AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Achanta: రెండోసారి తండ్రి కాబోతున్న ‘రంగస్థలం’ మహేష్.. భార్య మెటర్నిటీ ఫొటోషూట్ పిక్స్ చూశారా?

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మహేష్ అచంట ఒకడు. ఇక రంగస్థలం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైనా సత్తా చాటాడీ రాజోలబ్బాయి. దీంతో పాటు పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన మహేష్ తాజాగా ఒక శుభవార్తతో మన ముందుకు వచ్చాడు.

Mahesh Achanta: రెండోసారి తండ్రి కాబోతున్న 'రంగస్థలం' మహేష్.. భార్య మెటర్నిటీ ఫొటోషూట్ పిక్స్ చూశారా?
Mahesh Achanta
Basha Shek
|

Updated on: Aug 14, 2025 | 6:22 PM

Share

మహేశ్‌ ఆచంట అలియాస్ రంగ స్థలం మహేశ్ శుభవార్త చెప్పాడు. త్వరలో తాను రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతని భార్య పావని నిండు గర్భంతో ఉంది. ఈ సందర్భంగా భార్య మెటర్నటీ ఫొటో షూట్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు మహేష్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మహేష్ – పావని దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేశ్‌.. తన సమీప బంధువులమ్మాయి అయిన పావనిని వివాహం చేసుకున్నాడు. 2020 కరోనా లాక్ డౌన్ కాలంలో వీరి పెళ్లి జరిగింది. ఇప్పటికే ఈ దంపతులకు ఓ కూతురు. ఇప్పుడు రెండోసారి అమ్మనాన్నలు కానున్నారీ క్యూట్ కపుల్. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మహేశ్‌ ఆచంట. ఆ తర్వాత రంగ స్థలం సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తర్వాతనే మహేష్‌ కాస్తా.. రంగస్థలం మహేష్ గా మారిపోయాడు. చాలా సినిమాల్లో కామెడీతో నవ్వించిన మహేష్.. కొన్ని సినిమాల్లో ఎమోషనల్‌ సీన్స్‌లో నటించి ఏడిపించాడు కూడా. ఇక మహానటి తదితర సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తోనూ ఆకట్టుకున్నాడు. యాత్ర, మహర్షి, గుణ 369, రాజాది గ్రేట్, శతమానం భవతి, సినిమా చూపిస్త మావా, ఖైదీ నంబర్ 150, కాటమ రాయుడు, రారండోయ్ వేడుక చూద్దాం, డిస్కో రాజా, జాతిరత్నాలు, గుంటూరుకారం, విరూపాక్ష, సీతారామం, రజాకార్, డెవిల్, కొండ పొలం, మ్యాస్ట్రో, ప్రతి రోజూ పండగే, తండేల్‌ తదితర సినిమాలు మహేష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

మెటర్నిటీ ఫొటో షూట్ లో మహేష్, పావని..

ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ది రాజా సాబ్ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు మహేష్. దీంతో పాటు పలు క్రేజీ సినిమాలు ఈ కమెడియన్ చేతిలో ఉన్నాయి.

సాయి పల్లవితో కలిసి..

మెగాస్టార్ చిరంజీవితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?