Brahmamudi, August 24th Episode: కళ్యాణ్, అప్పూలను బయటకు వెళ్లమన్న ప్రకాశం.. ఇచ్చి పడేసిన పెద్దాయన..

|

Aug 26, 2024 | 12:16 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య, స్వప్న, అప్పూలు మొత్తం ముగ్గురు కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తారు. ఈ క్రమంలోనే ఇంటికి వచ్చిన అప్పూని అడుగడుగునా అవమానిస్తుంది ధాన్య లక్ష్మి. ముగ్గురూ కలిసి అమ్మవారికి హారతి ఇస్తారు. అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకు భోజనాలు వడ్డిస్తారు ముగ్గురు అక్కాచెల్లెలు. ముందు అప్పూ వెళ్లి అన్నం వడ్డిస్తుంది. అది చూసిన ఆవిడ.. ఏంటమ్మా ఇది శుభానికి పిలిచారా? అశుభానికి పిలిచారా? ప్లేటులో ముందు అన్నం..

Brahmamudi, August 24th Episode: కళ్యాణ్, అప్పూలను బయటకు వెళ్లమన్న ప్రకాశం.. ఇచ్చి పడేసిన పెద్దాయన..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య, స్వప్న, అప్పూలు మొత్తం ముగ్గురు కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తారు. ఈ క్రమంలోనే ఇంటికి వచ్చిన అప్పూని అడుగడుగునా అవమానిస్తుంది ధాన్య లక్ష్మి. ముగ్గురూ కలిసి అమ్మవారికి హారతి ఇస్తారు. అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకు భోజనాలు వడ్డిస్తారు ముగ్గురు అక్కాచెల్లెలు. ముందు అప్పూ వెళ్లి అన్నం వడ్డిస్తుంది. అది చూసిన ఆవిడ.. ఏంటమ్మా ఇది శుభానికి పిలిచారా? అశుభానికి పిలిచారా? ప్లేటులో ముందు అన్నం వడ్డిస్తావేంటి? అంటుంది. ఇక కావాలనే రెచ్చిపోయిన ధాన్య లక్ష్మి.. అసలు నువ్వు ఆడదానివేనా? ఏమాత్రం అయినా బుద్ధి ఉందా? వ్రతానికి పిలిచి భోజనం పెడుతున్నావా? లేదంటే పిండా కూడు పెడుతున్నావా? విస్తరిలో ముందే అన్నం వడ్డిస్తున్నావేంటి? వచ్చిన వాళ్లను ఇలాగేనా అవమానించేది? మీ అమ్మ ఇలాగే పెంచిందా నిన్ను? అని రెచ్చిపోతుంది.

ఈ ఇంటి కోడలిగా అప్పూ పనికి రాదు..

ఎందుకు అలా అరుస్తున్నావ్? ధాన్య లక్ష్మి అని అపర్ణ అంటుంది. ఏదో చిన్న పిల్ల తెలీకుండా వడ్డించింది. దానికే ఇలా దుమ్మెత్తి పోయాలా? శుభమా అని వ్రతం చేసుకుంటుంటే.. పిండాలు.. కూడు అంటావేంటి? అని ఇందిరా దేవి తిడుతుంది. ఇలా వడ్డిస్తే అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతామన్న సంగతి కూడా ఈవిడకు తెలీదా? అని పేరంటానికి వచ్చిన ఆవిడ అంటుంది. మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ఇలాంటి పనులు ఏమీ చేయలేదండి. అందరికీ ఆకలి వేస్తుంది కదా.. అందుకే హడావిడిగా వడ్డించేసింది. అంతేకానీ మిమ్మల్ని అవమానించాలని కాదని కావ్య అంటుంది. ఆ తర్వాత మళ్లీ అందరికీ భోజనాలు వడ్డిస్తారు. ఆ తర్వాత అందరికీ వాయనాలు ఇచ్చి పంపిస్తారు. వెళ్లేటప్పుడు ఓ ఆవిడ.. ధాన్య లక్ష్మి నీ కొడుకు చేసుకున్న ఈ పిల్ల.. దుగ్గిరాల ఇంటి కోడలిగా ఏమాత్రం సరిపోదని వెళ్తుంది. దీంతో అందరూ బాధ పడతారు.

సంస్కారం లేని వాళ్లతో ఉండలేం..

ఆ తర్వాత కళ్యాణ్, అప్పూలు ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధం అవుతారు. మేము బయలుదేరుతున్నామని అందరికీ చెప్తారు. రేయ్ కళ్యాణ్ ఉండొచ్చు కదరా అని రాజ్ అంటే.. మా ప్రపంచంలోకి మేము వెళ్లిపోతున్నాం అన్నయ్య. మేము వచ్చింది ఉండిపోవడానికి కాదు.. ఈ ఇంటి పెద్దరికాన్ని నిలబెట్టడానికి. నాన్నమ్మ, తాతయ్య మాట తీయకుండా వచ్చాం. ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోతున్నామని కళ్యాణ్ అంటే.. మీకు ఇంట్లో హక్కు, అధికారాలు ఉన్నాయి. ఇక్కడే ఉండొచ్చని సుభాష్ అంటాడు. సంస్కారం లేని వాళ్లతో కలిసి ఉండటం వల్ల.. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ అవమానాలను ఎదుర్కుంటూనే ఉన్నామని కళ్యాణ్ అంటాడు. వచ్చిన దగ్గర్నుంచి ఏం తక్కవు చేశాను రా నీకు? అని ధాన్య లక్ష్మి అంటుంది.

