
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీషో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ.. ఇలా ప్రముఖ భాషలన్నింటిలోనూ ఈ రియాలిటీ షో నడుస్తోంది. తెలుగులో సీజన్ 9 ప్రారంభమై దాదాపు రెండు నెలల కావస్తోంది. పాత హౌస్ మేట్స్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తో ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు హౌస్ రణరంగంగా మారింది. కన్నడ, తమిళ్, మలయాళ బిగ్ బాస్ షోలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే క్రమంలో ఈ రియాలిటీ షోస్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘బిగ్ బాస్ హిందీ సీజన్ 19’ తరచూ వార్తల్లో నిలిచింది. కంటెస్టెంట్ల గొడవలు, ప్రవర్తిస్తోన్న తీరు, ఇతర వ్యవహారాలతో ఈ రియాలిటీ షో తీరుపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ గురించి మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ప్రణీత్ మోర్ ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చేశాడని వార్తలు వస్తున్నాయి.
ప్రణీత్ మోర్ ఇప్పుడు ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బిగ్ బాస్ 19’ ఇంట్లో ప్రణీత్ కు డెంగ్యూ సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ప్రణీత్ ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వైద్యులు ప్రణీత్ కు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రణీత్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య కారణాల వల్ల ప్రణీత్ మోర్ ‘బిగ్ బాస్ 19’ నుండి నిష్క్రమించడం అతని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రణీత్ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ‘బిగ్ బాస్ 19’లోకి తిరిగి ప్రవేశిస్తాడో లేదో చూడాలి. ఇంట్లో వారం రోజులు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ప్రణీత్‌కు మంచి మద్దతు లభించింది.
#PranitMore diagnosed with dengue, OUT of #BiggBoss19 house 😢💔
Get well soon 🙏@Rj_pranit #PranitKiPaltan #PranitIsTheBoss #BiggBoss pic.twitter.com/ukZ74uCdwx
— Celebrity Tak (@Celebrity_Tak) November 1, 2025
ప్రణీత్ మోర్ గురించి చెప్పాలంటే, సోషల్ మీడియాలో అతను చాలా ఫేమస్. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో కూడా అతనికి పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతను స్టాండ్-అప్ కమెడియన్ కూడా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.