
బిగ్‌బాస్ సీజన్ 9.. మొదటి రెండు వారాల తర్వాత ఆట తీరు పూర్తిగా మారిపోయింది. గత సీజన్స్ మాదిరిగానే హౌస్మేట్స్ చెత్త పంచాయితీలు, అరుపులు, గొడవలు తప్ప అంత ఇంట్రెస్టింగ్ గా సాగడం లేదు. ఇక గత చివరి రెండు ఎలిమినేషన్స్ తర్వాత ఇటు నామినేషన్స్, ఓటింగ్ పై కూడా జనాలకు అంతగా ఆసక్తి ఉండడం లేదు. అలాగే ఈవారం ఓటింగ్ లో భారీగానే మార్పులు జరిగాయి. ముందు నుంచి టాప్ లో దూసుకుపోతున్న కంటెస్టెంట్స్ అనుహ్యంగా తగ్గిపోడం.. డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు ఓటింగ్ పెరిగింది. మరోవైపు శ్రీజ రీఎంట్రీ అంటూ సోషల్ మీడియా ఫ్యాన్స్ వరుస పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏడో వారం నామినేషన్లలో రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, రాము రాథోడ్, తనూజ, రమ్య మోక్ష, కళ్యాణ్ పడాల, సంజన, దివ్య నిఖిత ఉండగా.. వీరిలో ముందు నుంచి తనూజ టాప్ ఓటింగ్ తో దూసుకుపోతుంది. ఆమె తర్వాత కళ్యాణ్ పడాల అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
ఈవారం తనూజ తర్వాత కళ్యాణ్ పడాల రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరికి ముందు నుంచి పాజిటివ్ ఓటింగ్ వస్తుంది. అలాగే ఈవారం ఇమ్మాన్యూయేల్ తో గొడవ, కళ్యాణ్ పడాల దూరంతో తనూజకు సింపతి ఓటింగ్ పెరిగింది. వీరిద్దరి తర్వాత అనుహ్యంగా మూడో స్థానంలోకి దూసుకువచ్చింది దివ్య నిఖిత. నిజానికి గత వారం కూడా ఆమెకు తక్కువగానే ఓటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెకు ఆసక్తికరంగా ఓటింగ్ పెరిగి మూడో స్థానంలో ఉండడం విశేషం. అయితే దివ్యకు ఆకస్మాత్తుగా ఓటింగ్ పెరగడానికి కారణం రమ్య మోక్ష. ఆమె ఓవరాక్టింగ్, నోటి దురుసు, తనూజ, కళ్యాణ్ లను పర్సనల్ అటాక్ చేయడంతో పచ్చళ్ల పాపకు నెగిటివిటీ పెరిగిపోయింది. దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపాలని అనుకుంటూ దివ్యకు ఓట్లు గుద్దిపడేస్తున్నారు. రమ్యకు నెగిటివిటీ పెరగడంతో దివ్యకు ఓటింగ్ పెరిగి సడెన్ గా మూడో స్థానంలోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
దివ్య నిఖిత తర్వాత రీతూ చౌదరి, సంజన, సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఇక వీరిందరి తర్వాత రాము రాథోడ్, రమ్య మోక్ష డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో అడియన్స్ ఓటింగ్ ప్రకారం రమ్య లీస్ట్ లో ఉన్నారు. కానీ బిగ్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ఎవర్ని బయటకు పంపాలి ? ఎవరిని సేవ్ చేయాలి? అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని.. అలాగే వీకెండ్ లో మరో ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం రమ్య మోక్ష లీస్ట్ ఓటింగ్ ఉండగా.. ఆమె కాకుండా మరొకరిని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?