ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్, శ్వేతలను ఆస్పత్రిలో చూసి కృంగిపోతుంది కావ్య. అప్పుడే వచ్చిన స్వప్న.. కావ్య ఎవరు ఉన్నారు? అక్కడ.. తెలిసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా.. అని అడుగుతుంది. ఎవరూ లేరు పదా అని ఇద్దరూ వెళ్తారు. ఈ సీన్ కట్ చేస్తే.. కావ్యకు కళ్లు తిరుగుతున్నాయని ఆస్పత్రికి వెళ్లింది. వంట పనులు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో.. లేదంటే అనామికను సహాయం చేయమను అని ఇందిరా దేవి చెబుతుంది. అనామిక ఎందుకులే అత్తయ్యా నేనే చేసుకుంటాను అని అంటుంది ధాన్య లక్ష్మి. అప్పుడే కోడల్ని కూతురిలా చూసుకోవడం మొదలు పెట్టావ్ అన్నమాట అని రుద్రాణి అంటే.. అందరూ నీలా ఉండరు కదా అని ఇందిరా దేవి అంటుంది. అప్పుడే కళ్యాణ్ బయటకు వెళ్తూ ఉంటాడు. రేయ్ కళ్యాణ్.. నా గదిలో గీజర్ పాడైపోయింది. టెక్నీషియన్ పిలిపించు. అలాగే మీ తాతయ్య బట్టల కోసం టైలర్‌ని కూడా పిలిపించు అని పెద్దావిడ అంటే సరే అని కళ్యాణ్ అంటాడు.
పెద్దావిడ వెళ్లిపోగానే చూశావా నీ కొడుకును ఎలా వాడుకుంటున్నారో అని రుద్రాణి అంటే.. వాళ్ల నాన్నమ్మకు పనులు చేయడం కూడా తప్పేనా.. లేనిపోనివి చెప్పడం మానేసి ఇక్కడి నుంచి వెళ్లు అని ధాన్య లక్ష్మి అంటుంది. సరిగ్గా అప్పుడే అపర్ణ కూడా కళ్యాణ్‌ని పిలుస్తుంది. సాయంత్రం గుడికి వెళ్దాం నువ్వు వస్తావా అని అడుగుతుంది. అది విన్న ధాన్య లక్ష్మి సైలెంట్‌గా ఉండి పోతుంది. కావ్య, స్వప్న ఇంటికి వస్తారు. కానీ కావ్య మాత్రం ఆస్పత్రిలో ఉన్న రాజ్, శ్వేతలను గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇందిరా దేవి వచ్చి డాక్టర్ ఏమన్నారు అని అడుగుతుంది. కానీ కావ్య ఏదో ఆలోచిస్తూ పెద్దావిడను ఒక్కసారిగా హత్తుకుంటుంది. ఇందిరా దేవి కంగారు పడుతుంది. నాకు నీరసంగా ఉంది అమ్మమ్మ వెళ్లి పడుకుంటా అని వెళ్తుంది. బీపీ బాగా తగ్గిపోయింది అమ్మమ్మ.. దీనికి అంత టెన్షన్స్ ఏమున్నాయో అర్థం కావడం లేదని స్వప్న అంటే.. ఇంట్లో అందరూ యుద్దం చేస్తున్నట్టు తన మీద పడుతుంటే.. కావ్య మాత్రం ఎంతకని తట్టుకుంటుందని ఇందిరా దేవి అంటుంది.
ఈ సీన్ కట్ చేస్తే.. రాత్రి అవుతుంది. కనకం, కృష్ణ మూర్తిలు బయట కూర్చుని పని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అప్పూ కళ్యాణ్ ఫొటోలు, చీరను మంటల్లో పడేస్తుంది. ఏంటే ఇది చీరని మంటల్లో పడేశావ్ అని అప్పూ అడుగుతుంది. అవి ఆ కవి ఫొటోలు, వాడు ఇచ్చిన చీరనే మంటల్లో పడేశా. బాగా ఆలోచించే చేశా. మీకు చలి వేయడం లేదా అని అప్పూ అంటే.. నువ్వు ఏం అయిపోతావేమో అని భయం వేస్తుంది అప్పూ అని కృష్ణ మూర్తి అంటాడు. నా గురించి భయ పడకండి. మంచిగా తింటా.. టైమ్‌కి పడుకుంటా. మన ఇంటి కోసం మనమే ఏదో ఒకటి చేయాలి చేస్తాను అని అప్పూ అంటుంది. అప్పూ మాటలకు అందరూ సంతోష పడతారు.
