
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆదివారం (సెప్టెంబర్ 7) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంఛ్ జరగనుంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.సుమారు 2 నిమిషాల 29 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలో చాలా మంది కంటెస్టెంట్లను మనం అంచనా వేయచ్చు. ‘ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌజ్‌తో.. డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9′ అని నాగార్జున వాయిస్‌తో ప్రోమో ప్రారంభమైంది. ఎప్పటిలాగే కలర్ ఫుల్ సూట్ లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు నాగ్. ముఖ్యంగా నాగార్జున స్టైలిష్ లుక్, స్టైల్, స్వాగ్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. అయితే ఎప్పటిలాగే ఈ ప్రోమోలో కంటెస్టెంట్ల ఫేస్‌ను రివీల్ చేయకుండా చూపించారు. ప్రోమోలో ఒక సూట్ కేసు పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నది మరెవరో కాదు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్. నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 ఇందు వదన, సుందర వదనా వావ్’ అంటూ మెగాస్టార్ చిరంజీవి స్లాంగ్ లో చెప్పిన వాయిస్ ను బట్టి అతను కచ్చితంగా ఇమ్మాన్యుయేలే అని అర్థమై పోతుంది. ఇక ‘పిక్చర్ అబీ బాకీ హై’ అని లక్స్ పాప, హీరోయిన్ ఆశా శైనీ అనడం చూడొచ్చు. ఇక హకీ స్టిక్ తో కనిపించినది సీరియల్ నటుడు భరణి అని చెప్పవచ్చు.
తర్వాత ఓ మేల్ కంటెస్టెంట్ ఒక బాక్స్ పట్టుకుని బిగ్ బాస్ వేదిక పైకి వస్తాడు. ‘బాక్స్‌ను తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉందా’ అని నాగార్జున అడుగుతాడు. ‘బిగ్ బాస్ ఇది నా బాడీలో ఓ భాగం. దయచేసి లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వండి’ అని బిగ్ బాస్‌తో చెప్పుకుంటాడు ఆ కంటెస్టెంట్. ‘ఏం మీతో తెచ్చుకోడానికి వీళ్లేదు’ అని బిగ్ బాస్ చెబుతాడు. ‘అయితే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను’ అంటూ ఆ కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేట్ అవుతాడు . దీనికి ‘అది మీ ఇష్టం’ అని బిగ్ బాస్ అంటాడు. దీంతో ‘నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు. కానీ, బిగ్ బాస్ హౌజ్‌లోకి కాదు’ అని నాగార్జున చెబుతాడు. దాంతో ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి రాకుండానే బయటకు వెళ్లిపోతాడు. ఇక కామనర్స్ క్యాటగిరీలో కల్కి, దాలియాలతో నాగ్ ముచ్చటించిన తీరు నవ్వులు తెప్పించింది.
Commoners with raw fire 🔥 vs Celebrities with star power ✨ Double surprises 💥 Double entertainment 🎭 Double the dose of Bigg Boss 👁️💥
Catch the Grand Launch of #BiggBossSeason9 Tonight at 7PM on #StarMaa#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandLaunch pic.twitter.com/QRy6zQ7X7R
— Starmaa (@StarMaa) September 7, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.