ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఆ కావ్య దగ్గర చేయి చాచి.. నేనూ నా మొగుడు బయటకు వెళ్లాల్సిన అవసరం. అందరి ముందూ నా మొగుడు చేయి చాచి వెళ్లి అడిగితే.. నాకు ఎంత అవమానంగా ఉంటుంది. ఆవిడ ఆఫీస్‌కి వెళ్తుంది కాబట్టి.. ఇంటి బాధ్యతలు మీరన్నా తీసుకోండి.. లేదా నాకన్నా ఇవ్వమని చెప్పండి. అత్తయ్యా.. ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే.. మీ అబ్బాయి జీవితాంతం ఒకరి కిందే ఆధార పడి బతకాల్సి వస్తుందని ధాన్య లక్ష్మిని రెచ్చగొడుతుంది అనామిక. దీంతో రెచ్చిపోయిన ధాన్య లక్ష్మి.. అనామిక చేయి పట్టుకుని హాలులోకి లాక్కెళ్తుంది. ఈలోపు కావాలనే రాజ్‌ని ఉడికిస్తూ ఉంటుంది కావ్య.
అనామికను లాక్కు రావడంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి అని అపర్ణ అడుగుతుంది. నాకూ నా కోడలికి ఏం పనులు చెప్తావో చెప్పు. మేము ఇద్దరం ఇంట్లో పనులు చేసుకుంటాం. మా ఆయన, కళ్యాణ్ తోటమాలి, సెక్యూరిటీ ఉద్యోగం చేస్తారు. నీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పు. నిన్నూ కోడల్ని ఎప్పుడైనా ఎవరైనా పని మనిషులుగా చూశారా? అని అపర్ణ అడుగుతుంది. నీ కోడలు కావ్య మాత్రమేనే ఈ ఇంటి కోడలు. నా కోడలు కోడలు కాదా? అని ధాన్య లక్ష్మి అంటుంది. అలా అని ఎవరు అన్నారో వాళ్ల పేర్లు చెప్పు అని ఇందిరా దేవి అంటే.. నోరు తెరిచి అనాలా అని ధాన్య లక్ష్మి రెచ్చిపోతుంది. నోరు తెరిచి అంటేనే అన్నట్టు అని అపర్ణ అంటుంది. కావ్యను మాత్రమే ఈ ఇంటి కోడలిగా చూస్తున్నారు కాబట్టి. మాకు ఎలాంటి అధికారం లేదు కాబట్టి అని ధాన్యలక్ష్మి అంటుంది.
అధికారం గురించి ఇప్పుడు ఎందుకు? తరతరాలుగా ఈ ఇంటి పెద్ద కోడలికే బాధ్యతలు ఇస్తున్నారు. మొన్నటి దాకా అపర్ణ.. ఇప్పుడు కావ్యా.. అందులో నీ కోడల్ని చిన్న చూపు చూసేది ఏముంది? అని పెద్దావిడ అడుగుతుంది. ఇన్నాళ్లూ ఆవిడ పెద్ద కోడలిగా ఉంటూ నన్ను అణగదొక్కింది. ఇప్పుడు ఈవిడ అధికారం మొదలు పెట్టి.. నా కోడల్ని అణగదొక్కుతుంది. దుగ్గిరాల వంశంలో పెద్దవాళ్లకే పీఠం వేస్తారా.. మాకు ఎటువంటి గుర్తింపు లేదా? అని ధాన్య లక్ష్మి అంటుంది. కోడలు వచ్చాక నిన్ను పుట్టింటికి పంపిస్తే బాగోదని చూస్తున్నా.. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం నిన్ను బస్సు ఎక్కించి పుట్టింటికి పంపించేస్తా.. ఆ టిక్కెట్టుకు కూడా డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. ఏమ్మా.. నువ్వు ఏమైంది నీకు. ఎవరైనా బాధ పడ్డారా.. సామరస్యంగా చెప్పు. నీకు అన్ని హక్కులు, అధికారాలు ఉన్నాయి అని సుభాష్ అడుగుతాడు.
అనామిక కళ్యాణ్‌ని బయటకు తీసుకెళ్లమంది. కావ్య దగ్గర కార్డ్స్ ఉన్నాయని కళ్యాణ్ సమాధానం చెప్పాడంట. అవసరం అయినప్పుడు కావ్యని అడిగి తీసుకోవాలంట. రాజ్‌లాగే కళ్యాణ్ కూడా వారసుడే కదా.. కావ్యలాగే అనామిక కూడా కోడలే కదా..ఎందుకు ఈ వివక్ష జరుగుతుంది అని ధాన్య లక్ష్మి రెచ్చిపోతుంది. దీనికి నేను కాదు.. మా ఆయన కాదు.. కళ్యాణ్ సమాధానం చెప్తాడు అని అపర్ణ అంటుంది. ఇక కళ్యాణ్ జరిగింది అంతా ఇంట్లో వాళ్లకు చెప్తాడు. అలా ఇబ్బంది పడకూడదనే కావ్య.. రెండు లక్షలు ఇచ్చి పోతే.. తమరే కదా దానికి దొంగతనం అంటగట్టారు. అది నాలుకా.. తాటిమట్టా స్వప్న సమాధానం ఇస్తుంది. ఏయ్ ఇది నీ వంశం కాదు.. నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్ అని ధాన్య లక్ష్మి అంటుంది.
