Bigg Boss Telugu 9: సుమన్ శెట్టి మెడ పట్టుకుని నెట్టేసిన డిమాన్ పవన్.. మెడికల్ రూమ్‌కు పిలిచిన బిగ్‌బాస్.. వీడియో

బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంలో సైలెంట్ గా ఉన్న సుమన్ శెట్టి ఇప్పుడు తన అసలు సిసలు ఆట తీరును చూపిస్తున్నాడు. ఆటల్లో నైనా మాటల్లో నైనా సై అంటే సై అంటున్నాడు. అయితే తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.

Bigg Boss Telugu 9: సుమన్ శెట్టి మెడ పట్టుకుని నెట్టేసిన డిమాన్ పవన్.. మెడికల్ రూమ్‌కు పిలిచిన బిగ్‌బాస్.. వీడియో
Bigg Boss Telugu 9

Updated on: Sep 18, 2025 | 6:39 PM

బిగ్ బాస్ హౌస్ లో మాటలతో పాటు ఆటలూ ముఖ్యమే. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను కంప్లీట్ చేసినప్పుడే కంటెస్టెంట్స్ కు మంచి మార్కులు పడతాయి. అయితే ఒక్కోసారి ఈ టాస్కులు మరి వయలెంట్ గా ఉంటాయి. కంటెస్టెంట్స్ కూడా మొరటుగా ప్రవర్తిస్తుంటారు. తోటి వారికి ఏమైనా పర్లేదు మనం గెలిస్తే చాలు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో డిమాన్ పవన్ ఆట తీరు చూస్తే సరిగ్గా ఇలాగే అనిపించింది. టాస్కులో భాగంగా ఓనర్స్, టెనెంట్స్ కు ఒక టైమర్ ఇచ్చారు. వాళ్ల టైం అయిపోయేలోపు పు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తూ ఉంటాడు. అది పూర్తి చేస్తే ఒక్క గంట టైం పెరుగుతుంది. అలా చివరి వరకు రెండు టీమ్స్ లో ఎవరి టైం అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్లు విజేత. మొదటి టాస్కులో భాగంగా కంటెస్టెంట్స్ కు ఒక పెద్ద చక్రం ఇచ్చాడు బిగ్ బాస్. దాని చివర ఉన్న హ్యాండిల్ ని కేవలం ఒక్క చేత్తో మాత్రమే పట్టుకోవాలి. ఒక టీం సభ్యుడి పక్కన మరో టీం సభ్యుడు నిల్చుకోవాలి. బయట తమ టీం కి సంబంధించిన వాళ్లను మరొకరిని ఉంచుకోవచ్చు. వాళ్లు వచ్చి పక్క టీం వాళ్లను గేమ్ నుంచి తప్పించవచ్చు.

అదే విధంగా గేమ్ ఆడుతున్న వాళ్లు కూడా ఇదే పని చేయవచ్చు. ఈ టాస్క్ లో ఇమ్మానుయేల్, భరణి అదరగొట్టారు. సుమన్ శెట్టి కూడా బాగా ఆడాడు. చివరి వరకు టాస్కును నెట్టుకుని వచ్చాడు. అయితే ఆఖరిలో కామనర్ డిమాన్ పవన్ సుమన్ ను తప్పించేందుకు అతని మెడ పట్టుకుని పక్కకు తోసేశాడు. దీంతో సుమన్ శెట్టి పల్టీలు కొడుతూ పక్కన పడిపోతాడు. ఈ టాస్కులో సుమన్ కు దెబ్బలు కూడా తగిలాయని టాక్. అందుకే అతనిని మెడికల్ రూమ్ కు కూడా పిలిచినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

అయితే డిమాన్ పవన్ కావాలని సుమన్ శెట్టిని తోసేయ్యలేదని కేవలం గేమ్ గెలవాలన్న కుతూహలంతోనే ఇలా చేశాడని అర్థమవుతోంది. అయితే సుమన్ శెట్టి అభిమానులు మాత్రం డిమాన్ పవన్ పై మండిపడుతున్నారు. గేమ్ గెలిచేందుకు మరీ ఇంత మొరటుగా ప్రవర్తించాలా? అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ టాస్క్ కు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి