
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడనే ఆరోపణలపై ప్రముఖ టీవీ నటుడు ఆశిష్ కపూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ప్రకారం ఆశిష్ తన ఇంట్లో నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. బాత్రూమ్ లో బాధితురాలిపై ఆత్యాచారం చేశాడని అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆశిష్ ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇతర వివరాల్లోకి వెళితే.. బాధితురాలు, ఆశిష్ కపూర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. కొద్ది రోజులయ్యాక ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇదే క్రమంలో ఆశిష్ ఆ అమ్మాయిని తన హౌస్ పార్టీకి ఆహ్వానించాడు. అక్కడ బాత్రూమ్ లో అఅమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు దీనిని వీడియో షూట్ కూడా చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే, పోలీసులు తమ దర్యాప్తులో ఇంకా ఎటువంటి వీడియో కనుక్కోలేదని చెబుతున్నారు. ఈ కేసులో అశిష్ స్నేహితుడు, అతని స్నేహితుని భార్య, మరో ఇద్దరు వ్యక్తులపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా ఈ పార్టీలో తనకు ఇచ్చిన డ్రింక్స్ లో ఆశిష్ ఏదో కలిపాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియో లీక్ చేస్తానని ఆశిష్ బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది.. ఈ సంఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
40 ఏళ్ల ఆశిష్ కపూర్ ‘ష్ష్ష్… ఫిర్ కోయి హై’, ‘ససురల్ సిమర్ కా 2’, ‘యే రిష్ట క్యా కెహ్లతా హై’, ‘సాత్ ఫెరే.. సలోనీ కా సఫర్’, ‘సరస్వతీచంద్ర’, ‘మోల్కీ- రిష్టోన్ కి అగ్ని పరీక్ష’ వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటించాడు. ముఖ్యంగా ‘దేఖా ఏక్ ఖ్వాబ్’లో ఉదయ్ పాత్రను ఆశిష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఆశిష్ గతంలో కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచాడు. ‘దేఖా ఏక్ ఖ్వాబ్’ సీరియల్‌లో అతనితో కలిసి నటించిన ప్రియల్ గోర్‌తో ప్రేమ వ్యవహారం నడిపాడని ప్రచారంలో ఉంది. అయితే ఈ సీరియల్ ముగిసిన వెంటనే వారిద్దరి బంధం కూడా బీటలు వారిందని టాక్. దీని తర్వాత ఆశిష్ నిర్మాత పెర్ల్ గ్రేతో డేటింగ్ చేశాడు మరియు. ఏప్రిల్ 2021లో నిశ్చితార్థంకూడా చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకు ఆమెతోనూ విడిపోయాడు. వీరి తర్వాత యూరోపియన్ మహిళ ఇడా క్రోనీతో కూడా ఆశిష్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే ఇప్పుడు అతనిపై ఆత్యాచార ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.