Bigg Boss 7 Telugu: ప్రశాంత్ కెప్టెన్సీ లాక్కున్న బిగ్ బాస్..! చేసేదేంలేక ఏడ్చిన శివాజీ.. అమ్మాయితో పెట్టుకున్న అమర్..
బిగ్ బాస్ సాంగ్ రాక ముందే, పొద్దు పొద్దుగాల.. మరో తరహా పులిహోరను.. అశ్వినితో కలుపుతుంటాడు భోళె. ఇప్పటి వరకు హౌస్‌లో పులిహోర రాజాలుగా పేరుతెచ్చుకున్న ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌కు మించి కళాత్మకంగా.. కవితలు చెబుతూ.. సోషల్ మీడియా బ్యూటీ అశ్వినీని బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తుంటాడు. నువ్వు హీరోయిన్..నేను హీరో అంటూ.. సినిమాటిక్ పులిహోర కలుపుతుంటాడు. కానీ ఆ తరువాత సీన్లో.. తాను ప్రశాంత్ తో కలిసి ఏడవాల్సి వస్తుందని ఊహించలేకపోతాడు.
నిన్నటి అంటే… ఎపిసోడ్ 38లో ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ల మధ్య జరిగిన రసవత్తర పోరు.. ఇవ్వాళ అంటే.. ఎపిసోడ్ 39లోనూ కంటిన్యూ అయింది. కెప్టెన్సీ కంటెండర్ కోసం బిగ్ బాస్ ఇరు గ్రూపుల మధ్య పెట్టిన ఈ టాస్క్‌లో.. ఇవ్వాళ మరో రెండు గేమ్‌లు జరిగాయి. ఈ టాస్కులు కూడా.. చాలా ఇంట్రెస్టింగ్‌గా.. ఈగర్‌గా సాగుతూ.. మరో సారి బిగ్ బాస్ ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి.
ఇక అంతకు ముందు జీనియస్ టాస్క్‌లో .. చిన్న చిన్న పశ్నలకు కూడా అమర్ ఆన్సర్ ఇవ్వకపోవడం.. ఆ టాస్కులోనే అందరూ తనను చూసి నవ్వడంతో.. ఈ ఎపిసోడ్‌లో బాధపడతాడు అమర్. తన బాధను అటు శివాజీకి, ఇటు ప్రియాంకకు చెపుకుంటూ ఉంటాడు. రాత్రి పడుకోకుండా ఏడుస్తుంటాడు. అయితే అమర్‌కు ప్రియాంక, శోభ, సందీప్ మాత్రమే కాదు.. ప్రిన్స్ యావర్ కూడా ధైర్యం చెబుతుంటారు. గేమ్ ఇంకా ఉందని.. నువ్వు స్ట్రాంగ్ అని. బాధపడుతున్న తనలో కాన్ఫిడెంట్ నింపే ప్రయత్నం చేస్తుంటారు.
అమర్ కథ ఇలా సాగుతుంటే.. ఇక ఇంకో పక్క.. బిగ్ బాస్ సాంగ్ రాక ముందే, పొద్దు పొద్దుగాల.. మరో తరహా పులిహోరను.. అశ్వినితో కలుపుతుంటాడు భోలే. ఇప్పటి వరకు హౌస్‌లో పులిహోర రాజాలుగా పేరుతెచ్చుకున్న ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌కు మించి కళాత్మకంగా.. కవితలు చెబుతూ.. హాట్ బ్యూటీ అశ్వినీని బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తుంటాడు. నువ్వు హీరోయిన్..నేను హీరో అంటూ.. సినిమాటిక్ పులిహోర కలుపుతుంటాడు.
భోలే పులిహోర మిక్సింగ్ తరువాత.. ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ సాంగ్‌తో నిద్రలేచిన హౌస్‌లోని ఆటగాళ్లు పోటుగాళ్లు.. తమ స్టైల్లో చాలా హుషారుగా డ్యాన్స్ చేస్తారు. ఆ తరువాత రెడీ అయిపోయి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ బిగ్ బాస్ .. టాస్క్ కాకుండా.. సీక్రెట్ రూమ్ నుంచి బయటికి వచ్చిన గౌతమ్‌కు స్పెషల్ పవర్ ఇస్తాడు. బిగ్ బాస్‌లో సెకండ్ కెప్టెన్ గా ట్రీట్ చేసే రేషన్ మేనేజర్‌గా తనను ఎంపిక చేస్తాడు. కిచెన్ బాధ్యతతో పాటు.. హౌస్‌లో ఎవరు ఏ పని చేయాలో.. ఆటగాళ్లకు తనే అసైన్ చేయాలని చెబుతాడు. చాలా డిస్కషన్ తర్వాత.. కన్ఫూజన్స్ తర్వాత.. తన కిచ్చిన వర్క్ నచ్చలేదని.. శోభ సీన్ చేసిన తర్వాత.. ఎవరి పనుల్లో వారు సెట్ అవుతారు.
ఇక గౌతమ్ పనులను అసైన్ చేసిన తర్వాత.. సభ్యులందరూ తిన్నాక.. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు సీన్లోకి వచ్చిన బిగ్ బాస్.. ఈ సారి ప్రశాంత్ పై విరుచుపడతాడు. కెప్టెన్ షిప్ అంటే ఏంటో.. డ్యూటీస్ ఏంటో చెప్పాలని ఒక్కో కంటెస్టెంట్‌ను అడగుతాడు. ప్రశాంత్‌ను కూడా ఇదే ప్రశ్న అడగడంతో.. తన మాట ఎవరూ వింటలేరని.. తనను తక్కువ చేసి చూస్తున్నారని అందుకే కెప్టెన్‌గా పర్ఫెక్ట్ గా ఉండలేక పోతున్నట్టు చెబుతాడు. దీంతో మరోసారి సీరియస్ అయిన బిగ్ బాస్ .. కెప్టెన్ అంటే బిగ్ బాస్ తల అని.. మీరు మీ బాధ్యతల్లో విఫలయం అయ్యారని చెబుతాడు. మంచి కెప్పెన్సీకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏ ఒక్కటికి.. ప్రశాంత్‌కు లేకపోవడంతో.. వెంటనే కెప్టెన్ బ్యాడ్జ్‌ను తిరిగి తీసుకుంటున్నట్టు.. చెబుతాడు. కెప్టెన్ బ్యాడ్జ్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టాలని ఆదేశిస్తాడు.
బిగ్ బాస్ ఆదేశంతో.. తీసుకున్న నిర్ణయంతో.. ఓ పక్క ప్రశాంత్ బోరున ఏడుస్తుంటే.. మరో పక్క భోలే కూడా ప్రశాంత్ స్థితిని.. ప్రశాంత్ కోసం శివాజీ చేసిన సాక్రిఫైజ్‌ను గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు. ఇంకో పక్క ప్రశాంత్ పదవి పోవడంపై శివాజీ కూడా.. కాస్త ఎమోషనల్‌గానే రియాక్టవుతాడు. ఏడ్చినంత పని చేస్తాడు.
ఇక సాయంత్రం ఐదు గంటలకు మరో టాస్క్‌తో కంటెస్టెంట్స్ ముందుకు వచ్చిన బిగ్ బాస్.. ఆటగాళ్లు.. పోటుగాళ్ల మధ్యలో ఎవరు ఫాస్టెస్టో తెలుసుకునేందుకు ఓ టాస్క్ ఉంటుందంటూ అనౌన్స్ చేస్తాడు. ఆట పేరు ‘కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్’ అంటూ చెబుతాడు. ఇక ఈ ఆటలో భాగంగా.. బిగ్ బాస్ చెప్పిన కలర్‌ను సంబంధించిన హౌస్‌లోని ఏ వస్తువునైనా తెచ్చి లాన్‌లో మార్క్ చేసిన బాక్సులో పెట్టాలని చెబుతాడు. చాలా ఫన్నీగా.. చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగిన ఈ గేమ్‌లో ఆటగాళ్లే విన్నర్‌గా నిలుస్తారు. అయితే ఒక్క అమర్ మాత్రం ఈ సారి కూడా గేమ్‌ను అర్థం చేసుకోకుండా.. పోటుగాళ్ల ప్లేయర్ అశ్విని చేతిలో ఉన్న వస్తువును లాక్కుని గలాటా చేసే ప్రయత్నం చేశాడు. దీంతో బిగ్ బాస్ నుంచి మరో వార్నింగ్ వచ్చేలా చేసుకున్నాడు.