ఇవి కూడా చదవండి

ధాన్య లక్ష్మికి చివాట్లు..

ఆ మాట నువ్వు మాట్లాడుతున్నావా ధాన్య లక్ష్మి.. వాళ్లను నువ్వే తక్కువ చేశావు. నీ ఆస్తి, ఐశ్వర్యం చూసి వచ్చారా? నేనూ మీ మావయ్య వెళ్లి నచ్చజెప్పి.. బతిమలాడకుంటే వచ్చారు. కానీ నువ్వు ఆ మందరతో చేరి వీళ్ల మనసులు కష్ట పెట్టావని ఇందిరా దేవి అంటుంది. నేను ఉన్నదే అన్నాను. అయినా వచ్చిన వాళ్లే చెప్పారు కదా.. వాడి భార్య ఈ దుగ్గిరాల ఫ్యామిలీకి సరిపోదని ధాన్య లక్ష్మి అంటుంది. ఆ వచ్చిన వాళ్లను ఎవరు పిలిచారు? అమ్మమ్మా.. అపర్ణ ఆంటీ మీరు పిలిచారా? అని స్పప్న అంటే తెలీదని అంటారు. అంటే మీరే వాళ్లను పిలిచారు. ఎంత ఇచ్చారు అలా మాట్లాడటానికి? నా చెల్లెల్ని అవమానించడానికి పూజ పేరుతో వాళ్లను పిలిచావంటే నువ్వు ఎంత ప్లాన్‌తో ఉన్నావో అర్థమవుతుందని అని స్వప్న అంటుంది.

అపర్ణను నిందించిన ధాన్య లక్ష్మి..

ఆ విషయం నాకు ఎప్పుడో అర్థమైందని కళ్యాణ్ అంటాడు. ఏమో అంతలా వాళ్లు అవమానిస్తున్నా.. ఒక్క మాట కూడా అనకుండా పిచ్చి మొద్దులా అలా నిలబడ్డావేంటే? అని స్వప్న అడిగితే.. అప్పూ నాకు మాట ఇచ్చింది. ఈ ఇంట్లో ఏం జరిగినా నోరు విప్పను అని మాట ఇచ్చిందని కళ్యాణ్ చెప్తాడు. వాళ్లను ఇంట్లోకి రానివ్వకుండా ఉండటానికి ఇంత కథ నడుపుతావా? అసలు నువ్వు తల్లివేనా? అని అపర్ణ అంటుంది. ఇప్పుడు నువ్వు ఇంత మాట్లాడుతున్నావ్ కానీ ఒకప్పుడు రాజ్ పెళ్లి చేసుకుని వస్తే నువ్వు కూడా వాళ్లను దూరం పెట్టావ్ కదా ఇప్పుడు నన్ను అంటావేంటి? అని ధాన్య లక్ష్మి అంటుంది. నేను దూరం మాత్రమే పెట్టాను. గడప దాటి బయటకు వెళ్లనివ్వ లేదు. ఇంట్లోనే ఉండనిచ్చాను. అయినా సరే నేను తప్పులు చేశాను. ఆ తప్పులు అన్నీ ఇప్పుడు సరి దిద్దుకుంటున్నాను. ఈ తప్పులకు తగిన శిక్ష అనుభవిస్తావు. నీకు తోడు ఈ శిఖండి చేరిందని అపర్ణ అంటుంది.

వాళ్లిద్దరూ ఇక్కడే ఉండాలి..

ఎవరు పిలిచినా రాలేదు. మా వయసుకు గౌరవం ఇచ్చి వచ్చారు. కానీ వాళ్లను నువ్వు ఇలా అవమానించడం చాలా తప్పు ధాన్య లక్ష్మి. వాడి మనసు విరిగిపోయేలా ప్రవర్తించావు. అందరి ముందూ నిన్ను మందలిస్తే నా ఇంటి కోడలి పరువే పోతుందని ఊరుకున్నాను. కానీ నువ్వు మాత్రం అందరి ముందు ఆ అమ్మాయిని అవమానించావని సీతారామయ్య అంటాడు. వాళ్లిద్దరూ ఇక్కడే ఉండాలని ఇందిరా దేవి అంటాడు.

బయటకు వెళ్లి సుఖంగా ఉంటారు..

ఎందుకమ్మా వాళ్లిద్దరూ ఇక్కడే ఎందుకు ఉండాలి. ప్రతిరోజూ నా కోడలు మాటలు పడుతూనే ఉండాలా? వీళ్లను కన్నందుకు వాళ్ల అమ్మానాన్నలను కూడా మాటలు పడాల్సిందే నా? అక్కర్లేదు.. నా కొడుకు తన భార్యను పోషించుకుంటాడు. వాడి మాట దాటి అప్పూ ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా మాట్లాడ లేదంటే.. భర్తగా ఎంత గౌరవం ఇస్తుందో అర్థం అవుతుంది. ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు ఎందుకు? వాళ్లకు ఒకరి మీద ఒకరికి గౌరవం, ప్రేమ ఉంది. పస్తులు ఉన్నా సుఖంగానే ఉంటారు. మీరు వెళ్లండి అని ప్రకాశం అంటాడు. వెళ్లండి.. మీరిద్దరూ ఈ ఇంటికి తల ఎత్తుకునే రోజు తప్పకుండా వస్తుందని కావ్య అంటుంది. ఇక ఇంట్లోంచి కళ్యాణ్, అప్పూలు వెళ్లిపోతారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.