
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్కులు నడుస్తున్నాయి. అలాగే లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్నవాళ్లకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పి్స్తున్నారు. గురువారం నాటి ఎపిసోడ్ లో తనూజ, సంజన అడియన్స్ నను ఎదుర్కోన్నారు. ముందుగా హౌస్ లోకి వచ్చిన ప్రేక్షకులకు ఓ ఫజిల్ ఇచ్చాడు బిగ్ బాస్. దయ, తెలివి, ధైర్యం మూడింటిలో ఏది ఇంపార్టెంట్ అని అడిగారు. వాటికి సంబంధించి ప్రశ్నలే తనూజ, సంజనకు ఎదురయ్యాయి. అయితే ఈ ఎపిసోడ్ లో తనూజకు చుక్కలు చూపించారు అడియన్స్. మొదటి నుంచి ఆమె ఆట తీరు గమనించిన అడియన్స్ సూటిగా ప్రశ్నిస్తూ తనూజను అడ్డంగా బుక్ చేశారు. “మీ ఏడుపు జెన్యూన్ గా అనిపించదు.. ఎందుకు అలా నటిస్తారు ? “ అని ఓ అడియన్ అడగ్గా.. నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు.. పక్కన అమ్మా, అమ్మామ్మా ఉండాలి.. కానీ అందరిని వదిలేసి కొత్త ప్రపంచంలోకి వచ్చాను. ఒక మాట అనేసరికి ఏడ్చేస్తాను. కావాలని కాదు.. ఫేక్ ఏం లేదని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..
మరో అడియన్ మాట్లాడుతూ.. “భరణిగారితో మంచి బాండింగ్ ఉండేది. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత మారిపోయారు. సడెన్ గా నాన్న నుంచి సార్ ఎందుకు అయ్యారు. మీ బాండింగ్ జెన్యూన్ అయినప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటీ ? “అని సూటిగా అడగ్గా.. ఎవరికి భయపడలేదు. ఆయనకు సపోర్ట్ చేయాలని ట్రై చేశాను. కానీ నాన్న అనే పిలుపు సింపథీగా క్రియేట్ అయ్యింది. నావల్ల కూతురు అనే సాఫ్ట్ కార్నర్ రాకూడదు. అందుకే సార్ అని పిలిచానని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..
“మీరు మాటలు ఫ్లిప్ అవుతున్నారు. ఇమ్మాన్యుయేల్ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. మళ్లీ కాదని అన్నారు. మాటలు మార్చేస్తున్నారు “ అని అడగ్గా.. ఫ్రెండ్ మీద కోపం వస్తే ఏదోకటి అంటారు కదా అని తనూజ అనడంతో.. “అలా ఏలా అంటారు. ఫ్రెండ్ కాదని మొహం మీద అనలేం “ కదా అని అడగ్గా.. అర్థంకానీ ఆన్సర్ ఇచ్చింది తనూజ. అలా చెప్పకుండా మేము అక్కడి నుంచి వెళ్లిపోతామని అడియన్స్ ఆన్సర్ ఇవ్వడంతో.. నేను నా కోపం చూపించానని చెప్పింది తనూజ. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో తనూజకు ఊహించని ప్రశ్నలే ఎదురయ్యాయి.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..