ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో మీ ఆఫీస్ లో పని చేసే శృతికి మీకూ ఏంటి సంబంధం అని కావ్య అడుగుతుంది. దీనికి సింపుల్ గా రాజ్ తను ఎంప్లాయ్.. నేను బాస్ ని అని అంటాడు. అవునా ఈ పరిచయం ఇంతటితోనే ఆగిందా.. అని కావ్య అంటే.. ఏయ్ అడిగేది ఏదైనా ఉంటే సూటిగా అడుగు అని రాజ్ అంటాడు. మీకూ శృతికి మధ్య ఏ సంబంధం ఉందో నాకు తెలిసిపోయింది. పెళ్లాన్ని ఇంట్లో పెట్టుకుని దాన్ని పట్టించు కోకుండా ఆఫీసులో సెక్రటరీతో సంబంధం పెట్టుకుంటారా.. అని కావ్య అంటే.. ఏం మాట్లాడుతున్నావ్ అని రాజ్ అంటాడు. మీకూ శృతికి మధ్య గ్రంథం నడుస్తుందని నాకు పూర్తిగా అర్థమైపోయిందని కావ్య అంటే.. ఏయ్ పిచ్చి ఎక్కిందా.. నాకూ తనకు మధ్య ఛీ అని రాజ్ అంటే.. నువ్వు ఇప్పుడు ఓ కొత్త డ్రామా మొదలు పెట్టవా అని రాజ్ అంటే.. ఉందని కావ్య అంటుంది.
లేదు.. ఉందనడానికి సాక్ష్యం ఉందా అని రాజ్ అడిగితే.. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటో చూపిస్తుంది కావ్య. అయితే చూపించమని రాజ్ అడుగుతాడు.. ఫొటో చూపించి.. ఆ చనువు నాకు తెలుసు.. ఆ ప్రేమ నాకు తెలుసు.. ఇప్పుడు చెప్పండని కావ్య అడుగుతుంది. ఆ ఫొటో చూసిన రాజ్ నవ్వుతూ ఇదా.. ఈ ఫొటో చూసి మా ఇద్దరికి సంబంధం అంటగట్టేసావా.. ఆఫీస్ లో కొలిగ్ తో చనువుగా ఉంటే ఇలాంటి పెద్ద నింద వేస్తావా.. ఒక్క ఫొటో చూసి ఒక అమ్మాయి మీద నింద వేసేస్తావా అని రాజ్ అంటాడు. సరే అయితే మీ ఇద్దరి మధ్య ఏమీ లేదనడానికి నాకు సాక్ష్యం కావాలి అని కావ్య అంటే.. ఏముందని సాక్ష్యం చూపించమంటావ్ అని రాజ్ అంటాడు. మరి ఏ సాక్ష్యం ఉందని మా అక్కని సాక్ష్యం అడుగుతున్నారు. ఫొటో చూసి సంబంధం అంటగట్టేశారు కదా.. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? అని రాజ్ ని నిలదీస్తుంది కావ్య.
ఈ లోపు రాజ్ ఆలోచించుకుని నగలు తాకట్టు పెట్టుకుని వాడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి? అని అడుగుతాడు. రామాయణం అంతా విని రావణుడు సీతనికి ఎందుకు ఎత్తుకెళ్లాడు? అడిగినట్టు ఉంది? వాడు మా అక్క కోటీశ్వరుల ఇంటికి కోడలు అయ్యిందని.. ఇదిగో ఇలాంటి ఫొటోలు, మీలాంటి మగవాళ్లు బాగా నమ్ముతారని తెలిసి బ్లాక్ మెయిల్ చేశాడని కావ్య అంటుంది. రాజ్ కి మళ్లీ ఇంకో డౌట్ వచ్చింది? ఇదిగో ఈ ఫొటో చూపించి.. ఈ డౌట్ నన్ను అడిగినట్టే శృతిని కూడా అడిగవా అని అడుగుతాడు. ఏమనుకుంటున్నారు.. నేను మూర్ఖురాలిని అనుకుంటున్నారా? నాకు అసలు సంస్కారమే లేదనుకుంటున్నారా.. హా అని సీరియస్ గా అడుగుతుంది కావ్య. దీని నోట్లో నోరు పెట్టడం కంటే తప్పు ఇంకేం లేదని రాజ్ ఊరుకుంటాడు. నాకూ, శృతికి మధ్య ఏదో ఉందని నువ్వు నమ్మినట్టా.. నమ్మనట్టా.. అని మళ్లీ ఇంకో డౌట్ అడుగుతాడు రాజ్. మీకంత సీన్ లేదని నాకు తెలుసులెండి అని కావ్య అంటుంది.
