AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 103 episode: టాస్క్‌లు, గొడవలతో రచ్చ రచ్చగా సాగిన ఎపిసోడ్‌.. సిరి, సన్నీల గొడవకు ఫుల్‌స్టాప్‌ పడేనా.?

Bigg Boss Telugu 5 Live Updates: బిగ్ బాస్ సీజన్ 5 మరి కొన్ని రోజుల్లో ముగియబోతుంది. దాంతో ఎవరు విన్నర్ అవుతారా అన్నది ఆసక్తిగా మారింది. హౌస్ లో ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.

Bigg Boss 5 103 episode: టాస్క్‌లు, గొడవలతో రచ్చ రచ్చగా సాగిన ఎపిసోడ్‌.. సిరి, సన్నీల గొడవకు ఫుల్‌స్టాప్‌ పడేనా.?
Siri
Narender Vaitla
|

Updated on: Dec 16, 2021 | 11:06 PM

Share

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ ముగియనున్న నేపథ్యంలో 103వ ఎపిసోడ్‌ను బిగ్‌బాస్‌ రకరకాల టాస్క్‌లతో ఫన్నీగా క్రియేట్‌ చేశాడు. బిగ్‌బాస్‌ అనుకున్నట్లే మొదటి 4 టాస్క్‌లు చాలా ఫన్నీగా కొనసాగాయి. హౌస్‌మేట్స్‌ కూడా స్ఫూర్తివంతంగా టాస్క్‌ల్లో పాల్గొన్నారు. గెలుపు, ఓటమి అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్‌ చేశారు. అయితే అంతా సవ్యంగా సాగితే అది బిగ్‌బాస్‌ షో ఎలా అవుతుంది చెప్పండి.

బిగ్‌బాస్‌ ఇచ్చిన 5వ టాస్క్‌ అయిన రోప్‌ టాస్క్‌ గొడవకు దారి తీసింది. సిరి, సన్నీల మధ్య మొదలైన మాటల యుద్ధం హౌస్‌లో తీవ్ర రచ్చకు దారి తీసింది. సన్నీపై సిరి తీవ్ర స్థాయిలో మాట్లాడడం, అలాగే సన్నీ కూడా సిరిపై అరవడంతో హౌస్‌ అంతా సీరియస్‌ వాతావరణం నెలకొంది. సీజన్‌ ప్రశాంతంగా ముగుస్తుందనుకుంటున్న సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన గొడవతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలా గురువారం ఎపిసోడ్ రకరకాల ఎమోషన్స్‌తో ముగిసింది. మరి సిరి, సన్నీల మధ్య గొడవ రేపటి ఎపిసోడ్‌తో అయినా ముగుస్తుందా. లేదా ఈ రచ్చ ఇలాగే కొనసాగుతుందా వేచి చూడాలి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Dec 2021 10:49 PM (IST)

    సిరి, సన్నీల మధ్య చిచ్చు పెట్టిన రోప్‌ టాస్క్‌..

    బిగ్‌బాస్‌ ఇచ్చిన 5వ టాస్క్‌ సిరి, సన్నీల మధ్య గొడవకు దారి తీసింది. గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన రోప్‌లను ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నట్లు ఎవరు ఎక్కువసేపు చేస్తారో వారు గెలిచినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అయితే ఈ విషయమై సిరి, సన్నీల మధ్య గొడవ జరిగింది. ‘అసలు నువ్వు ఏం ఆడావు’ అని సన్నీ అనేసరికి సిరి కోపం తెచ్చుకుంది. జోక్‌గా అన్నాను అని సన్నీ చెబుతున్నా సిరి, రెచ్చిపోయి సన్నీపై పడింది. పక్కవాళ్లు గెలిస్తే సన్నీ సహించడు అంటూ చెప్పుకొచ్చింది.

  • 16 Dec 2021 10:42 PM (IST)

    4వ టాస్క్‌లో శ్రీరామ్‌ విజయం..

    103వ ఎపిసోడ్‌లో టాస్క్‌ల పరంపర కొనసాగుతోంది. 4వ టాస్క్‌లో భాగంగా హౌస్‌ మేట్స్‌కి పలు రకాల సౌండ్‌లను వినిపించిన బిగ్‌బాస్‌ వాటిని బోర్డ్‌లపై రాయమని ఆదేశించాడు. ఈ టాస్క్‌లో శ్రీరామ్‌ చంద్ర అందరికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఇచ్చి మొదటి స్థానంలో నిలిచాడు.

  • 16 Dec 2021 10:32 PM (IST)

    మరో ఆసక్తికర టాస్క్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌..

    బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు మరో ఆసక్తికర టాస్క్‌ను ఇచ్చారు. గార్డెన్‌ ఏరియాలోని కుర్చీలపై అందరిని కూర్చొమని చెప్పిన బిగ్‌బాస్‌ విచిత్రమైన టాస్క్‌ను ఇచ్చాడు. 13 నిమిషాలను మనసులో లెక్కించమని చెప్పిన బిగ్‌బాస్‌ ఎవరు సరిగ్గా సమయానికి లెక్కించి బెల్‌ మోగిస్తారో.. వారికి స్పెషల్‌ గిఫ్ట్‌ ఇస్తానని తెలిపాడు. టాస్క్‌ మధ్యలో సన్నీ అందరినీ డిస్ట్రబ్‌ చేస్తూ అల్లరి చేశాడు. ఇక ఈ టాస్క్‌లో సిరి 5వ స్థానం, సన్నీ 4, మానస్‌ 3, శ్రీరామ్‌ 2వ స్థానంలో నిలవగా 13 నిమిషాలకు దగ్గర్లో లెక్కపెట్టి షణ్ముఖ్‌ విజయాన్ని సాధించాడు. దీంతో బిగ్‌బాస్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ ఫుడ్‌ను అందరూ సమానంగా పంచుకున్నారు.

  • 16 Dec 2021 10:20 PM (IST)

    హౌస్‌మేట్స్‌కు మొట్టికాయలు వేసిన బిగ్‌బాస్‌..

    బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ను హెచ్చరించాడు. మానస్‌, శ్రీరామ్‌, సన్నీ అజాగ్రత్తగా వ్యవహరించడం, ఇంటిపైకి ఎక్కడం సరికాదని సూచించారు. ఇక ఫినాలేకు ముందు హాని కలిగించే పనులు చేయడం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించాడు. దీంతో వారు బిగ్‌బాస్‌కు క్షమాపణలు తెలిపారు. అంతేకాకుండా ఉత్సాహాన్ని గమనించానని చెప్పిన బిగ్‌బాస్‌ గార్డెన్‌ ఏరియాను శుభ్రంచేయాలని కండిషన్‌ పెట్టాడు. దీంతో సిరి, షణ్ముఖ్‌లు నవ్వుకున్నారు.

  • 16 Dec 2021 10:14 PM (IST)

    సందడిగా సాగిన స్విమ్మింగ్ పూల్‌ టాస్క్‌..

    103వ ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌ మెట్స్‌కు మరో టాస్క్‌ ఇచ్చాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ అవతలి వైపు వెళ్లి టీషర్ట్‌లు ధరించాలనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌కు సన్నీని సంచాలక్‌గా నియమించాడు. ఇందులో షణ్ముఖ్‌, మానస్‌లు పాల్గొన్నారు. సన్నీ టీషర్ట్‌లను దూరంగా వేస్తూ ఇద్దరినీ టీజ్‌ చేశాడు సన్నీ. సాధారణంగా టాస్క్‌లు అంటే రచ్చ రచ్చ జరుగుతుంది కానీ.. సీజన్‌ ముగుస్తున్న నేపథ్యంలో హౌస్‌ మేట్స్‌ చాలా సందడిగా గడిపారు. ఇక అత్యధికంగా 23 టీషర్ట్‌లను ధరించి మానస్‌ విజయాన్ని సాధించాడు.

  • 16 Dec 2021 10:09 PM (IST)

    బెలున్‌ టాస్క్‌లో రెచ్చిపోయిన హౌస్‌ మేట్స్‌..

    సీజన్‌ 5 ముగుస్తున్న నేపథ్యంలో టాస్క్‌లతో బిగ్‌బాస్‌ హౌస్‌ మేట్స్‌ మళ్లీ కష్టపెట్టించాడు. బెలున్‌ టాస్క్‌లో భాగంగా పంపు సహాయంతో బెలున్లకు గాలి కొట్టమని ఇచ్చిన టాస్క్‌లో షణ్ముఖ్‌ విజయం సాధించాడు. దీంతో ఎప్పటిలాగే సిరి, షణ్ముఖ్‌ను హత్తుకొని మళ్లీ గట్టిగా హగ్‌ ఇచ్చేసింది.

  • 16 Dec 2021 10:04 PM (IST)

    మొదలైన 103వ ఎపిసోడ్..

    బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ముగియడానికి ఇంకా కేవలం మూడే రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో. గురువారం 103 ఎపిసోడ్‌ ప్రారంభమైంది. ఉదయం లేవగానే హౌస్‌ మేట్స్‌ ‘గాజువాక పిల్లా’ పాటకు స్టెప్పులేస్తూ 102వ రోజును ప్రారంభించారు. మరి ఈ రోజు హౌస్‌లో ఎలాంటి హంగామా జరుగుతుందో చూద్దాం.

  • 16 Dec 2021 09:58 PM (IST)

    సిరి – సన్నీ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్

    ఈ టాస్క్ సిరి – సన్నీ మధ్య చిచ్చు పెట్టింది. సిరి ముందుగా సన్నీని వేవ్స్ రాలేదు అని అంది. దాంతో  సన్నీ సిరి దగ్గరకు వెళ్లి ఓడిపోయావ్ గా అన్నాడు. దాంతో మళ్లీ గొడవ మొదలైంది. ఒకరి నొకరు తిట్టుకుంటూ నానా రచ్చ చేశారు.

