
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో రెండో వైల్డ్ కార్డ్ గా టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస సాయి ఎంట్రీ ఇచ్చాడు. గోల్కొండ హైస్కూల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనివాస్. ఆతర్వాత కూడా పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. ఆపై హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. శుభలేఖలు, వినరా సోదర వీర కుమార వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాల్లోనూ శ్రీనివాస్ నటనకు చాలా మంచి పేరొచ్చింది. అయితే సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇప్పుడు బిగ్ బాస్ లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు రెడీ అయ్యాడీ యంగ్ హీరో. ‘ బిగ్ బాస్ హౌస్ లో ఏం చేయగలుగుతానో అది 100 శాతం చేయడానికి ప్రయత్నిస్తాను’ అని నాగార్జునతో చెప్పుకొచ్చాడు శ్రీనివాస్.
ఈ సందర్భంగా శ్రీనివాస్ కు ఒక ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. అదే డార్క్ బ్లూ స్టోన్.. అంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. నామినేషన్ల సమయంలో ఈ స్టోన్ ఉపయోగించొచ్చు. కానీ ఎప్పుడు ఉపయోగించాలి అనేది బిగ్ బాస్ చెప్తాడు అని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.
Relentless. Raw. Roaring. ⚡#SrinivasSai storms into the Bigg Boss house to turn up the heat and shake up Season 9! 🔥💫#BiggBossFireStorm
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/zdTfc35LZg
— Starmaa (@StarMaa) October 12, 2025
Bold. Blazing. Unbreakable.💥#RamyaMoksha enters the Bigg Boss house with fire in her heart and storm in her soul! 🌪️🔥#BiggBossFireStorm
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/Q0vNd3czoB
— Starmaa (@StarMaa) October 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.