Brahmamudi, May 16th episode: కావ్య కిడ్నాప్‌కు స్కెచ్.. అనామిక తల్లికి పెద్దావిడ వార్నింగ్..

|

May 16, 2024 | 12:49 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అనామిక వచ్చి రుద్రాణి సహాయం అడుగుతుంది. కళ్యాణ్ గురించి మాట్లాడాలి.. కళ్యాణ్ తిరిగి ఆఫీస్‌కి వెళ్లేలా మీరే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక ఐడియా ఇవ్వండని అడుగుతుంది అనామిక. కళ్యాణ్ పర్మినెంట్‌గా ఆఫీస్‌కి వెళ్లకుండా దీంతోనే చేయాలని రుద్రాణి మనసులో అనుకుని.. టైం పడుతుందని అంటుంది. కళ్యాణ్ ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేడు. కాబట్టి.. నువ్వు మీ అమ్మానాన్నలను ఇక్కడికి దింపు అని అంటుంది. వాళ్లకెందుకు ఇక్కడికి..

Brahmamudi, May 16th episode: కావ్య కిడ్నాప్‌కు స్కెచ్.. అనామిక తల్లికి పెద్దావిడ వార్నింగ్..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అనామిక వచ్చి రుద్రాణి సహాయం అడుగుతుంది. కళ్యాణ్ గురించి మాట్లాడాలి.. కళ్యాణ్ తిరిగి ఆఫీస్‌కి వెళ్లేలా మీరే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక ఐడియా ఇవ్వండని అడుగుతుంది అనామిక. కళ్యాణ్ పర్మినెంట్‌గా ఆఫీస్‌కి వెళ్లకుండా దీంతోనే చేయాలని రుద్రాణి మనసులో అనుకుని.. టైం పడుతుందని అంటుంది. కళ్యాణ్ ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేడు. కాబట్టి.. నువ్వు మీ అమ్మానాన్నలను ఇక్కడికి దింపు అని అంటుంది. వాళ్లకెందుకు ఇక్కడికి అని అనామిక అడుగుతుంది. నిన్ను సరిగ్గా చేయడం లేదు కదా.. అందుకే వాళ్లు వచ్చి నిలదీస్తారు. అలా నిలదీస్తే.. కళ్యాణ్ నువ్వు చెప్పినట్టు వినమని ఇంట్లో వాళ్లందరూ చెప్తారని రుద్రాణి అంటే.. అవును నిజమే.. వెంటనే మా అమ్మానాన్నలకు కాల్ చేసి రమ్మని చెప్తాను అని అనామిక వెళ్తుంది.

మాయ ఇంటికి వచ్చేసిన కావ్య..

ఈ సీన్ కట్ చేస్తే.. మాయ ఉన్నట్టువంటి ఇంటికి వస్తుంది కావ్య. అక్కడున్న ఒకావిడను.. ఇక్కడ మాయ అనే ఆవిడ ఉందా? అని అడుగుతాడు. మాయనా తెలుసు.. రోజుకూ ఎవరో ఒకరు వచ్చి ఆమె కోసం అడుగుతూ ఉంటారు అని చెప్తుంది. మరి ఇక్కడ మాయ ఉందా? అని అడుగుతుంది. లేదు.. ఎక్కడో ఇల్లు కొనుక్కుని ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏ లాటరీ తగిలిందో ఏమో కానీ.. ఆవిడ తిన్నూ తీరూ అంతా మారిపోయిందని అంటుంది. సరే ఆవిడ ఇల్లు ఎక్కడ ఉందో మీకు తెలుసా అని కావ్య అడిగితే.. ఇంటి గల ఓనర్ అడ్రెస్ చెప్తుంది. సరే అని అక్కడి నుంచి వెళ్తుంది కావ్య. ఈలోపు వెనుక నుంచి కిడ్నాపర్ గ్యాంగ్.. కావ్యను కిడ్నాప్ చేసేందుకు ఫాలో అవుతారు.

రాజ్‌కు తెలిసిన నిజం..

ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక తన తల్లికి కాల్ చేసి.. ఇంటికి రమ్మని చెప్తుంది. మా వాళ్లను నిలదీయడానికి టైమ్ వచ్చింది. కళ్యాణ్‌ని దారిలో పెట్టడానికి మీరు రావాల్సి ఉంది రండి అని చెప్తుంది అనామిక. ఈలోపు రాజ్ మాయ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే రాజ్ దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తి కనిపిస్తాడు. ఈయనేంటి ఇక్కడ? కావ్య మేడమ్ కు నిజం చెప్పిన విషయం తెలిసి పోయిందా? సారీ ఇంకెప్పుడూ తప్పు చేయను. అసలు మీ కంటికే కనిపించను అని అంటాడు. వీడేంటి? నన్ను చూసి ఇలా భయ పడుతున్నాడు. ఏదో తప్పు చేశాడు. అదేంటో నాకు తెలిసినట్టు నాటకం ఆడాలి అని రాజ్ అనుకుంటాడు. నిజం తెలిసినట్టు నాటకం ఆడతాడు. సారీ సర్.. కావ్య మేడమ్‌కి అడిగే సరికి ఆ బిడ్డ మీ బిడ్డ కాదని చెప్పాల్సి వచ్చింది. ఇంకెప్పుడూ ఇలా చేయను సర్ అని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. కళావతికి ఆ బిడ్డ నా బిడ్డ కాదన్న విషయం తెలిసి పోయింది. అంత వరకే తెలుసా? లేక ఆ బిడ్డ మా డాడ్ బిడ్డ అని కూడా తెలుసా? అని కావ్యకి కాల్ చేస్తూ ఉంటాడు రాజ్.

ఇవి కూడా చదవండి

కావ్య కిడ్నాప్‌కు స్కెచ్ సిద్ధం..

అప్పుడే అప్పూకి కాల్ చేసి.. ఎక్కడ ఉన్నావే అని కావ్య అడుగుతుంది. వచ్చేస్తున్నా అక్కా పక్కనే ఉన్నాను అని చెప్తుంది అప్పూ. వెనుక నుంచి కిడ్నాపర్ గ్యాంగ్ ఫాలో అవుతూ ఉంటుంది. కావాలనే మంగమ్మ వచ్చి కావ్యకి అడ్డు పడుతుంది. ఈలోపు మాటల్లో కలిపి.. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. కావ్య అడ్రెస్ చెప్తుంది. రామ్మా నేను చూపిస్తాను అని తీసుకెళ్తుంది మంగమ్మ. ఈలోపు అనామిక పేరెంట్స్ దుగ్గిరాల ఇంటికి వచ్చి కూర్చొంటారు. చెప్పండి.. ఏదో మాట్లాడాలి అన్నారు అని పెద్దావిడ అడిగితే.. మా కాపురం గురించే అని అంటారు. మీ కూతురు కాపురానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? మా అబ్బాయి తాగుబోతా? తిరుగుబోతా? మీరు ప్రత్యేకంగా పంచాయితీ పెట్టి అడగాల్సిన దుస్థితిలో మీ అమ్మాయి ఏమీ లేదే? అని అపర్ణ అంటుంది.

పంచాయితీకి మేమే పిలవాలి..

నిజానికి మేమే పిలవాలి పంచాయితీకి.. కానీ మా ఫ్యామిలీ ఒక సెలయేరు లాంటిది.. చెత్త వచ్చినా తనలో కలిపేసుకుంటుంది. అందుకే మేము పట్టించుకోలేదు. లేదంటే మీ ఇంటి సమస్యగా మారి ఉండేది. ముందు వాళ్లు ఏం చెప్తారో చెప్పనివ్వండని ధాన్య లక్ష్మి అంటే.. నా కోడలూ.. నా కోడలూ అని నెత్తికి ఎక్కించుకున్నావ్ కదా.. చూడు నీ కోడలు ఇంటి సభ్యుల్ని ఎలా కూర్చోబెట్టిందో.. అని ప్రకాశం దెప్పిపొడుస్తాడు. మా అమ్మాయి జీవితం ఏం అవుతుందోమోనని భయంగా ఉందని శైలు అంటుంది. అప్పుడే అపర్ణ అడ్డు పడుతుంది. మీరెవరూ మిమ్మల్ని మాట్లాడనివ్వడం లేదని సుబ్రమణ్యం అంటే.. ఏం మాట్లాడాలి సర్.. చెప్పండి? పెద్దమ్మా వాళ్లేం అడుగుతారో అడిగిన తర్వాతే మాట్లాడదాం అని కళ్యాణ్ సీరియస్ అవుతాడు. మీరు చెప్పండి అని సుభాష్ అంటాడు.

అనామిక పేరెంట్స్‌కి దబిడి.. దిబిడే..

