Bigg Boss Telugu 9: దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ చౌదరి తల్లి.. మరీ అలా అనేసిందేంటి?

బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి, దివ్వెల మాధురి మధ్య ఓ పెద్ద యుద్ధమే జరిగింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ముఖ్యంగా డిమాన్ పవన్- రీతూ చౌదరీల రిలేషన్ షిప్ విషయంలో దివ్వెల కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Bigg Boss Telugu 9: దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ చౌదరి తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
Bigg Boss Telugu 9

Updated on: Dec 08, 2025 | 6:18 PM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి వచ్చేసింది. సెప్టెంబర్ 7న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ షో ఇప్పటివరకు 13 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 14వ వారంలోకి అడుగు పెట్టేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ పడనుంది. ఇక ఈ ఆదివారం (డిసెంబర్ 07) ఎపిసోడ్ లో రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యింది. టాప్ కంటెస్టెంట్ గా టాప్-5లో ఉంటుందనుకున్న ఆమె అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ప్రెస్ మీట్ పెట్టింది రీతు. ఈ సందర్భంగా తన బిగ బాస్ ప్రయాణం, డిమాన్ పవన్ తో రిలేషన్ షిప్ తదితర విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఈ మీడియా సమావేశంలో రీతూతో పాటు ఆమె తల్లి కూడా పాల్గొంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దివ్వెల మాధురి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ రీతూ చౌదరి తల్లిని ఒక ప్రశ్న అడిగాడు.. ‘ రీతూ, డిమోన్ రిలేషన్ బాగాలేదని, మీ అమ్మాయిని అతనితో దూరంగా ఉండమని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న దివ్వెల మాధురి కి మీరు ఫోన్ చేసి చెప్పారట. నిజమేనా’ అని అడగ్గా, రీతూ చౌదరి తల్లి ఇలా స్పందించింది. ‘ఆమె (మాధురి) అన్నీ అబద్దాలు చెప్పింది.నేను ఎవరికీ ఫోన్ చేసి ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పలేదు’ అని చెప్పింది. అంతేకాదు దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడంపై కూడా సెటైర్లు వేసింది. ఇలా మొత్తానికి అందరి ముందు మాధురి పరువు తీసేసింది రీతూ చౌదరి తల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి గురించి మాధురి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి రీతూ తల్లి చేసిన వ్యాఖ్యల పై దివ్వెల మాధురి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.