Bigg Boss OTT Telugu: బిగ్‏బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. మాజీలతోపాటు కొత్తగా వెళ్లేవారు వీళ్లే..

|

Feb 22, 2022 | 6:57 PM

బుల్లితెర ప్రేక్షకులకు నాన్‏స్టాప్ ఎంటర్‏టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‏బాస్ (Bigg Boss). కేవలం ఒక గంట కాకుండా.. ఈసారి 24 గంటలు వినోదాన్ని

Bigg Boss OTT Telugu: బిగ్‏బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. మాజీలతోపాటు కొత్తగా వెళ్లేవారు వీళ్లే..
Bigg Boss Telugu Ott
Follow us on

బుల్లితెర ప్రేక్షకులకు నాన్‏స్టాప్ ఎంటర్‏టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‏బాస్ (Bigg Boss). కేవలం ఒక గంట కాకుండా.. ఈసారి 24 గంటలు వినోదాన్ని ప్రేక్షకులను చేరువచేసేందుకు బిగ్‏బాస్ ఓటీటీ అంటూ సరికొత్త ప్రయత్నం చేస్తుంది. ఈ షో ఈ నెల 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన లోగో.. ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగే.. బిగ్‏బాస్ ఓటీటీకి కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు. అయితే ఈ బిగ్‏బాస్ ఓటీటీ వస్తోంది అన్నప్పటి నుంచి కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంపై తెగ చర్చ నడుస్తోంది. ఇందులో మాజీ కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా.. కొత్తవారు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

అయితే గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్‏బాస్ ఓటీటీలో మాజీ కంటెస్టెంట్స్‏తోపాటు.. సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి కూడా కొత్తవా3రు రాబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్‏ను సెలక్ట్ చేశారని.. వారిని క్వారంటైన్‏లో ఉంచారని సమాచారం. ఈ క్రమంలో బిగ్‏బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ప్రచారం నడుస్తోంది. అందులో యాంకర్ స్రవంతి, ఆవకాయ సినిమా హీరోయిన్ బింధుమాధవి.. యాంకర్ శివ ఉన్నట్లు సమాచారం. ఇక మాజీ కంటెస్టెంట్స్‏గా అందులో ధనరాజ్, ముమైత్ ఖాన్.. తనీష్, ఆదర్శ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, అరియానా, అఖిల్ సార్థక్, సరయూ, హమీదా, నటరాజ్ మాసర్ బిగ్‏బాస్ మాజీ కంటెస్టెంట్స్ గా పాల్గోనబోతున్నారు.

అలాగే యూట్యూబర్ యాంకర్ నిఖిల్, యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, బిందు మాధవి, యాంకర్ శివ, బమ్ చిక్ బబ్లూ, కప్పు ముఖ్యం బిగులూ వెంకట్ (సన్నీ ఫ్రెండ్), మిత్రా శర్మ, శ్రీరాపాక, రోహిణి, రోల్ రైడా ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక బిగ్‏బాస్ ఓటీటీ దాదాపు 84 రోజులు.. అంటే 12 వారాలు ఉండే అవకాశం ఉందని.. ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టి మరిన్ని రోజులు పెంచుకునేందుకు ఆలోచిస్తున్నారట నిర్వహకులు. అయితే నెటిజన్స్ ఆలోచనలకు తగినట్టుగానే తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసి ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి అంటూ క్విజ్ పెట్టారు. అయితే ఆ హీరోయిన్ బింధు మాదవి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Alekhya Harika: ఎక్స్‏ప్రెషన్ క్వీన్ అంటూ దేత్తడి హారిక పోస్ట్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Ghani: మెగా అభిమానులకు బ్యాడ్‏న్యూస్.. బాబాయ్ సినిమా కోసం గని వెనకడుగు..

Samantha: “ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ”.. నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సమంత..

Aha Indian Idol Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం..