Brahmamudi, October 12th episode: ఇంటికి వచ్చిన కావ్య.. రణరంగంగా మారిన దుగ్గిరాల ఇల్లు.. రుద్రాణి టార్గెట్ పెట్టిందిగా!

|

Oct 12, 2023 | 11:18 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యను ఇంటికి తీసుకెళ్లమని చెప్తాడు పెద్దాయన. అవును అసలు ఈ కళావతి ఇక్కడుందని మీకెవరు చెప్పారు? అని రాజ్.. సీతా రామయ్య, ఇందిరా దేవిలను అడుగుతాడు. మేము ఇక్కడున్నామని నీకెవరు చెప్పార్రా.. అని పెద్దాయన రాజ్ ని ప్రశ్నిస్తాడు. ఇంట్లో ఒక్కడినే ఉండే సరికి ఎక్కడికి పోయిందో ఏంటో అని భయం వేసి ఇంట్లో ఉండలేక వెతుక్కుంటూ వచ్చాను. బయట మీరు కారు కనిపించింది. ఇక్కడే ఉంటారు కదా అని నేను లోపలికి వచ్చాను. అవును ఇంతకీ మీరిక్కడికి ఎలా వచ్చారు? అని రాజ్ అడుగుతాడు. పూజారి గారు ఫోన్ చేసి చెప్పారులే అని పెద్దాయన బదులిస్తాడు. ఇంకా..

Brahmamudi, October 12th episode: ఇంటికి వచ్చిన కావ్య.. రణరంగంగా మారిన దుగ్గిరాల ఇల్లు.. రుద్రాణి టార్గెట్ పెట్టిందిగా!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యను ఇంటికి తీసుకెళ్లమని చెప్తాడు పెద్దాయన. అవును అసలు ఈ కళావతి ఇక్కడుందని మీకెవరు చెప్పారు? అని రాజ్.. సీతా రామయ్య, ఇందిరా దేవిలను అడుగుతాడు. మేము ఇక్కడున్నామని నీకెవరు చెప్పార్రా.. అని పెద్దాయన రాజ్ ని ప్రశ్నిస్తాడు. ఇంట్లో ఒక్కడినే ఉండే సరికి ఎక్కడికి పోయిందో ఏంటో అని భయం వేసి ఇంట్లో ఉండలేక వెతుక్కుంటూ వచ్చాను. బయట మీరు కారు కనిపించింది. ఇక్కడే ఉంటారు కదా అని నేను లోపలికి వచ్చాను. అవును ఇంతకీ మీరిక్కడికి ఎలా వచ్చారు? అని రాజ్ అడుగుతాడు. పూజారి గారు ఫోన్ చేసి చెప్పారులే అని పెద్దాయన బదులిస్తాడు. ఇంకా నిలబడ్డావేంటి? ఏదో పెద్ద ఘణకార్యం చేసినట్టు అని రాజ్ కోపంగా అరుస్తాడు. అలా కోపంగా అంటే నేను రాను అని కావ్య చెప్తుంది. రానంటావేంటే.. ప్రసాదం తింటూ ఇక్కడే కూర్చుంటావా.. పదా అని చేయి పట్టుకుని తీసుకెళ్తాడు రాజ్. ఇదంతా నటనే అంటావా బావా అని పెద్దావిడ.. పెద్దాయన్ని అడుగుతుంది. కాదు చిట్టీ.. వాడి మనసులో ప్రేమ ఉంది. కానీ నువ్వు చెప్పినట్టు ఆ ప్రేమని ఏదో మాయ కప్పేసింది. చూద్దాం అది కూడా బయటకు తీద్దాం రా అని పెద్దాయన బదిలిస్తాడు.

ఊళ్లో ఉన్న బావులు, చెరువులు, రైలు పట్టాలు వెతుకుదాం రావయ్యా అన్న కనకం:

ఇక ఈ లోగా కనకం.. వెళ్దాం రావయ్యా అని అనగా.. ఎక్కడికే అని కృష్ణ మూర్తి అంటాడు. ఊళ్లో ఉన్న బావులు, చెరువులు, రైలు పట్టాలు వెతకడానికి అని కనకం అంటుంది. ఈలోపు కనకం అంటూ అరుస్తూ.. నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్ అని అపర్ణ గట్టిగా అరుస్తుంది. ఇంకెలా మాట్లాడమంటారు.. మీ అంతస్తు వేరు.. మా అంతస్తు వేరు మీతో గట్టిగా మాట్లాడే స్థాయి కూడా లేదు మాకు.. అందుకే మా అంతస్తుకు దగ్గ ఆలోచనలే వస్తున్నాయని కనకం అంటుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే నీ కూతురు ఆత్మహత్య చేసుకుందనా? లేక ఈ ఇంట్లో వాళ్లే హత్య చేసి శవాన్ని మాయం చేశారనా? అని రుద్రాణి అడుగుతుంది.

ఇవి కూడా చదవండి

నువ్వు మళ్లీ మాకు కనిపిస్తావని అనుకోలేదమ్మా: కనకం

నేను అవన్నీ మాట్లాడటం లేదని కనకం అంటుంది. నీ మాటకు అర్థం అదే కదా అని అపర్ణ అనగా.. అమ్మా.. మీకో దండం పడుతుంది. మీరు ఒడ్డున ఉన్నారు. మేము పూర్తిగా మునిగిపోయి ఉన్నాం. నా కూతురు కనిపించకపోతే.. కన్న తల్లిగా నేను అనుమానించాలి కానీ.. అని కనకం అంటుంటే.. ఈ లోపు అమ్మా అని కావ్య గట్టిగా అరుస్తుంది. కావ్యను చూసిన కనకం గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. కావ్యను చూసిన ఇంట్లోని వారందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. నువ్వు మళ్లీ మాకు కనిపిస్తావని అనుకోలేదమ్మా అని కనకం, అమ్మా నువ్వు క్షేమంగానే ఉన్నావా అని కృష్ణ మూర్తి, ఎక్కడికి వెళ్లావే అని స్వప్న అడుగుతారు.

మీ సంస్కారాన్ని మర్చిపోయారా.. నా అత్తింటిని నిందిస్తారా:  కావ్య

మీ అందరి ప్రశ్నలకు జవాబు నా దగ్గర ఉంది.. తప్పకుండా నేను చెప్తాను. కానీ నేను ఇక్కడికి వచ్చేసారికి ఇక్కడ జరుగుతుంది ఏంటమ్మా.. అని కావ్య అడుగుతుంది. ఏముంది.. మీ అమ్మా నాన్న ఈ పాటిని నువ్వు పరలోకానికి ప్రయాణం చేసి ఉంటావన్న అన్న నిర్ణయానికి వచ్చారు. మమ్మల్ని అందర్నీ హంతకుల ముఠాలాగా పరిగణించారు. బావిలో తోసామో.. చెరువులో దాచామో.. అని తేల్చుకోవడానికి పెద్ద పంచాయితీ పెట్టారు. మీ ఆయన్ని అయితే ఏం చేశావ్ నా కూతుర్ని అని అడిగారు. మీ కుటుంబం ఈ స్థాయికి దిగజారి మాట్లాడి మమ్మల్ని అందర్నీ కడిగిపారేశారని రుద్రాణి చెప్తుంది. ఏంటమ్మా నా కుటుంబాన్నే అనుమానించారా.. నా వాళ్లు నన్ను చంపి పారేశారని అనుమానించారా.. మీ అర్థం లేని అపోహలతో వాళ్లని అవమానించారా.. సంస్కారాన్నే మీరు మర్చిపోయారని కావ్య రివర్స్ అవుతుంది. ఈలోపు కనకం.. అవునే నువ్వు అసలు ఏం అయిపోయావ్ అని అడుగుతుంది. నేనేమీ అయిపోలేదమ్మా.. మీ వల్ల ఇప్పుడు నేను కూడా దోషిని అయ్యాను. ఎందుకు మీరిద్దరూ అలా మాట్లాడారు? అని కావ్య నిలదీస్తుంది.

వాళ్లు కూడా మమ్మల్ని అనే స్థాయికి వెళ్లారంటే.. దానికి కారణం నువ్వే కదా: రుద్రాణి

అప్పుడు రుద్రాణి చప్పట్లు కొడుతూ.. వావ్ నైస్.. వెరీ నైస్.. బావుంది నీ నాటకం.. వాళ్లు కూడా మమ్మల్ని అనే స్థాయికి వెళ్లారంటే.. దానికి కారణం ఎవరు నువ్వు కాదా?, మా వదినని టార్గెట్ చేశారు.. మీ వాళ్లు వచ్చి.. అత్తింటిని పీకి పందిరి వేశారని రుద్రాణి అంటుంది. జరిగిందంతా వదిలేయ్.. అసలు నువ్వు ఎక్కడికి వెళ్లావ్? ఎందుకు వెళ్లావ్? ఇంట్లో ఎవరితో ఏం గొడవ జరిగిందని వెళ్లావ్?, నీ తల్లిదండ్రుల ముందే నిజం చెప్పు.. నేను కన్ను ఎర్ర చేస్తే నా ముందు నిలబడటానికి కూడా వణికిపోయే నీ కన్న తల్లిదండ్రులు నాకుటుంబాన్ని అనుమానించి.. అవమానించి.. హంతకులుగా మార్చేదాకా వెళ్లారంటే దానికి కారణం ఎవరు? సమాధానం చెప్పాల్సింది ఎవరు? మాట్లాడు అని అపర్ణ అడుగుతుంది.

