Bigg Boss: ఓరి మీ ‘దుంప’ తెగ.. మరీ చీప్‌గా వాటి కోసం కొట్టుకోవడమేందిరా? బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ఘటన
ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ నడుస్తోంది. మలయాళంలో ఇప్పటికే ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడగా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ రియాలిటీ షో లు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. తాజాగా ఈ రియాలిటీ షోలో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది.

బిగ్ బాస్ హౌస్ లో గొడవలు సర్వసాధారణం. అందులో ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ లేదు. అసలు బిగ్ బాస్ హౌస్ లో గొడవలు లేని రోజు లేదు. టాస్క్ లు, నామినేషన్లు, ఫుడ్, కంటెస్టెంట్ల ఈగోలు.. ఇలా రకరకాల కారణాలతో హౌస్ లో గొడవలు జరుగుతుంటాయి. ఈ సీజన్ లోనూ కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నాయి. ఒక్కోసారి ఈ గొడవలు మరీ శ్రుతిమించిపోతున్నాయి. ఆగ్రహావేశాలతో కొట్టుకునేంత పని చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ కన్నడ సీజన్ లోనూ కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. అది కూడా ఓ సిల్లీ రీజన్ తో.. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 రన్ అవుతోంది. ఈ షో కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఈ వారం రఘు, సూరజ్ కిచెన్ వర్క్ తీసుకున్నారు. ధ్రువంత్, అశ్విని కూడా వంటచేస్తామంటూ పిండి ఇతర పదార్థాలను తీసుకున్నారు.కానీ రఘుకు ఇది ఏ మాత్రం నచ్చలేదు. ధ్రువంత్ తో వాగ్వాదానికి దిగాడు. మొదట మాటలతో చిన్నగా మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఇతర కంటెస్టెంట్స్ కూడా తలదూర్చడంతో బిగ్ బాస్ హౌస్ ఒక చిన్నపాటి రణక్షేత్రంలా మారిపోయింది.
ముఖ్యంగా బంగాళాదుంపల విషయంపై కంటెస్టెంట్లు గొడవ పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘నువ్వు ఈ రోజు బంగాళాదుంపలు తిని వాటిని ఖాళీ చేస్తే, రేపు మనం తినాలనుకున్నప్పుడు మనకు ఏమీ ఉండదు‘ అని ధ్రువంత్, అశ్విని ఆగ్రహం వ్యక్తం చేయగా.. రజత్ ‘నోరు మూసుకుని సర్దుకోండి‘ అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో ధ్రువంత్ మరింత రెచ్చిపోయాడు. అన్ని విడి విడిగా ఉంచండి.. ఎవరి వాటా వారికి పంచండి‘ అని అన్నాడు. ఇంతలో మరో కంటెస్టెంట్ కావ్య ఈ గొడవలోకి తలదూర్చింది. అన్నిటినీ సమంగా తూకం వేసి పంచుకోవాలంది. రజత్ కూడా ఇదే విషయమై బిగ్ బాస్ కు సూచన ఇచ్చాడు. బియ్యంతో సహా కిచెన్ లో ఉన్న వంట పదార్థాలన్నింటినీ తూకం వేసి షేర్ చేయలన్నాడు. తరువాత అశ్విని, రఘు కూడా ఇదే విషయంపై తగవులాడుకున్నారు. ఇలా మొత్తానికి బంగాళాదుంపలతో మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








