Bigg Boss 9 Telugu: ఫ్యామిలీ వీడియోలతో సర్ ప్రైజ్ చేసిన నాగార్జున.. పిల్లల్ని చూసి సంజన కన్నీళ్లు.. బిగ్‌బాస్ ప్రోమో..

బిగ్‌బాస్‌ హౌస్ లో దీపావళి వేడుకలు మొదలయ్యాయి. హోస్ట్ నాగార్జున సహా మిగతా కంటెస్టెంట్స్ అందరూ సాంప్రదాయంగా ముస్తాబయ్యారు. తాజాగా ఆదివారం ప్రోమో రిలీజ్ చేశారు. అందులో పండగ పూట కంటెస్టెంట్లకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు నాగ్. అలాగే అందరికీ ఫ్యామిలీ వీడియోస్ చూపించారు. దీంతో కుటుంబసభ్యులను చూసి ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss 9 Telugu: ఫ్యామిలీ వీడియోలతో సర్ ప్రైజ్ చేసిన నాగార్జున.. పిల్లల్ని చూసి సంజన కన్నీళ్లు.. బిగ్‌బాస్ ప్రోమో..
Bigg Boss 9 Promo

Updated on: Oct 19, 2025 | 1:00 PM

బిగ్‌బాస్‌ సీజన్ 9.. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. తాజాగా విడుదలైన సండే ప్రోమోలో హోస్ట్ నాగార్జున సహా కంటెస్టెంట్స్ అందరూ సాంప్రదాయంగా ముస్తాబయ్యారు. అలాగే పండగ సందర్భంగా హౌస్మేట్స్ అందరికీ కొత్త బట్టలు పంపించారు నాగ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. దీపావళి మీ ఇంట్లో ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్. మా బిగ్‌బాస్‌ ఇంట్లో దీపావళికి రకరకాల టపాసులుంటాయి. మీరే మా క్రాకర్స్ అంటూ ప్రోమో రిలీజ్ చేశారు. ట్రెడిషన్ దుస్తుల్లో నాగార్జునను చూడగానే సార్ పెళ్లిచూపుల్లా కనిపిస్తున్నారు సార్ అంటూ సంజన సంతోషం వ్యక్తం చేసింది. దీంతో నాగ్..అవును.. నీకూ నాకా.. అంటూ పంచ్ వేశారు. ఈరోజు ఆటలో గెలిస్తే ఏమోస్తుందో చెప్పనా.. ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజ్ వస్తుంది. నేను ఈ మూడు పదాలు చెప్తాను. ఆ మూడు పదాలు విని సినిమా గెస్ చేయాలి అని నాగార్జున ఓ గేమ్ పెట్టారు.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

ఇక ముందుగా మహర్షి సినిమా పేరు కరెక్ట్ గా గెస్ చేసింది దివ్య నిఖిత. దీంతో ఇమ్ముతో కలిసి స్టెప్పులేసింది. ఆ త్రవాత దాయి దాయిదామ్మా పాటకు డ్యాన్స్ అదరగొట్టాడు సుమన్ శెట్టిచ. దీంతో సుమన్ డ్యాన్స్ చూసి అధ్యక్షా అదిరిపోయింది అంటూ పొగిడేశారు నాగ్. తర్వాత హౌస్మేట్స్ అందరికీ బట్టలు పంపించారు నాగ్. ఈరోజు నా కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకుందామని నేను మీ అందరికీ చిన్న గిఫ్ట్స్ తెచ్చాను అంటూ నాగార్జున సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

ఆ తర్వాత హౌస్మేట్స్ నుంచి కొంతమందిని సెలక్ట్ చేసి వీడియో మెసేజ్ ప్లే చేశారు. ముందుగా డీమాన్ పవన్ తల్లి వీడియో చూపించారు. తల్లిని చూడగానే పవన్ ఎమోషనల్ అయ్యారు. తర్వాత సుమన్ శెట్టి భార్య మాట్లాడారు. చివరగా సంజన భర్త తన ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకుని వీడియోలో కనిపించారు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్ సంజన.. అలాగే ఆడు.. నీ కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. హ్యాపీ దీపావళి నీకు అంటూ చెప్పుకొచ్చారు. తన భర్తతోపాటు పిల్లలను చూడగానే సంజన ఎమోషనల్ అయ్యింది. ముఖ్యంగా సంజన పాప, బాబు ఎంతో క్యూట్ గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..