  • 16 Dec 2021 09:54 PM (IST)

    టాస్క్‌లో గెలిచిన సన్నీ..

    ఈ టాస్క్‌లో ముందుగా సిరి అవుట్ అయ్యింది. ఆతర్వాత షణ్ముఖ్ ఓడిపోయాడు.. చివరకు సన్నీ గెలిచాడు.. సన్నీని మానస్ బాగా ఎంకరేజ్ చేశాడు. సిరి షణ్ముఖ్ కు సపోర్ట్ చేసిన అతడు అవుట్ అయ్యాడు. ఫైనల్ గా సన్నీ విన్ అయ్యాడు.

  • 16 Dec 2021 09:51 PM (IST)

    సన్నీ, సిరి, షణ్ముఖ్ మధ్య పోటీ..

    ఆ తర్వాత మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ రోప్ వర్కౌట్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఈ టాస్క్ లో సన్నీ, సిరి, షణ్ముఖ్ పాటిస్పెట్ చేశారు.

  • 16 Dec 2021 09:47 PM (IST)

    కప్పకు ఎలుకకు ఉన్న సంబంధం ఏంటి.?

    ఆ తర్వాత సిరిని కప్పకు ఎలుకకు ఉన్న సంబంధం ఏంటి అని అని అడిగాడు బిగ్ బాస్, ఆలాగే షణ్ముఖ్ రాసిన వాటిలో చివరిగా ట్రాక్టర్ బ్రాకెట్లో సిరి అని రాసాడు..

  • 16 Dec 2021 09:46 PM (IST)

    బిగ్ బాస్‌కు దొరికిపోయిన సన్నీ..

    ముందుగా సన్నీ బోర్డు పై రాసి బిగ్ బాస్ కు చూపించాడు. అయితే సన్నీ ఫ్రాగ్ స్పెల్లింగ్ తప్పుగా రాసి బిగ్ బాస్ కు దొరికిపోయాడు. దాంతో అందరు నవ్వేశారు..

  • 16 Dec 2021 09:42 PM (IST)

    ఫన్నీగా సాగిన టాస్క్..

    ఆ తర్వాత కొన్ని సాంగ్స్ ను ఒక సీక్వెన్స్ లో ప్లే చేశారు . ఆ పాటలను బోర్డ్స్ పై రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ చాలా  ఫన్నీ గా సాగింది.

  • 16 Dec 2021 09:40 PM (IST)

    లేబుల్ లేదు మచ్చా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్..

    ముందుగా లేబుల్ లేదు మచ్చా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో లేబుల్ లేని టీషర్ట్స్ వేసుకొని స్విమింగ్ పూల్లో‌ ఈత కొట్టాలి. ఈ టాక్స్‌లో షణ్ముఖ్, మానస్ పటిస్పెట్ చేశారు.

  • 16 Dec 2021 09:38 PM (IST)

    గతంలో ఇచ్చిన టాస్క్ లనే మళ్ళీ ఇచ్చాడు బిగ్ బాస్..

    తాజగా నేటి ఎపిసోడ్ సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో గతంలో ఇచ్చిన టాస్క్ లనే మళ్ళీ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లు సరదాగా సాగాయి.

  • 16 Dec 2021 09:35 PM (IST)

    టాప్ 5లో శ్రీరామ్.. మానస్.. షణ్ముఖ్.. సన్నీ.. సిరి

    టాప్ 5లో ఉన్న శ్రీరామ్.. మానస్.. షణ్ముఖ్.. సన్నీ.. సిరీల ఎమోషనల్ జర్నీ కార్యక్రమాలతో బిగ్ బాస్ చివరి వారం సాగుతుంది. ఇక చాలా కాలం తర్వాత ఈ ఐదుగురు కలిసి సరదాగా గేమ్స్ ఆడుకుంటూ సందడి చేస్తున్నారు.

  • 16 Dec 2021 09:23 PM (IST)

    హౌస్‌లో ఉన్న ఐదుగురిలో ఒకరు..

    ఇక బిగ్ బాస్ సీజన్ 5 నుంచి ఒక్కక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు హౌస్ లో ఐదుగురు హౌస్ మేట్స్ మిగిలారు.సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్ టాప్ 5లో నిలిచారు. ఇక వీరిలో ఒకరు బిగ్ బాస్ విన్నర్ అవ్వనున్నారు.

  • 16 Dec 2021 09:18 PM (IST)

    చివరి దశకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 5

    మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 5 కు గుడ్ బై చెప్పనున్నారు కింగ్ నాగార్జున.. ఇదే చివరి వారం. ఇక హౌస్ లో ఉన్న వారిలో ఎవరు విజేత అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Published On - Dec 16,2021 9:16 PM