ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అదిరిపోయే సీన్ కనిపించింది. కావ్య అంటే ఎప్పుడూ మండిపడే అపర్ణలో మానవత్వం వెల్లి విరిసింది. సీతారామయ్య అనారోగ్యం కారణంగా.. కావ్యపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న రాజ్ ని హెచ్చరించింది అపర్ణ. చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఎలాంటి ట్విస్టులు, షాక్ లు ఉన్నాయో. కృష్ణాష్టమి సందర్భంగా కావ్య.. పూజ చేస్తూ ఉంటుంది. దీంతో ఇందిరా దేవి కావ్యలోని మంచి లక్షణాలను పొగుడుతూ ఉంటుంది. ఈ లోపు రుద్రాణి వచ్చి అంటే.. అపర్ణ వదినలో ఇలాంటి లక్షణాలు లేవా? అమ్మా అంటూ పుల్ల పెడుతుంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు.. రుద్రాణికి గడ్డి పెడుతూ ఉంటారు. అయినా పట్టించుకోదు రుద్రాణి. ఇంతలో రాజ్ ఓ హారం పట్టుకుని వస్తాడు. ఏంటది? అని ఇందిరా దేవి అడుగుతుంది.
ఇది మన కంపెనీకి మిడిల్ క్లాస్ వాళ్లకు తక్కువ బడ్జెట్ లో అందుబాటులో ఉండే డిజైన్స్ గీసి ఇచ్చింది నాన్నమ్మ. అందుకే ఫస్ట్ జ్యువెలరీ తనకే గిఫ్ట్ గా ఇస్తున్నాను అని అంటాడు రాజ్. దీంతో కావ్య షాక్ అయి చూస్తుంది. ఇంట్లోని వారంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. శభాష్ రాజ్.. మంచి పని చేశావ్ అంటూ సుభాష్ అంటాడు. ఇక ఇందిరా దేవి, సీతారామయ్య నువ్వే నీ చేతితో కావ్య మెడలో వేయి అని అంటారు. దీంతో కావ్య ఎంతో ఆనంద పడుతుంది. మరోవైపు ఇదంతా చూస్తున్న అపర్ణ, రుద్రాణిలు ఆవేశంతో రగిలిపోతూంటారు.
ఆ తర్వాత సీతారామయ్య మాట్లాడుతూ.. సరే నాకు ఇంకో కోరిక ఉంది తీరుస్తావా అంటూ అడుగుతాడు.. ఏంటి? నాన్న అని సుభాష్, చెప్పండి తాతయ్య అంటూ రాజ్ అడుగుతారు. కావ్య మరో మూడు నెలల్లో తల్లి కాబోతుందనే విశేషం వినాలి అని చెప్తాడు. సీతారామయ్య అలా అనగానే.. ఇంట్లోని అందరూ మరోసారి షాక్ కి గురవుతారు. చెప్పు రాజ్ అంటూ ఇందిరా దేవి అడగ్గా.. ఏమీ చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు రాజ్. సరే అంటూ ఓ వెలికి నవ్వు నవ్వుతాడు. ఇక కావ్య ఏమో సిగ్గు పడుతూ కిచెన్ లో కి వెళ్లి పోతుంది. అక్కడ తనకు పెళ్లి అయిన దగ్గర్నుంచీ జరిగినవి అన్నీ తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది.
కావ్య కన్నీరు:
దీంతో ధాన్య లక్ష్మి, ఇందిరా దేవి ఏమైంది అమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ అడుగుతారు. వీళ్ల మాటలు వింటూ మెట్ల దగ్గర అపర్ణ, రాజ్ లు నిలబడి వింటూ ఉంటారు. ఏమైంది కావ్యా.. ఎందుకు ఏడుస్తున్నావ్.. అని అడగ్గా.. ఈ ఇంటి కోడలిగా నాకు గుర్తింపు వచ్చింది అమ్మమ్మా.. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను.. ఇక భార్యగా ఎలా స్వీకరిస్తాను అంటూ ఆయన వెళ్లిపోయారు. దీంతో ఈ మనిషితోనా జీవితాంతం ఉండాలి.. అనుకున్నా. ఈ బ్రహ్మబుడి ఎందుకు వేశావ్ భగవంతుడా? అని చాలా సార్లు బాధ పడ్డా.. కానీ ఈరోజు నాకు నమ్మకం వచ్చింది.. నేనూ ఈ ఇంటి కోడలినే అని అంటుంది కావ్య.