ఇరు టీముల్లో.. కలర్ గేమ్‌తో.. ఎవరు ఫాస్టెస్టో తేల్చిన బిగ్ బాస్.. నెక్ట్స్ ఇరు టీముల మధ్య స్ట్రాంగెస్ట్ టాస్క్ పెడతాడు. ఈ టాస్క్‌లో భాగంగా.. లాన్‌లో ఉన్న రెండు రాకెట్లను రెండు చేతులతో పట్టుకోవాలని ఎవరు ఎక్కువ సేపు పట్టుకుంటారో వాళ్లే విజేతలంటూ చెబుతాడు. అయితే ఈ గేమ్ ఆడే క్రమంలోనే .. ఒక రాకెట్ వదిలిపెట్టినా.. మరో రాకెట్ కింద పడేంత వరకు గేమ్ కొనసాగించాలని చెబుతాడు.
ఇక గేమ్ కోసం పోటుగాళ్ల నుంచి అర్జున్ రంగంలోకి దిగగా.. ఆటగాళ్ల నుంచి అమర్ తాను ఆడతా అంటూ.. మారం చేసి టైం వృధా చేస్తాడు. ఇంటి సభ్యులు ఎంత చెప్పినా వినకుండా తనే ఈగేమ్ ఆడతానంటూ.. మారం చేస్తాడు. కానీ ఆటగాళ్లలోని అందరూ.. ప్రిన్స్ యావర్‌ను యునానిమస్‌గా సెలక్ట్ చేసి అర్జున్‌కు ఆపోనెంట్‌గా పంపిస్తారు. ఇక ఇరువురు రెండు చేతులతో.. వారి వారి రాకెట్లను తాడుతో పట్టుకుని చేతులతో హోల్డ్ చేస్తారు. అయితే ప్రిన్స్ యావర్ కంటే.. ముందే అర్జున్ తన ఎడమ చేతిలో ఉన్న రాకెట్ తాడును వదలడంతో.. గేమ్ వన్ సైడ్ అయినట్టు అందరికీ అనిపిస్తుంది. ప్రిన్స్ యావర్ గెలుస్తాడనే నమ్మకం.. అందరికీ కలుగుతుంది.
కానీ కట్ చేస్తే.. ప్రిన్స్ యావర్ కూడా.. రాకెట్ బరువును తట్టుకోలేక.. తన రైట్ హ్యాండ్లో ఉన్న రాకెట్ తాడను జారవిడుస్తాడు. దీంతో ఎడమ చేతితో హోల్డ్ చేసిన రాకెట్ ను ఎక్కువ సేపు పట్టుకోలేడని.. తాను రైట్ హ్యాండ్‌తో ఇంకాస్త ఎక్కువ సేను తన రాకెట్ ను హోల్డ్ చేయగలనని నమ్మిన అర్జున్.. గేమ్ కంటిన్యూ చేస్తాడు. చివరికి అర్జున్ ప్రిడిక్షన్ నిజం అవడంతో.. ఎడమ చేతిలో ఉన్న రాకెట్ తాడును ప్రిన్స్ జారవిడుస్తాడు. దీంతో.. అర్జున్ ఈ స్ట్రెంత్ గేమ్‌లో విన్నర్‌గా గెలుస్తాడు. అంటే పోటుగాళ్లు మరో సారి ఆటగాళ్ల మీద గెలిచారన్న మాట..!
– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..