ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాహుల్ ని కావ్య వరుసగా ప్రశ్నలు వేస్తుంది. కావ్య ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాహుల్ కంగారు పడతాడు. ఈలోపు రుద్రాణి కవర్ చేస్తుంది. రాహుల్ ఒక రేంజ్ లో యాక్టింగ్ చేస్తూ స్పృహ కోల్పోయినట్లు యాక్టింగ్ చేస్తాడు. దీంతో కావ్య తెగ కంగారు పడిపోతుంది. రాహుల్ సమాధానం చెప్పకపోతే ఎలా.. మా అక్క ఏమైపోయింది అంటూ గాబరా పడి పోతుంది. డాక్టర్ వాళ్లందరన్నీ బయటకు వెళ్లమని చెప్తాడు. వాళ్లు బయటకు వెళ్లగానే రాహుల్.. స్వప్న ఇక కనిపించదు అంటూ నవ్వుతాడు. ఈ సీన్ కట్ చేస్తే.. స్వప్నను పెళ్లి చేసుకునేందుకు పూల దండలు కొనడానికి బయటకు వస్తారు. ఈలోపు వాళ్లకు రాహుల్ కాల్ చేసి.. స్వప్నని చంపేశావా అని అడుగుతాడు. హా చంపేశా అన్నా అని చెప్తాడు. పూల దండలు కొనడానికి వచ్చాను అన్నా అని చెప్తాడు. పూల దండలు ఎందుకురా అని రాహుల్ అడగ్గా.. స్వప్నని చంపేశాం కదన్నా.. శవం మీద వేయడానికి అని కవర్ చేస్తాడు. సరే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారా? ఏం చేస్తున్నారు? అని రాహుల్ అడగ్గా.. స్వప్న శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో.. స్థలం కోసం వెతుకుతున్నాం అన్నా అని చెప్తాడు రౌడీ. సరే దాని శవాన్ని స్మశానంలో పాతి పెట్టేయండి.. ఎలాంటి డౌట్ రాదు అంటూ చెప్తాడు రాహుల్.. సరే అన్నా అని ఫోన్ పెట్టేస్తాడు రౌడీ.
స్వప్నని పెళ్లి చేసుకోవడానికి.. కనకాన్ని పూల దండలు సెలక్ట్ చేయమన్న రౌడీలు:
ఇక పూల దండలను సెలెక్ట్ చేయడానికి.. అక్కడే కూరగాయలు కొనడానికి వచ్చిన కనకాన్ని.. ఆంటీ అని పిలుస్తాడు రౌడీ. అది విన్న కనకం.. నేను నీకు ఆంటీనా.. అని ఫైర్ అవుతుంది. నేను నీకు ఆంటీని ఏంట్రా.. అంటూ తిడుతుంది. దీంతో రౌడీ అక్కా అని పిలుస్తాడు. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా.. మంచి పూల దండ సెలెక్ట్ చేసి పెట్టు అని అడుగుతాడు. నీకు పెళ్లి ఏంట్రా.. నీ పెళ్లికి నేను ఎందుకు దండ సెలక్ట్ చేయడం ఏంట్రా.. అని అంటుంది. చెయ్యి అక్కా ప్లీజ్ అని అడుగుతాడు రౌడీ. సరే అని సెలక్ట్ చేస్తుంది కనకం. ఈలోపు పంతులు నుంచి ఫోన్ వస్తుంది. పలానా చోటు వెయిట్ చేయమని చెప్తాడు. దండలు సెలక్ట్ చేస్తుంది కనకం.
స్వప్న ఫొటో చూసి షాక్ అయిన కనకం.. అలానే ఉండిపోయింది:
ఆ తర్వాత మరో రౌడీ.. డబ్బులు ఇస్తాడు. దండల బరువు చూసి.. అన్నా పెళ్లి కూతురు కడుపుతో ఉంది కదా.. ఈ దండల బరువు మోస్తుందా అని అడుగుతాడు. ఇది విన్న కనకం.. ఏంటి కడుపుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతుంది. అవును అని చెప్తాడు రౌడీ. నీ ముఖానికి కడుపుతో ఉన్న అమ్మాయి కాకపోతే ఇంకెవరు వస్తారు అని అంటుంది. కానీ రౌడీ మాత్రం నువ్వు నా ఏంజెల్ ని చూస్తే షాక్ అవుతావు అని అంటాడు. అది ఎవరైతే నాకెందుకులే అని అంటుంది కనకం. లేదు నువ్వు చూడాల్సిందే అని స్వప్న ఫొటో చూపిస్తాడు. అది చూసిన కనకం షాక్ అవుతుంది.
ఆస్పత్రికి పోలీసులు.. కంగారులో రుద్రాణి:
ఈలోపు పోలీసులు.. ఆస్పత్రికి వస్తారు. రాజ్ ఏమైనా చెప్పాడా అని అడుగుతారు. ఏమీ గుర్తులేదన్నాడు అని చెబుతారు రాజ్ వాళ్లు. అవునా అయితే ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు అని చెప్తారు పోలీసులు. మొన్న వినాయక విగ్రహాల దొంగతనాలు, ఇప్పుడు రాహుల్ మీద ఎటాక్.. ఇదంతా మీ మీద పగ పెంచుకుని ఎవరో కావాలనే చేస్తున్నారు అని పోలీసులు అంటారు. మా మీద ఎవరికీ పగ లేదు అని చెప్తాడు రాజ్. ఈలోపు రుద్రాణి ఇప్పుడు విగ్రహాల గురించి ఎందుకు? ఇదంతా మళ్లీ రాహుల్ మెడకు చుట్టుకునేలా ఉందని కంగారు పడుతూ.. ఏంటండి.. నా కోడలు కనిపించకపోతే ఇప్పుడు విగ్రహాలు అదీ ఇదీ అంటున్నారు. ముందు స్వప్న ఎక్కడ ఉందో వెతకండి అని అంటుంది. సరే మీరేం కంగారు పడకండి.. వెతుకుతాం అని పోలీసులు చెప్పి వెళ్లిపోతారు.
కావ్యని ఓదార్చిన రాజ్.. పంతులి గెటప్ లో రెడీ అయిన కనకం:
స్వప్న గురించి బాధ పడుతుంది కావ్య. రాజ్ ఓదార్చుతూ ఉంటాడు. ఏడా ఇంతలో కనకం షాక్ లో నుంచి తేరుకుని వెంటనే కావ్యకి కాల్ చేస్తుంది. స్వప్న వాళ్లు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అని అడుగుతంది. కానీ కావ్య సమాధానం చెప్పలేక.. ఏడుస్తుంది. వెంటనే రాజ్ ఫోన్ తీసుకుని.. నేను చెప్పేది కూల్ గా వినండి అంటాడు. ఏమైంది బాబు.. కావ్య ఎందుకు ఏడుస్తుంది. స్వప్నని ఎవరో కిడ్నాప్ చేశారు. అని చెప్తాడు. దీంతో కనకం షాక్ అవుతుంది. వెంటనే కాల్ కట్ చేస్తుంది. అంటే ఇందాక వాడు చెప్పేది నిజమే అన్నమాట. ఇప్పుడేం చేయాలి.. అంటూ కంగారు పడుతుంది కనకం. అయితే పూల దండలు కొనేటప్పుడు పంతులికి చెప్పిన అడ్రస్ గుర్తుకు తెచ్చుకుంటుంది కనకం. వెంటనే పంతులి గెటప్ లో రౌడీలు చెప్పిన అడ్రస్ కి వచ్చేస్తుంది. అంతే ఈరోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.