కావ్య ఆఫీస్‌కి వెళ్తుంది కాబట్టి.. ఇంటి బాధ్యతలు నా కోడలికి అప్పజెప్పండి అని ధాన్య లక్ష్మి అంటుంది. అదండీ సంగతి. మొదటి నుంచీ కావ్యకు తాళం చెవులు ఇవ్వడం నచ్చలేదు. అందుకే మొన్న దొంగ అని ముద్ర వేసింది. ఈవిడతో కలిసి మా అత్త ఎప్పుడూ పక్కనే ఉంటున్నారు. ఇప్పుడు ఆఫీస్‌కు వెళ్తుందని కారణం అడ్డు పెట్టుకుని బాధ్యతలు అప్పజెప్పమంటున్నారు. నిన్నగాక మొన్న అడుగు పెట్టిన ఈ పిల్ల కాకి.. దుగ్గిరాల ఇంటి పెత్తనం కోసం అత్తని రాయబారానికి తీసుకొచ్చింది. ఇప్పుడు పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆలోచించండి. నాతో పెట్టుకుంటే ఇత్తడి అయిపోతుందని ధాన్య లక్ష్మికి స్వప్న వార్నింగ్ ఇస్తుంది.
నీ కోడలు వచ్చిన దగ్గర్నుంచి.. చెప్పుడు మాటలు విని ఇలా ఆటలు ఆడుతున్నావని అనిపిస్తుంది. ఇది ఉమ్మడి కుటుంబం అంటే అందరి కోసం అందరం. హక్కులు, అధికారాలు మాట్లాడకుండా.. నీ ఇబ్బందులు ఏంటో చెప్పండి. అంతే కానీ ఇలాంటి పనికి మాలిన పంచాయితీ పెట్టావంటే.. నేను ఏ రూల్ అయితే ఒకటి పాస్ చేస్తానో.. అదే అమలు జరుగుతుంది. అప్పుడు నువ్వూ, నీ కోడలు ఎంత గింజుకున్నా ఎవరు నాకు నచ్చజెప్పినా నేను వినే రకాన్ని కాదు. ఇంటి బాధ్యత ఎవరికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. రేయ్ కళ్యాణ్ కార్డ్స్ అన్నీ నీ దగ్గరే పెట్టుకో. మీ ఆవిడ చేయి నువ్వు పట్టుకుని తిరుగు.. మీ అమ్మకు ఇవ్వకు అని అపర్ణ చెప్పి వెళ్లి పోతుంది.
కావ్య తన బావ గురించి వెళ్లడంతో ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతూ ఉంటాడు రాజ్. శ్రుతిని పిలిచి.. కావ్య ఇంకా రాలేదేంటి? అని సీరియస్ అవుతుంది. అప్పుడే శ్వేత వస్తుంది. ఎందుకు టెన్షన్ అవుతున్నావ్ అని శ్వేత అడిగితే.. ఫారిన్ నుంచి వాళ్ల బావ వెళ్తున్నాడంట.. తీసుకు రావడానికి వెళ్లింది. అతని కోసం ఓ కంగారు పడి పోయి.. మెలికలు తిరిగిపోతుందని రాజ్ అంటాడు. వాళ్ల బావ వస్తే నీకేమైంది అని శ్వేత అంటే.. ఏమీ లేదని రాజ్ కవర్ చేస్తాడు. మళ్లీ శ్రుతి వచ్చి ఫైల్ మీద సంతకం కావాలి అని అడుగుతుంది. అప్పుడే ఫోన్ వస్తే బావా అంటూ మాట్లాడుతుంది శ్రుతి. అది విన్న రాజ్ చాలా సీరియస్ అవుతాడు. అదంతా శ్వేత గమనిస్తూ ఉంటుంది.
కట్ చేస్తే.. అనామిక, కళ్యాణ్‌లు బయటకు వెళ్తారు. అప్పుడే సడెన్‌గా అప్పూ.. కళ్యాణ్‌లు ఎదురు పడతాడు. అప్పూని చూసి కళ్యాణ్ సంతోష పడతాడు. హాయ్ బ్రో.. నాకు పెళ్లి అయ్యాక కలవడమే మానేశావ్ అని కళ్యాణ్ అంటాడు. విచిత్రంగా ఉంది కదా అప్పూ.. మూడు నెలల క్రితం యాక్సిడెంట్‌లో కలిశాం. ఇప్పుడు నాతో పెళ్లి నా వెనుక తిరుగుతున్నాడు. కావాలనే అప్పూని తక్కువ చేసి మాట్లాడుతుంది అనామిక. ఒకసారి ఇంటికి రా.. నీతో చాలా మాట్లాడాలి అని చెప్పి కళ్యాణ్ కారు ఎక్కుతాడు. ఆ తర్వాత నీ సొంతం చేసుకోవాలి అనుకున్న కళ్యాణ్‌ని నా సొంతం చేసుకున్నా.. ఎలా ఉంది అని అనామిక అంటుంది. నన్ను రెచ్చగొట్టకు.. కళ్యాణ్‌ని ఇప్పటికైనా నా వెనుక తిప్పుకోవడానికి పెద్ద విషయం కాదు. నన్ను రెచ్చగొట్టి నీ కాపురం నువ్వే నాశనం చేసుకోకు. కళ్యాణ్‌ని మంచిగా చూసుకుని.. సంతోషంగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది అప్పూ. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.