Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8వ సీజన్ 14 మంది కంటెస్టెంట్స్ వీళ్లే.. లిస్టులో తెలంగాణ కుర్రాళ్లు

|

Sep 01, 2024 | 10:55 PM

ఈ కొత్త సీజన్ లో చాలా మార్పులు చేశారు. గతంలో కంటెస్టెంట్స్ ను సింగిల్ గా హౌస్ లోకి పంపించేవారు. కానీ.. ఈసారి మాత్రం జోడీగా పంపించారు. అలా మెుత్తం 7 జంటలు అంటే 14 మంది ఈసారి హౌస్ లోకి వెళ్లారు. వీరిలో సీరియల్ నటులు, యూట్యూబర్లు, సినిమా నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యాంకర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8వ సీజన్ 14 మంది కంటెస్టెంట్స్ వీళ్లే.. లిస్టులో తెలంగాణ కుర్రాళ్లు
Bigg Boss Telugu 8
Follow us on

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 01) సాయంత్రం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ షురూ అయ్యింది. మూడో సీజన్ నుంచి హోస్ట్ గా చేస్తూ వస్తున్న కింగ్ నాగార్జునే ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కొత్త సీజన్ లో చాలా మార్పులు చేశారు. గతంలో కంటెస్టెంట్స్ ను సింగిల్ గా హౌస్ లోకి పంపించేవారు. కానీ.. ఈసారి మాత్రం జోడీగా పంపించారు. అలా మెుత్తం 7 జంటలు అంటే 14 మంది ఈసారి హౌస్ లోకి వెళ్లారు. వీరిలో సీరియల్ నటులు, యూట్యూబర్లు, సినిమా నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యాంకర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ తొలి కంటెస్టెంట్ గా ‘కృష్ణ ముకుందా మురారీ’ సీరియల్ నటి యష్మీ గౌడ ఎంట్రీ ఇచ్చింది. అలాగే రెండో కంటెస్టెంట్ గా ప్రముఖ బుల్లితెర నటుడు నిఖిల్ హౌస్ లోకి అడుగు పెట్టారు. మరి వీరితో పాటు ఈసారి హౌస్ లో కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన 14 మంది ఎవరో తెలుసుకుందాం రండి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 14 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే

  • యష్మీ గౌడ (సీరియల్ నటి)
  • నిఖిల్ మలియక్కల్ (సీరియల్ నటుడు)
  • అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్)
  • ప్రేరణ కంభం (సీరియల్ నటి)
  • ఆదిత్య ఓం (నటుడు)
  • సోనియా ఆకుల (నటి)
  • బెజవాడ బేబక్క (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)
  • శేఖర్ బాషా (ఆర్జే)
  • కిర్రాక్ సీత (యూట్యూబర్)
  • నాగ మణికంఠ (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)
  • పృథ్వీరాజ్ ( సీరియల్ నటుడు)
  • విష్ణు ప్రియ (యాంకర్)
  • నైనిక (ఢీ డ్యాన్సర్)
  • అఫ్రిదీ (యూట్యూబర్)

మొదటి కంటెస్టెంట్ గా యష్మీ గౌడ..

కాగా గత సీజన్ లాగానే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నట్లు సమాచారం. నాలుగైదు వారాలు ముగిసిన తర్వాత మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం.

తెలంగాణ నుంచి ఇద్దరు..

యాంకర్ విష్ణుప్రియ కే ఎక్కువ క్రేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.