AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ షో వల్లే నాకు మంచి అవకాశాలు.. కానీ ఇప్పుడు అస్సలు వెళ్లను: మాజీ కంటెస్టెంట్

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఒకసారి కంటే ఎక్కువ సార్లు పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలా మందే ఉన్నారు. వరుసగా రెండు సీజన్లలో పాల్గొన్న వారు కూడా చాలా మందే ఉన్నారు. మరి ఈ సీజన్ లో కూడా మాజీ కంటెస్టెంట్స్ ఒకరిద్దరు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ షో వల్లే నాకు మంచి అవకాశాలు.. కానీ ఇప్పుడు అస్సలు వెళ్లను: మాజీ కంటెస్టెంట్
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Jun 29, 2026 | 8:48 PM

Share

బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీవీ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో పదో సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఎప్పటిలాగే సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 10 ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో కంటెస్టెంట్ల ఎంపికలో కూడా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ల కు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.. జబర్దస్త్ వర్ష, పవిత్ర, వర్షిణీ, ఎక్స్ ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, పల్లవి గౌడ, నందూస్ వరల్డ్ ఫేమ్ నందన, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కల్యాణ్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, జబర్దస్త్ వర్ష, వర్షిణీ, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌ తదితరుల పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో కనిపిస్తున్నాయి. అయితే గతంలో ఈ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న కొందరు ఈ రియాలిటీ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ యాంకర్, జబర్దస్త్ ఫేమ్ జోర్దార్ సుజాత బిగ్ బాస్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘ నేను కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలని హైదరాబాద్ సిటీకి వచ్చాను. కానీ నా భాష, మాట్లాడే తీరు బాగుందని కొందరు జర్నలిజం వైపు వెళ్లమని సూచించారు. అలా జోర్దార్ కార్యక్రమంతో నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జోర్దార్ షోతో వచ్చిన గుర్తింపే నన్ను బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 వరకు తీసుకెళ్లింది. బిగ్‌బాస్ తర్వాత నాకు మరిన్ని మంచి అవకాశాలు వచ్చాయి. సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు, టెలివిజన్ షోల్లో ఛాన్స్ లు వచ్చాయి. నిజం చెప్పాలంటే బిగ్‌బాస్ నా కెరీర్‌కు మైనస్ కాలేదు. ఆ షో వల్లే మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యాను. ప్రస్తుతం కూడా బిజీగా ఉన్నాను’ అని సుజాత చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

భర్త రాకింగ్ రాకేష్ తో సుజాత..

View this post on Instagram

A post shared by Sujatha P (@jordarsujatha)

ఇదే క్రమంలో మళ్లీ అవకాశం వస్తే బిగ్‌బాస్‌లో పాల్గొంటారా? అన్న ప్రశ్నకు సుజాత ఇలా ఆన్సర్ ఇచ్చింది. ‘అమ్మో… ఇప్పుడు అస్సలు వెళ్లను. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి బిగ్ బాస్ షోకు వెళ్లాను. ఇప్పుడు నాకు కుటుంబం ఉంది. ఒక చిన్న పాప కూడా ఉంది. షూటింగ్‌కి వెళ్లడమే కష్టంగా అనిపిస్తోంది. అలాంటిది నెలల తరబడి ఇంటికి దూరంగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉండడం ఇప్పుడు సాధ్యం అయ్యే పని కాదు’ అని పేర్కొంది.

View this post on Instagram

A post shared by Sujatha P (@jordarsujatha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us