రుద్రాణి ఎగతాళి:
రుద్రాణి మాట్లాడుతూ.. ఇచ్చింది చిన్న హారం.. దీనికి ఇంతగా ఫీల్ అవ్వాలా అని ఎగతాళి చేస్తుంది. మీరు చూస్తోంది పెద్దదా.. చిన్నదా అని.. కానీ నేను ఆయన తీసుకున్న బాధ్యత గురించి చెబుతున్నా అంటుంది కావ్య. అంటే ఇప్పటివరకూ రాజ్ నీతో ప్రేమగా లేడా అని అడుగుతుంది రుద్రాణి. మీ మేనల్లుడి గురించి మీకు తెలీదు. ఆయన శత్రువుని అయినా సహాయం అడిగితే చేస్తారు.. కానీ కరుణ, ప్రేమ వేరు అని జవాబు ఇస్తుంది కావ్య. పిచ్చి పిల్లా.. ఇవన్నీ పక్కకు పెట్టి.. తాతయ్య గారు చెప్పినట్టుగా మాకు ఓ చిన్ని కృష్ణుడు కావాలి.. దాని గురించి ఆలోచించండి అని అంటుంది ఇందిరా దేవి.
రాజ్ కు అపర్ణ లెక్చర్:
ఇదంతా విన్న అపర్ణ దేవి.. రాజ్ ‘నాతో రా’ అంటూ పిలుచుకుని గదిలోకి తీసుకు వెళ్తుంది. ఏంటి? మమ్మీ ఇలా తీసుకొచ్చావ్? తాతయ్య వాళ్లు చూస్తే ఏం అనుకుంటారు? వాళ్లు ఏం అనుకుంటారో అది నాకు ముఖ్యం కాదు.. నువ్వే ఏం అనుకుంటున్నావ్ అనేది నాకు ఇంపార్టెంట్ అని అంటుంది అపర్ణ. దేని గురించి మమ్మీ? అని రాజ్ అడగ్గా.. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా?, అందర్నీ మోసం చేసినట్టు నన్ను మోసం చేయాలి అనుకుంటున్నావా రాజ్? అని అపర్ణ అడుగుతుంది. దీనికి బిత్తరపోయి చూస్తాడు రాజ్. నేను చెప్పలేను మమ్మీ.. నిన్ను కాదని నేనే ఏ పని చేయను.. అంటాంది ఇది ఎందుకు చేస్తున్నానో అర్థం చేసుకో.. కానీ ఒక్కటి మాత్రం నిజం ఆ కళావతిని నేను ఎప్పటికీ అంగీకరించలేను అని చెప్తాడు. అదంతా నేను చూసుకుంటాలే మామ్.
నువ్వే ఏదైనా చెప్ప రాజ్.. కానీ ఇలా అనవసరంగా ఒక ఆడి పిల్ల మనసు బాధపెట్టకు. తనకు రేపు నిజం తెలిస్తే.. ఏం సమాధానం చెప్తావ్.. తను నీ మీద ఆశలు పెంచుకుంటుంది అని చెప్తుంది అపర్ణ. మమ్మీ ప్లీజ్.. నన్ను అర్థం చేసుకో.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజ్. వీడు ఏదో పెద్ద తప్పు చేస్తున్నాడు.. ఇది ఎక్కడికి వెళ్తుందో అని భయం ఉంది? అంటూ అపర్ణ మనసులో ఆలోచిస్తూ ఉంటుంది.