Bigg Boss Telugu 9: అయ్యో.. చెల్లి పెళ్లి చూడలేకపోయిన తనూజ.. పూజ మ్యారేజ్ ఫొటోస్ వైరల్
ఇంట్లో చెల్లి పెళ్లంటే అక్కే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకుంటుంది. ఎంతో ఆనందంగా అన్ని బాధ్యతలను భుజానవేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఆ బాధ్యతలను, ఆ ఆనందాన్ని రెండింటినీ మిస్ అవుతోంది బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ తనూజ .తాజాగా ఆమె చెల్లి పూజ పెళ్లి ఘనంగా జరిగింది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ఓ సాధారణ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది తనూజ. అయితే హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేననుకుంది. కుటుంబ సభ్యులు కూడా తనూజ వెంటనే వచ్చేస్తుందిలే అనుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభంలో ఆడియెన్స్ కూడా చాలా మంది ఇదే అనుకున్నారు. తనూజ త్వరగా వెళ్లిపోతుందనుకున్నారు.. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ రేసులో నిలిచింది తనూజ. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైన ఆమె బిగ్ బాస్ కప్పు గెల్చుకోవడం లాంఛనమే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ సంగతి పక్కన పెడితే.. తనూజ తన ఫ్యామిలీని బాగా మిస్ అవుతోంది. చివరకు తన చెల్లి కూడా చూడలేకపోయింది. ఇటీవలే తనూజ చెల్లి పూజ పెళ్లి ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు తనూజ చెల్లికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో ఇంత పెద్ద శుభకార్యంలో అక్క లేకపోవడం తీరని లోటని అభిప్రాయ పడుతున్నారు.
కాగా నవంబర్ 23 నాటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో తన చెల్లి పెళ్లి జరిగిందన్న తనూజ.. నాగార్జునతో కొత్తజంటకు ఆశీర్వాదాలు ఇప్పించింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో తనూజ కోసం ఆమె చెల్లి పూజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూజను చూడగానే తనూజ కన్నీళ్లు ఆపలేకపోయింది. అలాగే శుభ లేఖలో తన పేరు చూసుకుని మురిసిపోయింది తనూజ. పెళ్లికి వెళ్లే ఛాన్స్ లేనందున బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో తన చేతులతో చెల్లెల్ని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసింది. తన చెల్లికి దీవెనలు అందించింది. ఈ సందర్భంగా తన పెళ్లికి బిగ్‌బాస్ టైటిల్ గిఫ్ట్‌గా కావాలని చెప్పింది పూజ. చెల్లికిచ్చిన మాటను నెరవేర్చడానికి బాగానే కష్టపడుతోంది తనూజ. బిగ్ బాస్ టైటిల్ రేసులో టాప్ ప్లేస్ లో దూసుకెళుతోంది.
బిగ్ బాస్ హౌస్ లో చెల్లిని పెళ్లి కూతురుగా చేస్తోన్న తనూజ.. వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








