Brahmamudi, January 15th episode: అప్పూకి కళ్యాణ్ ఫోన్.. కావ్య అరిష్టమన్న ధాన్య లక్ష్మి!

|

Jan 15, 2024 | 11:41 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌కి ఫోన్ చేసి కనకం థాంక్స్ చెప్తుంది. నిజంగానే మీరు చాలా సహాయం చేశారని పొగుడుతుంది. రాజ్ మాట్లాడేది కావ్య వింటుంది. అయ్యో అదేం లేదు ఆంటీ.. సరే అప్పూ ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వెనక్కి చూడగానే కావ్య ఉంటుంది. ఏంటి మళ్లీ మొత్తం అంతా వినేశావా.. ఇక్కడ కూడా నేను ఫోన్ మాట్లాడకూడదా.. రోడ్డు పైకి వెళ్లమంటావా అని అంటాడు. ఏంటి మీరు ఆస్పత్రి బిల్ కట్టారా అని కావ్య అడుగుతుంది. ఏ కట్టకూడదా.. నీ ఆత్మాభిమానం అడ్డం వచ్చిందా..

Brahmamudi, January 15th episode:  అప్పూకి కళ్యాణ్ ఫోన్.. కావ్య అరిష్టమన్న ధాన్య లక్ష్మి!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌కి ఫోన్ చేసి కనకం థాంక్స్ చెప్తుంది. నిజంగానే మీరు చాలా సహాయం చేశారని పొగుడుతుంది. రాజ్ మాట్లాడేది కావ్య వింటుంది. అయ్యో అదేం లేదు ఆంటీ.. సరే అప్పూ ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వెనక్కి చూడగానే కావ్య ఉంటుంది. ఏంటి మళ్లీ మొత్తం అంతా వినేశావా.. ఇక్కడ కూడా నేను ఫోన్ మాట్లాడకూడదా.. రోడ్డు పైకి వెళ్లమంటావా అని అంటాడు. ఏంటి మీరు ఆస్పత్రి బిల్ కట్టారా అని కావ్య అడుగుతుంది. ఏ కట్టకూడదా.. నీ ఆత్మాభిమానం అడ్డం వచ్చిందా అని రాజ్ చిరాకు పడుతూ.. లోపలికి వెళ్తాడు. అప్పూని తీసుకుని ఇంటికి వస్తారు కనకం, కృష్ణ మూర్తిలు. అప్పూని చూసిన అన్నపూర్ణ కంగారు పడుతూ.. ఏడుస్తుంది. నాకు ఏం కాలేదులో పెద్దమ్మా.. బాగానే ఉన్నాను అని అప్పూ అంటుంది.

అప్పూకి కళ్యాణ్ ఫోన్.. సీరియస్ అయిన అన్నపూర్ణ..

ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి?.. అని అన్న పూర్ణ అంటే.. నాకు పెళ్లి కాదు అంతేగా.. మీరందరూ నన్ను చూసి ఏడేస్తున్నారు. అందుకే ఏదో ఒకటి చేద్దాం అని బయటకు వెళ్లాను అని అంటుంది. అది విని కనకం ఫ్యామిలీ బాధ పడతారు. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తిన అన్నపూర్ణ.. ఎందుకు బాబూ మాటి మాటికీ ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు. ఇప్పటి వరకూ జరిగిన గొడవలు చాలవా అని సీరియస్ అవుతుంది. అప్పుడే కనకం తీసుకుని అప్పూకి బాగానే ఉంది బాబూ.. ఇప్పుడే ఇంటికి వచ్చింది పడుకుంది అని కనకం అంటుంది. సరే ఆంటీ అప్పూ లేవగానే ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి అని చెప్తాడు కళ్యాణ్.

కళ్యాణ్ మాటలు విన్న అనామిక.. నటించేస్తున్న కొత్త పెళ్లి కూతురు!

ఈలోపు వెనుక ఉన్న అనామిక మొత్తం వినేస్తుంది. కోపంగా ఉన్నా.. ఏమీ లేనట్టు నటిస్తూ అప్పూకి ఎలా ఉందని అడుగుతుంది. బాగానే ఉందని కళ్యాణ్ అంటే.. హమ్మయ్యా అయితే అప్పూకి బాధ్యత తీరిపోయింది కాబట్టి.. ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది అనామిక. ఇక బెడ్ రూమ్ లో కూర్చుని రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరు? అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కావ్య బాయ్ ఫ్రెండ్‌ గురించి రాజ్ హైరానా..

