Brahmamudi: సూపర్ ట్విస్ట్‌తో బ్రహ్మముడి.. నేటి ఎపిసోడ్‌లో ఒక ప్లాన్‌తో అక్కాచెల్లెళ్ల జీవితం నాశనం చేయడానికి రాహుల్ ప్లాన్..

|

May 13, 2023 | 10:04 AM

బుల్లి తెరపై ఎన్నిరకాల ప్రోగ్రామ్స్, వినోద కార్యక్రమాలు వచ్చినా సీరియల్స్ స్థానం ఎప్పుడూ పదిలమే..కొంచెం కంటెంట్ డిఫరెంట్ గా ఉండి.. కుటుంబ కథ అయి ఉంటె చాలు  లేడీస్ ను ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని టాప్ రేసులో దూసుకుపోతోంది.

Brahmamudi: సూపర్ ట్విస్ట్‌తో బ్రహ్మముడి.. నేటి ఎపిసోడ్‌లో ఒక ప్లాన్‌తో అక్కాచెల్లెళ్ల జీవితం నాశనం చేయడానికి రాహుల్ ప్లాన్..
Brahmamudi Serial
Follow us on

బ్రహ్మముడి సీరియల్‌ రోజుకో ట్విస్ట్ తో బుల్లి తెర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది. పేదింటి తల్లి తనకూతుర్లకు బంగారు భవిష్యత్ ఇవ్వడం కోసం పడుతున్న తపన.. ధనవంతుడైన హీరో ఫ్యామిలీ కి మధ్య జరుగుతున్న ఎమోషనల్ కుటుంబ డ్రామా తెలుగువారిని ఆకట్టుకుంది. స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మ ముడి లో ఈ రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనున్నదో తెలుసుకుందాం..

అపర్ణ ఆలోచన: 

తనకు ఇష్టం లేని కోడలు కావ్య గురించి గుడిలో జరిగిన సంఘటన ను గుర్తు చేసుకుని ఆలోచిస్తున్న అపర్ణ దగ్గరకు వచ్చిన రుద్రాణి వచ్చి మరింత ఆజ్యం పోస్తుంది. కోడలు కావ్యాన్ని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టావా అంటూ రెచ్చగొట్టడానికి ప్రయాణిస్తోంది రుద్రాణి. నాకు అర్థమైంది.. ఇది తలనొప్పి కాదని రుద్రాణి అంటుంటే.. తలనొప్పి అని నేను అనలేదు అంటుంది. అపర్ణ. రాజ్ కావ్యాన్ని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టాడు.. నువ్వుకూడా కోడలిని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టావా అంటుంది.  రుద్రాణిని అపర్ణ విసుక్కుంది. దీంతో నువ్వు ఇలా  ఇలా అందరినీ తిట్టి నీ పరువు నిలుపుకోవాలంటే నేను మాత్రమే కాదు.. ఈ ఇంట్లో అందరూ నిన్ను ఒంటరిగా వదిలేస్తారు.. నీ కొడుకుతో సహా.. అంటోంది రుద్రాణి. రాజ్ అందరి ముందు కావ్య మీద కోపం చూపించి గదిలో మాత్రం ప్రేమ చూపిస్తున్నాడేమోనని అంటుంది. తన కొడుక్కి ఆ అవసరం లేదని అపర్ణ అంటే అలాంటప్పుడు తనని వెనకేసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని మైండ్ లో విషం నింపేసి వెళ్ళిపోతుంది.

ఇవి కూడా చదవండి

రాజ్ గదిలో 

రాజ్ తన గదిలోకి వచ్చి.. చూసి షాక్ తింటాడు. తన గది తనకే కొత్తగా ఉంది,… ఇన్ని రోజులు నీ టాలెంట్ ఎక్కడ పెట్టావు అంటూ పని మనిషిపై ప్రశంసలు కురిపిస్తాడు. అయితే కావ్య తన గదిని డెకరేట్ చేసిందని తెలిసి.. ఎందుకు ఇలా చేశావంటూ ప్రశ్నిస్తాడు రాజ్. మూడు రోజుల్లో వెళ్లిపోయే నీకు ఎందుకు ఇవన్నీ అంటాడు. నేను తప్పు చేశానని నిరూపణ అయితే కదా వెళ్ళేదని కావ్య బదులిస్తుంది. అంతేకాదు మిరియాలు పాలు తాగండి.. మీ గురక వినలేక చస్తున్నా అంటుంటే.. తనకు గురక రాదని వాదిస్తాడు రాజ్.

స్వప్న, రాహుల్ 

ఫేస్ ప్యాక్ వేసుకున్న స్వప్న ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తోంది. ఇంట్లో నన్ను ఎవరూ నమ్మడం లేదని స్వప్న అనుకుంటోంది.. దీనంతటికీ కారణం రాహుల్.. ఆ రాహుల్‌ని నమ్మి తప్పు చేశాను.. రాజ్‌కి ఎందుకు నిజం చెప్పలేదు.. అసలు అక్కడ ఏమి జరిగింది అని ఆలోచిస్తూ.. రాహుల్ కు ఫోన్ చేసి.. పెళ్లి గురించి ప్రశ్నిస్తుంది. మన విషయం రాజ్ కు చెప్పేద్దాం అంటుంది. అయితే రాహుల్ వద్దు అనడంతో ఎందుకు అని ప్రశ్నిస్తుంది మళ్ళీ స్వప్న.

రాజ్ తప్పుగా ఆలోచిస్తాడేమో అని నీ మంచికోసమే నిన్ను వెళ్ళిపోమన్నాను స్వప్నా.. సమయం, సందర్భం లేకుండా ఏమీ అనకూడదు.. అందుకే రాజ్‌తో అన్నాను నిజం చెప్పకు. .. మంచి సమయం దొరికినప్పుడు చూసి మన పెళ్లి గురించి నేనే అందరితో మాట్లాడతా అన్నాడు రాహుల్. స్వప్నని వాడుకుని కావ్య మీద రాజ్ కి ద్వేషం కలిగేలా చేస్తాను. దోషం నీకు, ద్వేషం కావ్యకి ఒకే దెబ్బకి రెండు పిట్టలని మనసులో అనుకుంటాడు. అయితే స్వప్న వీలైనంత త్వరగా మన పెళ్లి జరిగేలా చూడమని, మళ్ళీ రేపు కలుద్దామని చెప్తుంది.

గురక ని వీడియో తీయడానికి ప్రయత్నించిన కావ్య 

రాజ్ నిద్రలో గురక పెడుతున్న రాజ్ ను అతని ఫోన్ లో రికార్డ్ చేయడానికి కావ్య ప్రయత్నిస్తుంది. అతడి ఫోన్ లో గురక రికార్డ్ చేసి.. ఆ ఫోన్ ని అతని దిండు కింద పెడుతుంది. ఆ సౌండ్ కు రాజ్ ఉల్కిపడి.. నిద్ర లేస్తాడు. కావ్య గురక పెడుతుంది అనుకుంటాడు రేపు చెబుతా నీ పని అనికుని రాజ్ నిద్రపోతాడు.

స్వప్నకు పెళ్లి చూపులు 

స్వప్న కోసం కనకం చీర తెచ్చి ఇస్తుంది. అది చూసి స్వప్న చాలా సంతోషపడింది. తన తల్లితో మనసు విప్పి మాట్లాడుతుంది. తనతో మాట్లాడమని తల్లిని బ్రతిమాలుతుంది. అయితే కనకం.. స్వప్నకు పెళ్లి వారు వస్తున్నారు. రెడీ అవ్వమని చెబుతుంది. నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఈసారి లేచిపోవడాలు, పారిపోవడాలు చేస్తే తోలు తీస్తానని కనకం వార్నింగ్ ఇస్తుంది. నీ కోసం ఏ రాకుమారుడు రాడు.. వస్తాడమ్మా యువరాజు వస్తాడు నా కోసం రెక్కల గుర్రంపై దిగాను.. అని స్వప్న చెప్పింది. నువ్వు పగటి కలలు కంటూ నీ పేరును సార్థకం చేసుకుంటున్నావు.. కానీ కలలు సాకారం కావు.. మేం నిర్ణయించిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది.

తోటపనిలో కావ్య 

మొక్కలకు నీళ్లు పోస్తోన్న కావ్య ని చూసి కళ్యాణ్ నువ్వు గార్డెనింగ్ చేస్తున్నావు.. తోటమాలి ఏమయ్యాడని అడుగుతాడు. కావ్య రెండు రోజులు సెలవు చెప్పింది. తానుచేస్తానన్న కళ్యాణ్ తో నేను ఈ పని నేను కష్టపడి చేయలేదు.. ఇష్టంగా చేస్తున్నాను.. మీరు వెళ్లి హ్యాపీగా రాసుకోండి అంటుంది. కళ్యాణ్ వెళ్తున్న సమయంలో రాజ్ మొక్కల దగ్గరకు వస్తాడు. పనివాళ్ళు ఉన్నారు కదా ఎందుకు కావ్య మొక్కల పని చేస్తుందని రాజ్..  కళ్యాణ్ తో  అంటారు. ఇంట్లో అందరినీ మెప్పించాలని చూస్తుందని రాజ్ అంటాడు. దీంతో కళ్యాణ్.. వద్దు అన్నయ్య.. వదిన ఎవరి మెప్పుకోసం ఏమీ చేయదు. . శాంత చేతికి తగిలింది.. తోటమాలి సెలవులో ఉన్నాడు అందుకే వదిన తోటపని చేస్తోంది. మొక్కలకు ప్రాణం ఉందని వదినకు తెలుసు అంటూ మాట్లాడతారు.. దీంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

నెక్స్ట్ ఎపిసోడ్ లో

రానున్న బ్రహ్మ్మముడి సీరియల్ లో ధాన్యలక్ష్మి రాజ్ వద్దకు వచ్చి… కావ్యను ఎందుకు వదిలేద్దామనుకుంటున్నావు.. ఏం తప్పు చేసింది.. అని ప్రశ్నిస్తుంది ధన్య లక్ష్మి. ఈ ఇంట్లో నువ్వూ, మీ  అమ్మా ఎన్ని మాటలు అంటున్నా  ఓపికతోభరిస్తున్న కావ్యకు ఇంట్లో తాము సపోర్ట్ అంటూ చెబుతుంది. మరోవైపు రుద్రాణి ఇందిరాదేవితో, “కొత్త కోడలు లేదు అమ్మా..” అని ధనియాలక్ష్మి కోపంగా చెప్పింది..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..