Bigg Boss 5 Telugu: బోర్‏డమ్‏కి చెప్పేయండి గుడ్ బై .. వచ్చేస్తున్నాడు బాస్..

ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న బిగ్‏బాస్ సీజన్ 5 వచ్చేస్తోంది. గత కొంత కాలంగా ఈ షో పై వస్తున్న కథనాలకు చెక్ పెడుతూ..

Bigg Boss 5 Telugu: బోర్‏డమ్‏కి చెప్పేయండి గుడ్ బై .. వచ్చేస్తున్నాడు బాస్..
Bigg Boss 5

Edited By: Rajeev Rayala

Updated on: Aug 16, 2021 | 10:17 PM

ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న బిగ్‏బాస్ సీజన్ 5 వచ్చేస్తోంది. గత కొంత కాలంగా ఈ షో పై వస్తున్న కథనాలకు చెక్ పెడుతూ.. ఒక్కో అప్‏డేట్ ఇస్తున్నారు నిర్వహాకులు. ఈసారి బిగ్‏బాస్ షోకు హోస్ట్‏గా నాగార్జున కాకుండా.. రానా వస్తున్నాడని ప్రచారం జరిగింది. ఈక్రమంలో తాజాగా విడుదల చేసిన ప్రోమోతో క్లారిటీ ఇచ్చేసారు. ఇటీవల బిగ్‏బాస్ సీజన్ 5 లోగో విడుదల చేసిన నిర్వహాకులు… తాజాగా బిగ్‏బాస్ సీజన్ 5 ప్రోమో విడుదల చేశారు.

ఇందులో నాగార్జున సరికొత్త లుక్‏తో ఫుల్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చారు. బోర్‏డమ్‏కి చెప్పేయండి గుడ్ బాయ్.. బిగ్‏బాస్ సీజన్ 5 వచ్చేసింది అంటూ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఒకట్టిన్నర నిమిషం ఉన్న ఈ వీడియోను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. గతేడాది కరోనా సంక్షోభ సమయంలోనూ బిగ్ బాస్ 4 సీజన్‏ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పటికే ఈ షోకు వచ్చే కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లోబో, యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్, ఆర్జే కాజల్, శ్వేత, నటి ప్రియా, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్, వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, ప్రియాంక, నవ్యస్వామి, యూట్యూబర్ నిఖిల్, ఆట సందీప్ దంపతులు ఇలా అనేక మంది పేర్లు వినిపిస్తోంది. అలాగే ఆగస్ట్ 22 నుంచి కంటెస్టెంట్స్ క్యారంటైన్‏లోకి వెళ్లబోతున్నారని.. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కానున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.


Also Read: Vijay Devarakonda: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముక ప్రియకు బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆనందంతో గంతులేసిన సింగర్..

Meera Mithun: పోలీసులకు చుక్కలు చూపించిన మీరా మిథున్.. టచ్ చేస్తే ఆత్యహత్య చేసుకుంటా.. వీడియో వైరల్..

Paagal Movie Review: అమ్మలాంటి ప్రేమ కోసం ‘పాగల్‌’ పాట్లు.. ఇంతకీ లవ్‏లో పాసవుతాడా!

Akkineni Sumanth: విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ మెన్.. మళ్లీ మొదలైందంటున్న సుమంత్..