కృష్ణుడి ఫొటో చూస్తూ.. నీలాంటి వాడా.. శ్రీరామ చంద్రుడా అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ గదిలోకి వస్తాడు. ఫోన్‌లో ఎవరు? అని అడుగుతాడు. కావ్య మెలికలు తిరుగుతూ మగ ఫ్రెండ్.. నా చిన్నప్పటి నుంచీ నాతోనే ఉన్నాడు. నా చిన్ననాటి మిత్రుడు. నా ఆత్మ బంధువు అని అంటూ చెప్తుంది. నాతో మాట్లాడించు అని రాజ్ అడిగితే.. మాట్లాడడు అని కావ్య అంటుంది. ఫోన్ చూసిన రాజ్.. కృష్ణుడా అని అంటాడు.

కావ్య అరిష్టమన్న ధాన్య లక్ష్మి.. బాధలో కళావతి..

ఆ తర్వాత బయటకు వచ్చి పూల డెకరేషన్ గురించి ఫోన్ మాట్లాడుతుంది కావ్య. అప్పుడే వెనకకు వచ్చి ధాన్య లక్ష్మి అంతా విని.. శోభనం గురించేనా నీ ఏర్పాట్లు అని అడుగుతుంది. అవును అత్తయ్యా అని కావ్య అంటే.. వ్రతంలో తల దూర్చావ్.. అది అర్థాంతరంగా ఆగిపోయింది. ఇది నా కోడలు బ్రతుకు పండించుకునే వేళ.. ఇందులో కూడా నీ చేయి పడితే.. వాళ్ల కాపురం ఏమైపోతుందని భయంగా ఉందని ధాన్య లక్ష్మి అంటుంది.

ఒకప్పుడు ఏ పని చేసినా నా చేతితో చేస్తేనే మీకు తృప్తిగా ఉండేది. నా చేయి పడితే అదృష్టం అన్నారు. ఇప్పుడు ఆ అదృష్టం అరిష్టంగా మారిపోయిందా అని కావ్య అంటే.. అవును అప్పుడు ప్రపంచ మంతా నా అంత స్వచ్ఛంగా ఉంటుంది అనుకున్నా.. ఎప్పుడైతే నీ చెల్లెల్ని నా కొడక్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూశావో అప్పటి నుంచి నీ స్వార్థం బయట పడింది. అనామికను చూసి నీ మనసు అసూయతో రగిలి పోతూ ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఈ పనిలో నువ్వు అస్సలు తల దూర్చకు. నేను ఎందులోనూ తల దూర్చను అని కావ్య చెప్పేసి వెళ్తుంటే.. అప్పుడే కళ్యాణ్ నగలు పట్టుకుని వస్తాడు.

ధాన్య లక్ష్మికి కౌంటర్ ఇచ్చిన కళ్యాణ్..

ఇది అనామికకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. వీటిల్లో ఏది బావుంటుందో చెప్పండి వదినా.. చాలా కన్ ఫ్యూజ్‌గా ఉంది అని అంటాడు. పక్క నుంచి తనకేం తెలుస్తుందిరా.. చిన్నప్పటి నుంచీ ఎప్పుడైనా బంగారం పెట్టుకుంటునే కదా అని ధాన్య లక్ష్మి అంటుంది. మా అమ్మకి రుద్రాణి అత్తయ్య బతికి ఉండగానే దెయ్యమై పూనింది. అమ్మ మాటలు పట్టించుకోకండని కళ్యాణ్ అంటాడు. దీంతో కావ్య ఏదో ఒకటి సెలెక్ట్ చేసి పైకి వెళ్తుంది.

అత్తని ముప్పతిప్పలు పెడుతున్న స్వప్న..

మరోవైపు రుద్రాణి స్వప్న గది బయట కూర్చుంటుంది. అప్పుడే స్వప్న అత్తా అత్తా అని గట్టిగా పిలుస్తుంది. ట్యాబ్లెట్స్ టైమ్ అయింది కదా.. మర్చిపోయారా.. అని అంటే.. దీంతో రుద్రాణి ట్యాబ్లెట్స్ ఇస్తుంది. ఆ తర్వాత పాయసం కావాలి అని స్వప్న అడిగితే.. రుద్రాణి కుదరదని -చెప్తుంది. దీంతో స్వప్న విమెన్ సేఫ్టీ వాళ్లకు కాల్ చేస్తుంది. ఎందుకు వద్దు ఇప్పుడే చేసి తీసుకొస్తా అని అంటుంది రుద్రాణి.