Bigg Boss Telugu 9: అందుకే బిగ్‌బాస్‌కు వచ్చావంటూ రీతూపై విషం కక్కిన ఆయేషా.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఏడో వారంలోకి అడుగు పెట్టింది. ఎప్పటిలాగే నామినేషన్స్ హోరా హోరీగా సాగాయి. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ మళ్లీ శ్రుతి మించి ప్రవర్తించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆయేషా జీనత్ నోటి దురుసు ఎక్కువైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu 9: అందుకే బిగ్‌బాస్‌కు వచ్చావంటూ రీతూపై విషం కక్కిన ఆయేషా.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 9

Updated on: Oct 20, 2025 | 4:01 PM

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం (అక్టోబర్ 20) జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఒక యుద్ధాన్ని తలపించింది. కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా ఆయేషా జీనత్ రీతూ చౌదరిపై పర్సనల్ అటాక్ చేసింది. ‘ ఎందుకే నీకీ ఓవరాక్షన్.. అసలు హౌస్ లో నీ పద్దతే నచ్చడం లేదు.. కేవలం లవ్ ట్రాక్స్ కోసమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చావ్’ అంటూ రీతూపై నీచమైన కామెంట్స్ చేసింది ఆయేషా. దీనికి రీతూ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఈ తతంగం చోటు చేసుకుంది. నామినేషన్స్ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. కెప్టెన్స్ అయిన సుమన్ శెట్టి-గౌరవ్ ఇద్దరినీ చెరో పిల్ సెలక్ట్ చేసుకోవాలని బిగ్‌బాస్ కోరాడు. దీంతో సుమన్ శెట్టి ఆరెంజ్, గౌరవ్ బ్లూ కలర్ పిల్‌ని ఎంచుకున్నారు. తర్వాత వీళ్లు ఆ పిల్ పవర్‌తో హౌస్‌లో చెరో వ్యక్తిని సెలక్ట్ చేసుకోమని సూచించాడు. అలా సెలక్ట్ చేసుకున్న వారికి నామినేట్ చేసే పవర్ వస్తుందన్నమాట. దీంతో సుమన్ శెట్టి ఇమ్మాన్యుయేల్ ను, గౌరవ్ అయేషాను సెలెక్ట్ చేసుకున్నారు. ఆపై వీరిద్దరికి బెలూన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గదిలో ఉన్న బెలూన్స్ అన్నిటినీ పగలగొట్టి నామినేషన్స్ టికెట్స్ తీసుకోవాలన్నాడు. అలా టికెట్స్ పొందిన వారికి నామినేషన్స్ చేసే పవర్స్ వస్తాయన్నాడు. అలా ఆయేషాకు మూడు స్లిప్స్, ఇమ్మాన్యుయేల్ కు 5 స్లిప్స్ లభించాయి. అందులో ఉన్న పవర్స్‌ని ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చాడు

మొదట ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్, దివ్య నికితా, రమ్య మోక్ష, తనూజ, రీతూ చౌదరిలకు ఒక్కో స్లిప్ ఇచ్చేశాడు ఇమ్మూ. ఇక అయేషా ఏమో సంజన, శ్రీనివాస్ ఇద్దరికీ చెరో స్లిప్ ఇచ్చేసి డైరెక్ట్ నామినేట్ చేసే పవర్ ఉన్న స్లిప్‌ని మాత్రం తన దగ్గర పెట్టుకుంది. ఆ పవర్‌తోనే రీతూ చౌదరిని డైరెక్ట్ నామినేట్ చేసింది అయేషా. ఇక స్లిప్స్ అందుకున్న మిగిలినవారు తోటి హౌస్ మేట్స్ ను నామినేట్ చేశారు. అలా ఫైనల్ గా నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ లిస్ట్‌లో చేరారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. వీరిలో వైల్డ్‌కార్డ్స్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మొత్తానికి ఏడో వారంలో రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, దివ్య, సంజనా, రమ్య మోక్ష, శ్రీనివాస సాయి నామినేషన్స్ లో నిలిచారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..