AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఒక్క క్లిక్ తో మీ అభిమాన కంటెస్టెంట్ కు ఓటేయండిలా..

Bigg Boss 5 Finale Voting: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్ -5 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నడూలేనంతగా19 మంది పోటీదారులతో

Bigg Boss 5 Telugu: ఒక్క క్లిక్ తో మీ అభిమాన కంటెస్టెంట్ కు ఓటేయండిలా..
Bigg Boss 5 Telugu
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 18, 2021 | 1:20 PM

Share

Bigg Boss 5 Finale How to Vote: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్ -5 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నడూలేనంతగా19 మంది పోటీదారులతో ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఈ ఆదివారంతో శుభం కార్డు పడనుంది. షణ్ముఖ్, సిరి, సన్నీ, శ్రీరామ్, మానస్.. ఈ ఐదుగురిలో ఒకరు ఒకరు ఈసారి బిగ్ బాస్ సీజన్ విజేతగా అవతరించనున్నారు. దీని కోసం గత ఆదివారం నుంచే ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి వరకూ అభిమానులు తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓటు వేయవచ్చు. కాగా టాప్- 5కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్ ఓటింగ్‌లో కూడా నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. సన్నీ, షణ్ముఖ్‌ల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ శ్రీరామ్, మానస్, సిరిలను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్‌బాస్ ట్రోఫీ ఎవరి చేతుల్లోకి వెళ్తుందా? అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బిగ్‌బాస్‌ మొదటి రెండు సీజన్లకు ‘గూగుల్‌ ఓటింగ్‌ సిస్టమ్‌’ను ఉపయోగించేవారు. అయితే మూడో సీజన్ నుంచి హాట్ స్టార్ యాప్ ఓటింగ్‌ విధానం కొనసాగుతోంది . దీంతో పాటు మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేసే విధానం కూడా అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడున్న ఆన్‌లైన్ ఓటింగ్‌ సరళిని చూస్తుంటే సన్నీ టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్నాడని తెలుస్తోంది. షణ్ముఖ్ కు కూడా భారీగా ఓట్లు పడుతున్నాయని తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఐదుగురిలో మీరూ మీ అభిమాన కంటెస్టెంట్‌కు ఓటేయాలని అనుకుంటున్నారా? ఒక్క మిస్ట్‌ కాల్‌తో సపోర్టుగా నిలవాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి.

ఆన్‌లైన్‌లో ఎలా ఓటు వేయాలంటే.. హాట్ స్టార్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకుని అందులో బిగ్ బాస్ అని సెర్చ్ చేస్తే.. టాప్- 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఫొటోలు కనిపిస్తాయి. ఆ కిందనే బ్లూ కలర్‌‌తో VOTE అని రాసి ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసి మీరు ఎవరికి ఓటు వేయాలని అనుకుంటారో వాళ్ల ఫొటోపై క్లిక్ చేస్తే ఓటు పడుతుంది. ఒక్కొక్కరికి గరిష్ఠంగా10 ఓట్లు వేయ వచ్చు. దీంతో పాటు ఈ పది ఓట్లను మనకు నచ్చినట్టుగా కూడా షేర్ చేయవచ్చు.

మిస్డ్ కాల్ ఓటింగ్‌.. ఫైనల్‌కు చేరిన ఐదుగురు పోటీదారులకు ఐదు ప్రత్యేక నంబర్లను కేటాయించారు. 1. సిరి హనుమంత్ 8886658201

2. వీజే సన్నీ 8886658202

3. మానస్ 8886658216

4. శ్రీరామ్ చంద్ర 8886658204

5. షణ్ముఖ్‌ జస్వంత్ 8886658210

ఈ నంబర్లకు జస్ట్‌ మిస్డ్ కాల్ ఇస్తే కాలు మీ అభిమాన కంటెస్టెంట్‌కు మీ ఓటు పడుతుంది. ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఒక ఓటు వేయొచ్చు. రోజులో ఒక్కో నంబర్‌ నుంచి 50 వరకూ ఓట్లు వేయొచ్చు.