‘బ్రహ్మముడి’, ‘నువ్వూ నేను ప్రేమ’ మహా ఎపిసోడ్ కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు మహా సంగ్రామం ఎపిసోడ్ లో కళ్యాణ్, అనామికల మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. ఈ సమయంలోనే సుభాష్, నారాయణ, ఆర్య, ప్రకాష్ కలిసి జారుకుని మందు కొట్టేందుకు రెడీ అవుతారు. ఈలోపు ప్రకాష్ మందు బాటిల్స్ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పడంతో.. మిగతా వారందూ కోపంతో ఊగి పోతారు. ఈలోపు లేడీస్ అందరూ మెహిందీ పెట్టుకోవడానికి సిద్ధమవుతారు. అందరూ ఒక దగ్గర చేరి.. ఒకరి మీద మరొకరు సెటైర్లు వేస్తూ ఉంటారు. ఈ సీన్స్ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది.
అనామిక ఇంటి ఆచారం ప్రకారం.. భార్యలకే భర్తలే గోరింటాకు పెట్టాలంట అని పెద్దావిడ అంటుంది. ఈ మాట విన్న రాజ్, విక్రమ్ లు మెల్లగా జారుకుంటారు. కానీ పద్దూ.. రాజ్ వెనక, విక్రమ్ వెంట కావ్య వెంట పడి మరీ పట్టుకుంటారు. ఈలోపు మెహిందీ పెట్టడానికి కళ్యాణ్, అనామికలు కూర్చుంటారు. అనామికకు మెహిందీ పెడుతూనే.. అప్పూ ఎక్కడ ఆంటీ అని కనకాన్ని అడుగుతాడు కళ్యాణ్. అప్పూ రూమ్ లో పడుకుంది అని చెప్తుంది కనకం. దీంతో కళ్యాణ్.. అప్పూకి ఫోన్ చేసి రమ్మంటాడు. కానీ అప్పూ రానని చెప్పినా.. కళ్యాణ్ వినిపించుకోకుండా.. రమ్మంటాడు. దీంతో తప్పక వస్తుంది అప్పూ.
మరోవైపు రాజ్ తప్పించుకునేందుకు ట్రై చేసినా.. పద్మావతి ఎలాగోలా పట్టేసుకుని బావగారూ రండి అని తీసుకెళ్తుంది. అలాగే విక్రమ్ ని కూడా కావ్య వదలకుండా జిడ్డులాగ పట్టుకుంటుంది. ఎలాగైనా విక్కీని కూడా మెహిందీ పెట్టడానికి తీసుకెళ్తుంది. ఇక పెద్ద వాళ్ల జంటలందరూ కూర్చుంటారు. వారి భార్యలకు మెహిందీ పెడతారు భర్తలు. అందంతా చూసి పెద్దావిడ, పెద్దాయన నవ్వుకుంటూ ఉంటారు.
అందంతా చూసి ఎంతో సంతోషంగా ఉందని చెప్తాడు మురళి. మీరేంటి సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టులో సినిమాలో రేలంగి మావయ్యలా మనుషులు అంటేనే మంచివాళ్లలా మాట్లాడుతున్నారు అని రాహుల్ అడుగుతాడు. ఇంకేంటి ఇలాంటి టైమ్ గురించే కదా చూస్తున్నాం.. సరైన సమయం వచ్చింది కాబట్టి ఆ అరుణ్ పిలిపించండి అని మురళి చెప్తాడు. ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావ్. పిలవాలని నాకు కూడా తెలీదా.. కానీ మా అన్నయ్య వాళ్లు ఎక్కడికో వెళ్లి పోయారు. వాళ్లు లేకుండా పిలిస్తే ఎలా అని ఆలోచిస్తున్నా అని రుద్రాణి అంటుంది. ఆ అరుణ్ వచ్చి గొడవ పెడితే.. ఆ వేడి రిసార్ట్ అంతా పాకి.. ఎక్కడున్నా వాళ్లే వస్తారు అని చెప్తాడు మురళి.
సరే అని రాహుల్ ని అరుణ్ కి కాల్ చేయమని చెప్తుంది రుద్రాణి. దీంతో రాహుల్.. అరుణ్ కి కాల్ చేసి రమ్మంటాడు. వాళ్ల ప్లాన్ ప్రకారం.. సరే వస్తాను అని చెప్తాడు అరుణ్. ఇక కావ్యకి రాజ్.. పద్మావతికి విక్రమ్ లు మెహిందీ పెడుతూ.. తిడుతూ ఉంటారు. దీంతో బ్లాక్ మెయిల్ చేస్తారు కావ్య, పద్మావతిలు. ఆ తర్వాత అప్పూని పిలుస్తాడు కళ్యాణ్. దీంతో అనామిక, తన తల్లిదండ్రులు గుర్రుగా చూస్తూంటారు. కనకం చెబుతున్నా.. కళ్యాణ్ పట్టించుకోడు. దీంతో అప్పూ తప్పక వచ్చి మెహిందీ పెట్టించుకుంటుంది.
సరిగ్గా అప్పుడే అరుణ్ బయటకు వస్తాడు. అరుణ్ ని గమనించిన స్వప్న.. పద్మావతి, కావ్యలకు సైగ చేస్తుంది. దీంతో పద్దూ, స్వప్న, కావ్య కంగారు పడుతూ ఉంటారు. ఈ లోపు నీ మెహిందీ కంటే.. అప్పూదే బాగా కుదిరింది. మెహిందీ చాలా బాగా వచ్చిందని చెప్తాడు కళ్యాణ్. దీంతో అనామిక కోపంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది. గొడవ చేయడానికి వస్తున్న అరుణ్ ని.. ఓ తాగుబోతు అనుకోకుండా అడ్డుకుంటాడు. అరుణ్ ని చెంప మీద ఒక్కటి ఇస్తాడు. ఈలోపు పద్దూ, స్వప్న, కావ్య వెళ్లి ఆ అరుణ్ ని చుట్టుముడతారు. తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న అరుణ్ ని ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి నెత్తి మీద ఒక్కటి ఇస్తుంది కనకం. దీంతో అరుణ్ కింద పడి పోతాడు. వెంటనే వాడిని కిడ్నాప్ చేస్తారు.