కావ్య తప్పు లేదు.. మొక్కు తీర్చుకోవడానికి వెళ్లింది: సీతా రామయ్య

సమాధానం నేను చెప్తాను అని పెద్దాయన అంటాడు. ఇందులో కావ్య తప్పేమీ లేదు. తన కాపురం కుదుట పడితే గుళ్లో ఒక రాత్రి నిద్ర చేస్తానని మొక్కుకుందట. ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్లింది. ఉదయం గుళ్లో నిద్ర పోతున్న కావ్యను చూసి పూజారి గారు మాకు ఫోన్ చేశారు. మేము వెళ్లి కావ్యను తీసుకొచ్చామని సీతా రామయ్య అంటాడు. మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిందా.. అదీ రాత్రి పూట… అదీ భర్తకి ఇంత మందికి చెప్పకుండా ఒంటరిగా వెళ్లిందా.. మీరు నమ్ముతున్నారా అత్తయ్యా.. అని అపర్ణ అంటుంది. పోనీ ఇంకేదైనా కారణం ఉంటుందోమో నువ్వే చెప్పు. వెళ్లింది గుడికి.. మాట్లాడింది దేవుడి సన్నిధిలో ఇంకా మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం. నా మనవరాలు ఏ తప్పూ చేయలేదు. ఏ పొరపాటు చేయలేదు. మనకు తెలీక కంగారు పడ్డాం అంతే అని ఇందిరా దేవి కన్విన్స్ చేస్తుంది.

నన్ను క్షమించండి.. అందరికీ దణ్ణం పెట్టిన కావ్య:

అది కాదమ్మా.. మొక్కు ఉందని మనతో చెప్తే ఎవరో ఒకరం తోడు వెళ్లేవాళ్లం కదా అని సుభాష్ అంటే.. మొక్కు తనదైతే ఇంకొకర్ని ఎందుకు కష్ట పెట్టడం అని ఆలోచించిందిరా.. అని పెద్దావిడ చెప్తుంది. రాజ్ నువ్వు కూడా ఈ చర్యని సమర్థిస్తున్నావా అని రాజ్ ని అపర్ణ అడగ్గా.. మమ్మీ ఒకరి అభిప్రాయాలను, నమ్మకాలను ఎత్తి చూసేంతగా నేను ఎదగలేదు మమ్మీ.. నేను సమర్థించలేదు.. అలాగని తప్పు పట్టలేదని రాజ్ అంటాడు. ఇక కావ్య అందరికీ దణ్ణం పెట్టి క్షమించండి.. నేను మొక్కు పేరుతో ఎవరికీ చెప్పకుండా వెళ్లడం పొరపాటే. ఈ మొక్కు గోప్యంగా ఉంచాలని పంతులు గారు చెప్తేనే నేను దాచి పెట్టాను. కానీ ఇలా అందరూ కంగారు పడతారని.. మాటలు పడతారని నేను ఊహించలేదు. చంద్రుడు కనిపించగానే నేను బయలు దేరానని కావ్య చెప్తుంది.

కావ్యపై ఫైర్ అయినా అపర్ణ.. నువ్వు ఎక్కడికి వెళ్లావ్ చెప్పు:

నమ్మమంటావా.. అని రుద్రాణి అడగ్గా.. మీరింకా మీ మనవరాలిని సమర్థిస్తున్నారా అత్తయ్యా నిజంగానే నమ్మశక్యంగా లేదు మాకు అని అపర్ణ అంటుంది. మీరు కంగారు పడకపోతే.. వాళ్లు ఏడవకపోతే.. కావ్యపై ప్రేమ లేనట్లేగా.. అమ్మానాన్నలు అలాగే స్పందిస్తారు. అందులో వాళ్ల తప్పులేదు. ఒకప్పుడు రాజ్ వాళ్ల అత్తగారింట్లో కాలు జారి పడిపోతే.. నువ్వు వెళ్లి ఎంత రాద్దాంతం చేశావ్? తల్లి మనసు కాబట్టి.. అదే మాతృత్వం ఆ తల్లిదండ్రుల్లో ఉండటం తప్పు లేదని పెద్దావిడ చెప్తుంది.

ఇంకా ఎవరైనా అడాల్సింది ఉంటే అడగండి: సీతా రామయ్య

ఇక కృష్ణ మూర్తి, కనకం ఇద్దరూ కలిసి దుగ్గిరాల ఫ్యామిలీకి క్షమాపణలు చెప్తారు. కావ్య కనిపించపోయే సరికి అలా మాట్లాడం అని అంటారు. కావ్య కూడా అందరికీ క్షమాపణలు చెప్తుంది. ఇంకా ఎవరైనా ఏమన్నా అడగాల్సింది ఉంటే అడగండి. చంద్రుడిని చూడటం వల్లే ఇలాంటి నీలాపనిందలు వచ్చాయని అని సీతా రామయ్య అడుగుతాడు. అక్కడి నుంచి కనకం, కృష్ణ మూర్తి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్తారు. కానీ రుద్రాణి మాత్రం.. కావ్య చెప్పింది అంత నమ్మాలని అనిపించడం లేదు. అందరి చెవుల్లోనూ పువ్వులు పెట్టింది. ఏదో కారణం ఉంది.. ముసలోళ్లతో పాటు రాజ్ కూడా దాచి పెడుతున్నాడు. అదేంటో తెలుసుకోవాలి అని రుద్రాణి అంటుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.