పటికే సిగ్గుతో చచ్చిపోతున్నారు. వాళ్లను వదిలేయ్. మన అప్పూ మనకు క్షేమంగా దక్కింది. అది చాలని కావ్య అంటే.. ఏం చాలు కావ్యా.. వీళ్ల వల్లే కదా.. పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకు మనపై అన్ని నిందలు వేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు. జీవితాంతం అప్పూ ఒంటరిగా మిగిలిపోవాలా? అని కనకం ఏడుస్తూ బాధ పడుతుంది.
అవసరం లేదు.. రాజ్ వెళ్లి తాళిబొట్టు తీసుకొచ్చి.. అప్పూని నా తమ్ముడు మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఎవరి వల్ల అప్పూపై నిందలు పడ్డాయో.. వాడే తాళి కడతాడు. రేయ్ కళ్యాణ్ కట్టరా తాళి. ఎవరు అడ్డు పడతారో నేనూ చేస్తానని తాళి ఇస్తాడు రాజ్. వెంటనే తాళి తీసుకుని అప్పూని పెళ్లి చేసుకుంటాడు కళ్యాణ్. ధాన్య లక్ష్మి అడ్డుపడుతున్నా.. రాజ్ ఆపుతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.