ఆ తర్వాత.. ఉదయం లేవగానే ధాన్య లక్ష్మి ఫైర్ అవుతుంది. ఏమైందని అడుగుతుంది కావ్య. పాపం స్వప్న.. శాంతని టీ కావాలని అడిగింది.. అంతే ఆ రుద్రాణి సిగ్గు లేదా? ఇలా బయట తిరగడానికి అంటూ అవమానించింది. అరే నిన్నే మావయ్య గారు చెప్పారు కదా.. అయినా ఇలా చేస్తే ఏంటని అర్థం.. తను తప్పు చేసిందో లేదో తర్వాత విషయం.. కనీసం మనిషిలా అయినా చూడాలి కదా.. రుద్రాణి మనసులో ఏం పెట్టుకుందో ఏమో కానీ.. ఆ స్వప్న తింగరిది కాకకపోతే.. వాడికి డబ్బులు ఇచ్చి దోషిగా నిల్చుంది. కానీ ఏం చేయను తప్పు స్వప్న వూపు ఉంటే ఏం మాట్లాడను చెప్పు అని ఫీల్ అవుతుంది ధాన్య లక్ష్మి. ఇవన్నీ సైలెంట్ గా వింటుంది కావ్య. అప్పుడే కావ్యకి కాల్ వస్తుంది. అరుణ్ అడ్రెస్ దొరికిందని బంటి చెప్తాడు. వీడిని పట్టుకుంటే అన్ని సమస్యలూ తీరిపోతాయి అని కావ్య మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరకి వచ్చి.. ఏవండీ మనం బయటకు వెళ్దాం అని అంటుంది. ఆ అరుణ్ గాడి ఇంటి అడ్రెస్ దొరికింది.. ఆలస్యం చేస్తే వాడు తప్పించుకోవచ్చు అని కావ్య అంటే.. రాజ్ పట్టించుకోడు. నాకు ఆఫీస్ లో ముఖ్యమైన మీటింగ్ ఉంది.. ఖచ్చితంగా వెళ్లాలి అని అంటాడు. ఇక కావ్య తన స్టైల్ లో రాజ్ ని కన్విన్స్ చేస్తుంది. కావ్య మాటలకు రాజ్ కన్విన్స్ అయి.. మనసులో ఆలోచించుకుంటాడు.
సరిగ్గా అప్పుడే అనామిక మదర్ ఫోన్ చేసి.. మాట్లాడుకోవడానికి ఇంటికి వస్తాం అని చెప్తారు. ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్తుంది ధాన్య లక్ష్మి. ఇక ముహుర్తాలు కూడా పెట్టుకుందాం అని ఇంట్లోని వాళ్లందరూ అనుకుంటారు. అప్పుడే రాజ్ కిందకు దిగుతాడు. కళావతి కోసం వెతుకుతాడు రాజ్. ఏంటో అంత ఇంపార్టెంట్ పని అని ధాన్య లక్ష్మి అడిగితే.. వాళ్ల ఆవిడ కొంగు పట్టుకుని తిరగడానికి వెళ్లాడు అని రుద్రాణి అంటుంది. ఇక రాజ్ ని చూసినా చూడనట్టు యాక్టింగ్ చేస్తుంది కావ్య. ఇంట్లో అందరూ ఉన్నారని..రాజ్ చేతులు కడిగినట్టు యాకింగ్ చేస్తాడు రాజ్. ఇదంతా చూసిన రుద్రాణి సెటైర్లు వేస్తే.. ధాన్య లక్ష్మి కూడా కౌంటర్ ఇస్తుంది.
కావ్య దగ్గరకు వెళ్లి నిల్చుంటాడు రాజ్. కావ్య ఏమైనా కావాలా అని అడిగితే.. నువ్వే కావాలి అని అంటాడు. కావ్య కావాలనే రాజ్ ని ఆట పట్టిస్తుంది. ఇక ఓవర్ యాక్టింగ్ ఆపు అని అంటాడు రాజ్. కావ్య కాఫీ పట్టుకుని హాల్ లోకి వస్తే.. వెనకాలే రాజ్ కూడా ఫాలో అవుతాడు. ఇదంతా ఇంట్లో వాళ్లు చూసి నవ్వుతూంటారు. అపర్ణ అయితే కుళ్లుకుంటుంది. అప్పుడే సుభాష్ రాజ్ ని పిలిచి.. ఏంట్రా కావ్య వెనకాలే తిరుగుతున్నావ్.. న్యూస్ పేపర్ కోసం అని చెప్తాడు రాజ్. మళ్లీ కావ్య వెనకాలే వెళ్తాడు.. అప్పుడు రుద్రాణి సెటైర్ వేస్తుంది. ఇక రాజ్.. కావ్యని ఫాలో అవుతూనే ఉంటాడు. రా.. బయటకు వెళ్దాం అన్నావ్ కదా అని పిలుస్తాడు. కానీ కావ్య కావాలనే బెట్టు చేస్తుంది. రా అని రాజ్.. కావ్య చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్తారు. మమ్మీ అలా బయటకు వెళ్లి వస్తాం అని చెప్పి వెళ్తారు.
ఇక కనకం దుగ్గిరాల ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. స్వప్న కోసం పిండి వంటలు తయారు చేస్తుంది. ఇది చూసిన కృష్ణ మూర్తి.. కనకాన్ని హెచ్చరిస్తాడు. నీ కూతురు తల్లి అని చూడకుండా నిన్ను కూడా పది మందిలో నిలబెట్టేస్తుంది జాగ్రత్త అని చెప్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.