Bigg Boss Telugu 8: మొదటి వారంలోనే బయటికి.. బిగ్ బాస్ నుంచి బెజవాడ బేబక్క ఎంత సంపాదించారో తెలుసా?

|

Sep 09, 2024 | 2:22 PM

మొదటివారం నామినేషన్స్ లో బేబక్క తో పాటు నాగ మణికంఠ, సోనియా, విష్ణుప్రియ, పృథ్వి, శేఖర్ భాష.. ఇలా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా ఆదివారం (సెప్టెంబర్ 08) ఎపిసోడ్ లో బేబక్కని బయటకు పంపించేశారు. ఓటింగ్ లో వీళ్లందరి కంటే బేబక్కకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 8: మొదటి వారంలోనే బయటికి.. బిగ్ బాస్ నుంచి బెజవాడ బేబక్క ఎంత సంపాదించారో తెలుసా?
Bigg Boss Telugu 8
Follow us on

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమై అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యింది. చాలా మంది అనుకున్నట్లు గానే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ బెజవాడ బేబక్క మొదటి వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. మొదటివారం నామినేషన్స్ లో బేబక్క తో పాటు నాగ మణికంఠ, సోనియా, విష్ణుప్రియ, పృథ్వి, శేఖర్ భాష.. ఇలా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా ఆదివారం (సెప్టెంబర్ 08) ఎపిసోడ్ లో బేబక్కని బయటకు పంపించేశారు. ఓటింగ్ లో వీళ్లందరి కంటే బేబక్కకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తద్వారా ఎనిమిదో సీజన్ నుంచి నిష్క్రమించిన తొలి కంటెస్టెంట్ గా బేబక్క నిలిచారు. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే హౌస్ లో మాత్రం బేబక్క పెద్దగా ఆకట్టుకోలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఈ వారం రోజులు ఆమె కిచెన్ కే పరిమితమయ్యారు. మిగతా కంటెస్టెంట్స్ కే వండి పెట్టడంతోనే సరిపోయింది. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఆమె నుంచి పెద్దగా ఎంటర్‌ టైన్మెంట్ ఏమీ రాలేదు. దీనికి తోడు కుక్కర్ గొడవతో బేబక్కపై నెగెటివీటీ మరింత పెరిగిపోయిందని, ఇవే ఆమె ఎలిమినేషన్ కు గల కారణాలుగా చెబుతున్నారు.

ఇక తొలి వారంలోనే బేబక్క బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే ఎలిమినేట్ అయిన బేబక్క హౌస్ లో వారం రోజులు ఉన్నందుకు గాను ఎంత సంపాదించారు? అంటూ నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన బేబక్క రెమ్యునరేషన్ రోజుకు రూ. 21, 428 అని సమాచారం. అంటే ఈ వారం రోజులు హౌస్ లో ఉన్న బేబక్క సుమారుగా రూ. 1.50 లక్షల నుంచి రూ. 2లక్షల వరకు సంపాదించారని సమాచారం.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో బేబక్క..

బిగ్ బాస్ నుంచి మొదటి వారంలోనే వెళ్లిపోవడంతో బేబక్క భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. ‘ బిగ్ బాస్ తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఆ జర్నీ అప్పుడే అయిపోయింది. నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది’ అని రాసుకొచ్చారు బేబక్క.

వారం రోజులోనే ఎన్నో జ్ఞాపకాలు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.