Bigg Boss 9 Telugu : ఏంటీ భయ్యా ఇది.. భరణికి ఇంత పెద్ద కూతురు ఉందా.. ? తండ్రి కోసం అల్లాడిపోయింది..

భరణి.. ఒకప్పుడు బుల్లితెరపై స్రవంతి సీరియల్ ద్వారా విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసినప్పటికీ విలన్ పాత్రలతోనే కనిపించాడు. కానీ బిగ్ బాస్ సీజన్ 9తో అతడి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సీజన్ లో తన ఆట తీరు, ప్రవర్తనతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ వీక్ లో అతడికి సంబంధించిన ప్రోమో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Bigg Boss 9 Telugu : ఏంటీ భయ్యా ఇది.. భరణికి ఇంత పెద్ద కూతురు ఉందా.. ? తండ్రి కోసం అల్లాడిపోయింది..
Bigg Boss 9 Bharani

Updated on: Nov 20, 2025 | 1:15 PM

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ బాండింగ్స్, ప్రేమలు, ఆప్యాయతలతో సాగుతుంది. పదకొండవ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో తమ కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు కంటెస్టెంట్స్. ఇప్పటికే సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య కుటుంబాలు ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా భరణి కూతురు హౌస్ లోకి వచ్చింది. తన తండ్రిని కన్నీళ్లు పెట్టుకుంది. అటు చాలా రోజుల తర్వాత కూతురిని చూడగానే భరణి సైతం ఎమోషనల్ అయ్యారు. తన తండ్రికి తగిలిన గాయాలను చూసి అల్లాడిపోయింది. తాజాగా విడుదలైన ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంటుంది.

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

తాజాగా విడుదలైన ప్రోమోలో సర్ ప్రైజ్ అంటూ తన తండ్రి ఎదురుగా వచ్చింది. భరణికి ఇంత పెద్ద కూతురు ఉందా ? అంటూ హౌస్మేట్స్ తోపాటు ఇటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రావడంతోనే తండ్రిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే తండ్రికి తగిలిన గాయాలను చూస్తూ అల్లాడిపోయింది. నీ గురించే మా బెంగ అంతా.. నీ హెల్త్ జాగ్రత్త డాడీ.. అలా నిన్ను చూడలేకపోతున్నాం అంటూ తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. నిన్ను చూసి మాకు చాలా గర్వంగా ఉంది.. మీ కూతురిగా పుట్టడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

తర్వాత భరణి బాండింగ్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. ” అందరూ మిమ్మల్ని బాండింగ్స్ అని అంటున్నారు.. కానీ అది మీరు పెరిగిన వాతావరణం.. అందుకే అందర్నీ దగ్గరకు తీసుకుంటున్నారు. మీరు వాళ్లను బాగా చూసుకుంటున్నారని నాకు తెలుసు.. నిన్ను ఈ వారం కెప్టెన్ గా చూడాలి డాడ్” అని చెప్పింది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య బాండింగ్ ఇప్పుడు జనాలను ఆకట్టుకుంటుంది. అలాగే భరణి బాండింగ్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది.

ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..