Bigg Boss Telugu 5: హమ్మయ్యా.. షణ్ముఖ్ ఫామ్‌లోకి వచ్చేశాడు… శ్వేతా భుజంపై చేయివేసి..
బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఎపిసోడ్ నుంచి రసవత్తరంగా సాగిస్తుంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య నిత్యం గొడవలు, ఏడుపులు అన్ని బిగ్ బాస్ షోను టాప్ రేటింగ్‌లో కంటిన్యూ అయ్యేలా చేస్తున్నాయి.
Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఎపిసోడ్ నుంచి రసవత్తరంగా సాగిస్తుంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య నిత్యం గొడవలు, ఏడుపులు అన్ని బిగ్ బాస్ షోను టాప్ రేటింగ్‌లో కంటిన్యూ అయ్యేలా చేస్తున్నాయి. ఇక హౌస్‌లో రోమాన్స్ కూడా ఎక్కువైంది. రీసెంట్‌గా ప్రియా రవికి -లహరి మధ్య జరిగిన విషయాన్నీ బయటపెట్టేయడంతో అంతా షాక్ అయ్యారు. అర్ధరాత్రి ఇద్దరు బాత్రూంలో హగ్ చేసుకున్నారని.. అది తన కళ్లారా చూశానని ప్రియా చెప్పడంతో దుమారం రేగింది. దీని పై హౌస్‌లో పెద్ద రచ్చే జరిగింది. అలాగే నిన్న ఎపిసోడ్‌లో ప్రియాంక మాట్లాడుతూ.. లోబో తనని అసభ్యకరంగా తాకడని చెప్పడంతో ప్రేక్షకులు మరింత షాక్‌కు గురయ్యారు. ఇలా హౌస్‌లో అంత రచ్చ రచ్చగా ఉంది. ఈ క్రమంలో తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో ఎప్పుడు సైలెంట్‌గా ఉండే షణ్ముఖ్‌కు బిగ్ బాస్ ఎదో వెరైటీ టాస్క్ ఇచ్చాడని అర్ధమవుతుంది. షణ్ముఖ్ శ్వేతా వర్మ దగ్గరకు వచ్చి… వచ్చిన డబ్బుల్ని తీసుకొని లోబోకి ఇవ్వకుండా చెక్కేద్దాం అని స్కెచ్ వేస్తాడు. దానికి శ్వేతా నీకు 50- నాకు 50 అంటుంది. ఆ తర్వాత షణ్ముఖ్ నన్ను పెళ్లి చేసుకో శ్వేతా అంటూ ఆమెకు ప్రపోస్ చేశాడు. ఆ తర్వాత లోబో శ్వేతకు ప్రపోస్ చేయడం.. అది షణ్ముఖ్ చూసి హార్ట్ అవ్వడం అంతా ఫన్నీగా చూపించారు. ఇలా ఫన్నీగా సాగుతున్న టైంలో శ్వేతా మేకప్ గురించి షణ్ముఖ్ నోరు జారాడు. దాంతో శ్వేతా సీరియస్ అయ్యింది. వెంటనే వెళ్లి దూరంగా కూర్చుంది. షణ్ముఖ్ సారి చెప్పడానికి ప్రయతించిన శ్వేతా వినలేదు. మరి ఇదంతా నిజంగానే జరిగిందా లేక చివరిలో ఏమైనా ట్విస్ట్ ఇస్తారన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాలిసిందే..
మరిన్ని ఇక్కడ చదవండి :