మరోవైపు అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు. అప్పుడే రాజ్ వచ్చి ఏంటి ఈ రోజు అనామిక వడ్డిస్తుంది. కళావతి ఏది అని అడుగుతాడు. నీకు తెలీదా కావ్య గురించి అని ఇందిరా దేవి అడిగితే.. కావ్యకు ఏమైందని రాజ్ అడుగుతాడు. నువ్వు కూర్చో ముందు.. అనామికా వడ్డించు అని పెద్దావిడ అంటుంది. చెప్పు నాన్నమ్మా ఏమైందని రాజ్ అడగ్గా.. కావ్యకు కళ్లు తిరిగాయిరా.. చాలా నీరసంగా ఉందని అంటుంది. అవునా మరి ఎవరన్నా ఆస్పత్రికి తీసుకెళ్లారా అని రాజ్ అంటే.. నువ్వు తన భర్తవి.. అది నీ బాధ్యత.. మమ్మల్ని అడుగుతావేంటి? అని సీరియస్ అవుతుంది ఇందిరా దేవి. అదేంటి అత్తయ్యా జరిగింది చిన్న విషయం. దానికి ఆఫీస్ నుంచి పని మానుకుని రావాలా.. అని అపర్ణ అడుగుతుంది. అదే జరిగింది అత్తయ్యా ఇప్పుడు అని స్పప్న అంటుంది. అవునా నాకు కాల్ చేయాల్సింది.. నేను వచ్చేవాడిని కదా అని అంటాడు రాజ్. కావ్య ఫోన్ చేసింది రాజ్.. కానీ కనీసం చెప్పింది వింటే కదా.. నువ్వేమో కట్ చేశావ్ అంటుంది స్వప్న కోపంగా. ఇప్పుడేంటి? వాడిని తిననివ్వరా? అని అపర్ణ రెచ్చి పోతుంది. నాకు ఆకలిగా లేదు అని రాజ్ లేచి వెళ్లి పోతాడు. ఇప్పుడు సంతోషమా అని అపర్ణా దేవి ఫైర్ అవుతుంది.
సరిగ్గా అదే సమయంలో రుద్రాణి పుల్లలు పెడుతుంది. అవును గీజర్స్ పోయాయి కదా.. టెక్నీషియన్ రాలేదు ఇప్పుడు ఎలా? అని అంటుంది. రాజ్ భోజనం తినలేదన్న కోపంలో.. రేయ్ కళ్యాణ్ నీకు ఆల్‌రెడీ చెప్పాను కదా.. గీజర్స్ సంగతి చూడమని అని అంటుంది. రేపు దగ్గరుండి తీసుకొస్తాను పెద్దమ్మా అంటాడు కళ్యాణ్. దానికి వెంటనే రివర్స్ అయిపోతుంది ధాన్య లక్ష్మి. అన్నీ నా కొడుకే చేయాలా అక్కా? వాడు ఏమైనా ఈ ఇంటి నౌకర్ అనుకుంటున్నావా? నీకు నీ కొడుకు ఎంతో నాకు నా కొడుకు కూడా అంతే. నీ కొడుకు పెళ్లానికి బాగోలేకపోయినా రాలేనంత బిజీగా ఉండొచ్చు. నా కొడుక్కి కొత్తగా పెళ్లి అయింది. ఇలాంటి పనుల కోసం వాడిని పంపించడం ఏంటి? అని రెచ్చి పోతుంది ధాన్య లక్ష్మి. ఆ గొడవ చూసి అనామిక, రుద్రాణి సంబర పడి పోతారు. మధ్యలో నువ్వు ఆగు అని అంటాడు కళ్యాణ్? ధాన్య లక్ష్మీ ఆగు.. అంత తొందర పడిపోతావ్ ఏంటి? అని ఇందిరా దేవి అంటుంది. లేదు అత్తయ్యా ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను. ఇంకా చూసీ చూడనట్లుగా వదిలేస్తే నా కొడుకుని ఈ ఇంట్లో సర్వెంట్‌ని చేసేలా అని తన ఆవేశాన్ని వెళ్లగక్కుతుంది ధాన్య లక్ష్మి.
నువ్వు కడుపులో ఇంత పెట్టుకుని.. పైకి అక్కా అని పిలుస్తున్నావ్ అని తెలీదు. ఇక నుంచి ఎవరూ ఏ పనీ చేయకండి అని చేయి కడిగేసుకుని లేచిపోతుంది. ఈ లోపు వాళ్ల అమ్మకు కాల్ చేస్తుంది అనామిక. మనం అనుకున్నట్టు ఇంట్లో కుంపటి రాజేశావా.. అని అడుగుతుంది. నాన్న అంటాడే ఈ ఇంట్లో ముసలం పుట్టించాలి అని.. అదే పుట్టింది. మా అత్తయ్య..పెద్ద అత్తయ్యపై సీరియస్ అయింది. తోడి కోడళ్ల మధ్య మంట పుడితే అంత త్వరగా ఆడదు కదా అని అంటుంది అనామిక. వాళ్ల సంగతి సరేనే.. మీ ఆయన్ని కొంగుకు కట్టేసుకోమన్నాను కదా ఏమైంది అని అడుగుతుంది. తెలివిగల భార్య ఎప్పుడైనా.. భర్తను రాజును చేసి తాను కూడా రాణిలా ఉండాలి అనుకుంటుంది. ఇంట్లో భార్యను ఎదురుగా పెట్టుకుని.. ఎంత నరకంగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకుని తనే నా దగ్గరకు వస్తాడు. నేను చెప్పినట్టు చేస్తాడు అని అంటూండగానే కళ్యాణ్ వస్తాడు. దీంతో అనామిక టెన్షన్ పడుతుంది. కళ్యాణ్ రొమాన్స్ చేద్దామని అనగానే.. అనామిక తప్పించుకుంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.