
ఇప్పటివరకు 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ రియాల్టీ షో.. ఇప్పుడు సీజన్ 9తో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనున్నట్లు ముందు నుంచి ప్రకటిస్తున్నారు. అయితే ఈసారి సీరియల్, సినిమా సెలబ్రెటీలతోపాటు సామాన్యుడిని సైతం హౌస్ లోకి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ ఎంట్రీగా వెళ్లాలని ఇఫ్పటికే 20 వేల మందికి పైగా దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో దాదాపు 40 మంది వరకు ఎంపిక చేయగా.. ఇప్పుడు హౌస్ లోకి వెళ్లాలంటే.. ముందుగా అగ్నిపరీక్షను దాటాల్సిందే అంటూ తాజాగా ప్రకటించారు. ఈ అగ్నిపరీక్ష కోసం ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ ను రంగంలోకి దింపారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రివీల్ చేశారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
తాజాగా విడుదలైన ప్రోమోలో.. బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి.. బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా ఉండనున్నారు. ఇక ఈ అగ్నిపరీక్షకు శ్రీముఖి హోస్టింగ్ చేయనుంది. మీరందరూ డ్రీమ్ చేసిన స్పాట్ లైట్ ఇదే.. బిగ్‌బాస్ సీజన్ 9 హౌస్ లోకి మీ ఎంట్రీ టికెట్. ఇక్కడ స్పాట్ లైట్.. అక్కడ ఎంట్రీ టికెట్.. అంత ఈజీ కాదు.. చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఇక ఆ తర్వాత ఒక్కో జడ్జీ తమస్టైల్లో ఎలివేషన్ ఇచ్చారు. “నా మైండ్ గేమ్ గురించి మీకు తెలుసు.. కానీ ఈసారి అగ్నిపరీక్షలో మీ మైండ్ బ్లో అయిపోతుంది. రెడీగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చాడు అభిజిత్.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ఆ తర్వాత “మాస్క్ అంటేనే ఫేక్.. నా ముందు ఉంది రెండే ఆప్షన్స్. బ్లాకా లేక వైటా.. ఈ అగ్నిపరీక్షలో తేల్చేద్దాం” అంటూ బింధుమాధవి ఎంట్రీ ఇచ్చింది. చివరగా “ఏంటీ సీరియస్ అవుతున్ారు. ఎంటర్టైన్మెంట్ ఉండదనుకుంటున్నారా.. ? నేనున్నాను కదా.. అగ్నిపరీక్షలో మీ స్ట్రెస్ ఎలా బరస్ట్ చేయాలో వాళ్లను ఎలా స్ట్రెస్ చేయాలో నేను చూసుకుంటాను” అంటూ నవదీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ముగ్గురిని దాటుకుని అగ్నిపరీక్ష గెలిచినవాళ్లే బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ అగ్నిపరీక్ష ను ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు హాట్ స్టార్ లో ప్రతిరోజూ స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..