కళ్యాణ్ మా అమ్మాయితో ప్రేమగా ఉండటం లేదంట. మరీ ఆఫీస్‌కి వెళ్లకుండా కవితలు రాసుకుంటూ ఉంటే ఎలా అండి? అడుగుతాడు సుబ్రమణ్యం. మీ అమ్మాయికి మా అబ్బాయి పరిచయం అయినప్పుడు కవితలు రాయడం లేదా? అది చూసే కదా.. ఉత్తరాలు రాసి.. ఫోన్లు చేసి తన వైపుకు తిప్పుకుందని ఇందిరా దేవి అంటుంది. పెళ్లైన తర్వాత కూడా కవిత్వాలు అని కూర్చొంటే ఎలాగండి? అని అడుగుతాడు. యే.. మా వాడు సంపాదించి తెచ్చి పెడితే తప్ప.. మీ అమ్మాయికి పూట గడవదా? అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. వాళ్లు కష్ట పడ్డా పడకపోయినా.. తరాల నుంచి ఆస్తిని కూడబెడుతూనే వచ్చామని సుభాష్ అంటాడు. ఉద్యోగం పురుష లక్షణం కదా అని సుబ్రమణ్యం అంటాడు. గాడిదకేం తెలుసు? గంధం పూల వాసన అని స్పప్న సెటైర్ వేస్తుంది. మీ అబ్బాయి మా అమ్మాయి కోరుకున్న విధంగా ఉండటం లేదని.. శైలూ అంటే.. అప్పుడే కళ్యాణ్, అనామికలు దెబ్బలాడుకుంటారు. అదీ సంగతి.. అక్కడ బెడిసి కొడుతుంది వ్యవహారం. మీ అమ్మాయిలో మొండితనం ఉంది. మళ్లీ మీ అమ్మాయి మా వాడిపై పోలీస్ కేసు పెట్టాడు. దాంతో వాడి మనసు విరిగి పోయిందని అపర్ణ, ధాన్య లక్ష్మిలు అంటారు.

అనామిక తల్లికి మాస్ వార్నింగ్ ఇచ్చిన పెద్దావిడ..

మరి అప్పూతో కలిసి తిరుగుతుంటే ఊరుకోవాలా అత్తయ్యా? అని అనామిక అంటే.. ఏయ్ మధ్యలో అప్పూ పేరు తీసుకొస్తే చెప్పు.. అని స్పప్న అనబోతుండగా.. రుద్రాణి నోరు మూస్తుంది. పోని మీ అబ్బాయి ఉద్దేశం ఏంటో.. స్పష్టంగా చెప్పమనండి. అప్పుడు మేము చేయాలనుకున్నది చేస్తామని శైలు అంటుంది. ఏం చేస్తాం నువ్వు? లే ముందు పైకి లే.. ఎవర్ని బెదిరిస్తున్నావ్. ఎవరూ ఏమీ చేయలేకనా? నీ కూతురు నా మనవడిపై పోలీసు కేసు పెట్టినా.. ఇంట్లోకి రానిచ్చింది. ఈ ఇంట్లో ఎవరు ఫోన్ చేసినా.. నీ ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్‌లో ఉంటారు. కలపడానికి వచ్చిన దానివి అయితే నోరు మూసుకుని కూర్చో.. విడదీయడానికే వచ్చి ఉంటే.. క్షణాల్లో ఇక్కడి నుంచి వెళ్లిపో అని పెద్దావిడ వార్నింగ్ ఇస్తుంది. దీంతో అనామిక తల్లి బెదిరి పోతుంది. కలిపితే కలుపు.. లేదంటే వెళ్లిపో.. మావాడికి మేము సర్ది చెప్పుకుంటాం. మీ పిల్లకు ఏ కష్టం లేకుండా చూసుకుంటామని ఇందిరా దేవి అంటుంది.

మంగమ్మ సైగ.. కారు తెచ్చిన కిడ్నాపర్లు..

ఆ తర్వాత కావ్యని ఎవరూ లేని చోటికి తీసుకెళ్తుంది మంగమ్మా.. ఇదేంటమ్మా ఆవిడ రెండో సందు అని చెప్పింది. నువ్వేమో అన్నీ తిప్పుతున్నావ్? అని కావ్య అడుగుతుంది. వచ్చేశాం పదమ్మా.. అని మంగమ్మ అంటుంది. అప్పుడే అప్పూ కాల్ చేస్తుంది. అక్కా ఎక్కడున్నావ్? అని అడుగుతుంది. అక్కడ వాళ్లు లేరంటే.. నీకు ఇప్పుడే లైవ్ లొకేషన్ పంపిస్తున్నా.. వచ్చేయ్ అని కావ్య అంటుంది. ఈలోపు కిడ్నాపర్లకు మంగమ్మ సైగ చేస్తుంది. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.