AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మ మనసు చాటుకున్న టాలీవుడ్ యాంకర్.. NICU శిశువుల కోసం చనుబాలు దానం.. ఒక నెలలోనే ఏకంగా..

2019లో పెళ్లిపీటలెక్కిన ఈ అందాల తార అమ్మతనం ఎన్నో ఎదురు దెబ్బలు తింది. రెండు సార్లు అబార్షన్ కావడంతో కడుపులో బిడ్డను పోగొట్టుకుంది. ఇలా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు అమ్మ తనాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది. అదే సమయంలో తన ఆనందాన్ని మరికొంత మంది తల్లులకు పంచుతోంది.

Tollywood: అమ్మ మనసు చాటుకున్న టాలీవుడ్ యాంకర్.. NICU శిశువుల కోసం చనుబాలు దానం.. ఒక నెలలోనే ఏకంగా..
Tollywood Anchor
Basha Shek
|

Updated on: Aug 12, 2025 | 6:07 PM

Share

బిడ్డ పుట్టిన ఏడాది వరకు శిశువులకు తల్లి పాలే పట్టించాలని వైద్యులు చెబుతుంటారు. ఏడాది కాకపోయినా కనీసం ఆరు నెలల వరకు అయినా పసి బిడ్డలకు తల్లి పాలే అవసరం. అయితే చాలా మంది తల్లులకు పాలు సరిగా పడవు. దీంతో డబ్బా పాలు లేదా పోత పాలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇలాంటి అవసరం రాకుండా చాలా మంది తల్లులు తమ బిడ్డలకు పట్టగా మిగిలిన పాలను (బ్రెస్ట్‌మిల్క్‌)ను దానం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకప్పటి టాలీవుడ్ యాంకర్‌, బుల్లితెర హీరోయిన్ సమీరా షెరిఫ్ అమ్మగా తన గొప్ప మనసును చాటుకుంది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె NICU (నియో నాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) శిశువుల కోసం 6 లీటర్లకు పైగా తల్లిపాలను భద్రపర్చింది. అది కూడా కేవలం ఒక నెల రోజుల్లోనే. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల యాంకరమ్మ. ఇప్పుడే కాదు ఇక ముందు కూడా శిశువులకు అత్యంత అవసరమైన బంగారం లాంటి తల్లి పాలను డొనేట్‌ చేస్తానంటూ ఒక అందమైన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ పంచుకుంది.

‘కేవలం ఒక నెల రోజుల్లోనే అల్లా, నేను, నా బిడ్డ సయ్యద్‌ అమీర్‌ ఇది సాధించాం. ఇకముందు కూడా శిశువులకు తల్లి పాలను డొనేట్‌ చేస్తాం. దీనివలన తల్లులకు ఎలాంటి నష్టం జరగదు. ఇది పెద్ద కష్టమేమీ కాదు. మీ బాడీ మీద, మీమీద, మీ బిడ్డ మీద నమ్మకం ఉంటే చాలు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి, విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. బాగా తినండి. నీళ్లు బాగా తాగండి. బాగా సంతోషంగా ఉండండి. ఎంత ఎక్కువగా పాలు ఇస్తే..అంత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మాతృమూర్తులు భయపడాల్సిన అవసరం లేదు’ అని తల్లులకు భరోసా ఇచ్చింది సమీరా.

ఇవి కూడా చదవండి

సమీరా షేర్ చేసిన వీడియో ఇదే..

ఈ టాలీవుడ్ యాంకరమ్మ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు సమీరా షెరీఫ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

యాంకర్ సమీరా ఇన్ స్టా గ్రామ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలో కొండ పైనుంచో, ఆకాశం నుంచో పడిపోతున్నట్లు కల వచ్చిందా?
నిద్రలో కొండ పైనుంచో, ఆకాశం నుంచో పడిపోతున్నట్లు కల వచ్చిందా?
స్మశానం నుండి తిరిగి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని తప్పు ఇదే..
స్మశానం నుండి తిరిగి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని తప్పు ఇదే..
‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది: అలియా భట్
‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది: అలియా భట్
నిజాయితీకి ప్రతిఫలం దక్కుతుందా..? గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం
నిజాయితీకి ప్రతిఫలం దక్కుతుందా..? గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం
కామాఖ్య ఆలయం 3 రోజులు ఎందుకు మూసివేస్తారు? అంబుబాచి మేళా వెనుక..
కామాఖ్య ఆలయం 3 రోజులు ఎందుకు మూసివేస్తారు? అంబుబాచి మేళా వెనుక..
రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి
రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి
తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. మాంసం కూరలేనా..
తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. మాంసం కూరలేనా..
వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల వృద్దురాలు!
వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల వృద్దురాలు!
ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిన్నారులు.. ‘ఫ్రీ ఫైర్’ మోజుతో..
ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిన్నారులు.. ‘ఫ్రీ ఫైర్’ మోజుతో..
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో